Tuesday, January 10, 2012

రాహుకాలం + యమఘండం

రాహుకాలం + యమఘండం
రాజకీయ నాయకులూ, ప్రేమికులు ఒకలాంటి వాళ్ళే. వాళ్ళు మీడియా ముందు, మైక్ ముందు ఆపకుండా అబద్హాలు చెప్పినట్టే, ప్రేమికులు అమ్మాయిల తో ఫోన్ లో అనర్గళం గా అబద్ధాలు చెప్పగల అసాధ్యులు. నమ్మకం లేదా? అయితే ఈ కథ చదవండి.
గమనిక: ఇందులో "{ }" ఫ్లవర్ బ్రాకెట్ లో వున్నది అబ్బాయి మనసులో వుండే మాటలు.
మన హీరొయిన్ ఇఫోనే నుంచి హీరో కి మిస్సిడ్ కాల్ ఇచ్చింది...
హీరో భోజనం చేస్తున్నాడు...ఆపకుండా continues గా పది మిస్సిడ్ కాల్ ఇచ్చింది.
హీరో: ఆపవే నీ తల్లి...ప్రశాంతం గా భోజనం  కూడా తిననివ్వవా. రాత్రి పది గంటలు అయితే సరి ఈ  మిస్సిడ్ కాల్ వర్షం కురిపిస్తావ్. ఏ "రాహుకాలం + యమఘండం"  కలసి వున్న సమయానికి  నాకు పరిచయం అయినట్టు వున్నావ్, అప్పటి నుంచి శని దరిద్రం తో సహజీవనం చేస్తున్నట్టు వుంది నా భతుకు,  అని తిట్టుకుంటూ తొందరగా భోజనం ముగించి హీరో ఫోన్ చూసాడు - పది మిస్సిడ్ కాల్ వుంది. ఛి దీని బతుకు, ఇఫోనే నుంచి కూడా మిస్సిడ్ కాల్ ఇస్తోంది. స్టీవ్ జాబ్స్ చచ్చి పోయాడు కాబట్టి బ్రతికిపోయాడు, ఇఫోనే నుంచి కూడా మిస్సిడ్ కాల్ ఇస్తారని తెలిసి వుంటే బకెట్ లో నీళ్ళు పోసి తల ముంచి సూసైడ్ చేసుకుని  చచ్చి పోయేవాడు అని మనసులో అనుకుని హీరొయిన్ కి ఫోన్ చేసాడు.
హీరొయిన్ :  Hello!
హీరో : Hiii wazapp bebzz???
హీరొయిన్ : hiii ఏంలేదు... ఊరికే  అలా మాట్లాడాలన్పించింది అందుకే కాల్  చేశా.......
హీరో : { చ... ఇదేమైన కాల్ సెంటర్ అనుకున్నావా బోర్ కొట్టినప్పుడల్లా కాల్ చేయడాన్కి ... సారీ కాల్  ఎక్కడ దీని మొహానికి ??? మిస్సడ్  కాలే కదా} ohhh cooool సో ఏం  చేస్తున్నావ్???
హీరొయిన్ : జస్ట్  నౌ డిన్నర్ ఐపోయింది..."జీడి పప్పు ఉప్మా " తిన్నాను. మరి నీది??
హీరో : { జీడి పప్పు తో పాటు కొద్దిగా గన్నేరు పప్పు కలుపుకుని తినాల్సింది... దెబ్బకి దరిద్రం వదిలేది. అయినా  నన్ను ప్రశాంతం గా ఎక్కడ తిననిస్తావ్...అందరు కత్తులతో, గన్స్ తో చంపితే నువ్వు మిస్సెద్ కాల్స్ తో చంపుతావ్ కద...} హా నేను కూడా డిన్నర్ చేశా ఇప్పుడే... టీవీ లో  "ఎటో  వెళ్లిపోయింది  మనసు..." సాంగ్  వింటున్నా.
హీరొయిన్ : హే  నైస్  సాంగ్... (and then she hums a line from the song " ఇలా ఒంటరియింది  వయసు...ఓ చల్ల గాలి...")
హీరో: {దీనేమ్మా జీవితం … ఎందుకు వింటున్నానని  చెప్పానురా  దేవుడా... ఇపుడిది
సింగెర్ చిత్ర అనుకుని  పాట మొత్తం ఖూని చేసి దోబ్బిచ్చుకుంటోంది  ..} hey నువ్వు ఇంత మంచి సింగరా .....:Oo నాకింతవరకు  చెప్పనేలేదు!!!!
హీరొయిన్: *giggles*
హీరో :  {నీ సిగ్గు సిమడా... సిగ్గు లేకుండా పాటను ఖూని  చెయ్యడమే కాకుండా, ముసి ముసి నవ్వులు ఎదవ జీవితానికి...చైనా మొబైల్ లో కొరియా పాటలు వింటున్నట్టు వుంది } Hey ఇంకోసారి పాడవా  ప్లిస్...
హీరొయిన్ : Hey ఇక్కడ  అంతా  పడుకున్నారు  నేను ఇప్పుడు  పాడితే  అందరూ  లేస్తారు.....
హీరో : {మరి మనది మాములు  వాయిసా...} Come on! Please!
హీరొయిన్ : hey ...I don't sing that well
హీరో : { అబ్భ...అమ్మాయిలు నిజం మాట్లాడితే ఎంత బాగుంటుంది ...} It was really sweet da . Please పాడవా dear…
హీరొయిన్ : Hey నాకు సిగ్గేస్తోంది.
హీరో : {నీ పాట వింటున్నందుకు, నేను సిగ్గు పడాలే నీ !@#$%^& } Hey plzzz sing naa dearr...
హీరొయిన్ : నిజంగా నా పాట అంత బాగుందా??
హీరో : { ఆ పాట విన్నందుకు నాకు గో హత్య చేసినంత పాపం వస్తుందేమో అని భయం గా వుంది. మరి పాడిన దానికి ఎలా వుండాలి... ఏ మాత్రం సిగ్గు లేకుండా ఫీడ్ బ్యాక్ కూడా అడుగుతోంది...} బాగుంది కాబట్టే అడిగాను రా... నీకు నచ్చకుంటే వద్దులే.
హీరొయిన్ : I don't have that great voice... ఊరికే  అలా  పాడేసా అంతే.
హీరో : { ఒసేయ్ ఇండియా లో పుట్టిన పాకిస్తాన్ దాన...మళ్లీ ఎందుకే  సాంగ్ గురించి ?? నేను ఓదిలేసా కదా...} Hmmmm .
హీరొయిన్ : సరే ...నువ్వింత  బతిమలాడుతున్నావ్ కాబట్టి ఒక  చరణం పాడతా ఓకే naaaa????
హీరో : {ఒసేయ్యి పాపిష్టిదాన  నోటి దూలతో నేనేదో  సరదాగా  అడగాను తల్లో ..... నువిలాంటి  వయోలేంట్ decisions  తీసుకోకే... చచ్చి నీ కుక్క కడుపులో పుడతానే...వదిలేసెయ్ } Ohh gr8 commonnn
హీరొయిన్ : ఎం  సాంగ్  పాడను ???
హీరో : { ఎలుకుల మందు తాగి చస్తావ... ఏనుగు కింద పడి చస్తావ అన్నటు... చావడం లో కూడా ఆప్షన్స్ ఎందుకులే } నీ  ఇష్టం  బంగారం.
హీరొయిన్ : (గొంతు సవరించుకుని, చిన్నగా హమ్ చేసి...) సిరి  మల్లె పువ్వా , సిరి  మల్లె  పువ్వా .....
హీరో : { రావు గోపాల్ రావు గారు 'కూసంత కళా పోషణ' వుండాలన్నాడే  కానీ "ఖూనీ" చేసేటంత కాదే... సరిగ్గా విన్నావో లేదో...అయోమయం దాన... } { నువ్వు  నాకు నచ్చావ్ స్టైల్  లో 'ఆపండ్రోయ్, ఆపండ్రోయ్...}
హీరొయిన్ : వింటున్నావా  డియర్
హీరో : { వినక  చస్తానా...} ya yaa ... very sweet voice dear... {నీ  వాయిస్ వింటుంటే  ముక్కు మూసుకోకుండా మూసి నది లో మునిగినట్టు వుంది } నీ వాయిస్ వింటుంటే గాలి లో తేలిపోయి యముడి దగ్గరకు వెళ్లి పోయినట్టుంది రా.
హీరొయిన్ : అగో మరీ  2 మచ్  చేస్తున్నావ్  పో నేను పాడను.
హీరో : { హమ్మో ... దీనికి అర్ధం అయినట్టుంది......} hey అలా ఏం లేదు . I am just making U comfortablee with the song అంతే....
హీరొయిన్ : Hmmm…
హీరో : Common go onn naa ...
హీరొయిన్ : సరే... అయితే  రేపు  పాడనా ????
హీరో: { ఉరి శిక్ష రేపటికి వాయిదా  పడినట్టు  ఊపిరి పీల్చుకుని....} సరే నీ ఇష్టం డియర్.
హీరొయిన్: Hmmm
హీరో : Good night
హీరొయిన్ :  Good Night
హీరో : Sweet Dreams… Take care...
హీరొయిన్ : Sweets dreams to u too...
హీరో : { స్వీట్ డ్రీమ్సా... నువ్వు పరిచయం అయినప్పటి నుంచి నిద్రే లేదు, ఇక dreams  కూడా...అది కూడా  స్వీట్ డ్రీమ్స్...ఆశకు కూడా హద్దు వుండాలి. అయిన ఇంకో రెండు నిమషాలలో కాల్ చేయవు...సారీ మనది మిస్సేడ్ కాల్  బ్యాచ్ కదా..}
మరో రెండు నిమషాలలో హీరొయిన్ కాల్ చేసింది...సారీ  మిస్సేడ్ కాల్ ఇచ్చింది.
హీరో : { మళ్లీ మిస్సేడ్ కాల్...ఒసే పాపిష్టి దాన... నిమషానికి ఒక పైసా అన్నా కాల్ చేయ్యవా ???. ఇక మొబైల్ కంపెనీ వాళ్ళు ఫోన్ చెయ్యడానికి కూడా లోన్ ఇస్తే కానీ చేయ్యవేమో } కాల్ చేసాడు.
హీరొయిన్ : Hey… పడ్కున్నావా ?
హీరో :{లేదే... అర్ధరాత్రి  అడుక్కున్ధమని ముష్టి డ్రెస్ కుట్టుకుంటున్న... యెదవ ప్రశ్న నువ్వు ను... }  లేదు డియర్ నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా.
హీరొయిన్ : నేను ఇవ్వాళా పాట పాడ లేదని ఫీల్ అయ్యావా??
హీరో : {భాధా ?? నాకా ??? పిచ్చి పిల్ల... ఇవ్వాళ నా జీవితం లో మరచి పోలేని రోజు... నీ పాట పూర్తి గా  విని వుంటే రేపటి సూర్యోదయాని చూసే వాడిని కానేమో } హే లేదు... రేపు  పాడతానన్నావ్ కదా, సో రేపటి  కోసం వెయిట్ చేస్తున్నా.
హీరొయిన్ : వావ్... is it ??
హీరో : { దీని సంతోషం పాడుగాను ఇవన్ని అబధాలు అని తెలిస్తే గుండాగిపోతది } yes dearrr
హీరొయిన్ : Hey...
హీరో : { ఛి నా భతుకు... నా మొహం  మీద  ఊర కుక్క ఉచ్చ పోయా... అసలుకి ఇది  ఇవాళ నన్ను ఒదులతాధ లేదా ???} హా చెప్పు స్వీటీ.
హీరొయిన్ : నిజం చెప్పు  నా  వాయిస్  అంత బాగుందా???
హీరో : {అయిస్ క్రీం లో ఆవకాయ పచ్చడి నంచుకు తినే  అర మెంటల్ దానా... నన్ను పడుకోనివ్వవ } హే  నిజం  చెప్తున డార్లింగ్... నీ వాయిస్ కెవ్వు కేక.
హీరొయిన్ : నిజామా ?
హీరో : { "నీకు దురద వస్తే ప్రక్కనోడిని గోకినట్టు", నీకు బోర్ కొడితే నాకు ఫోన్ చేసి చంపుతున్నావు, దానికి తోడు ఇలా పాటలు పాడి నా  ప్రాణాలు తీయక పోతే  నువ్వే రికార్డు చేసుకుని వినొచ్చు గా దెబ్బకి దరిద్రం వదిలేది } yaa its trueee da.
హీరొయిన్ : Hmmm నువ్వు చెబుతున్నావ్ కాబట్టి నేను నమ్ముతున్నాను. మరి రేపు నీ ప్లాన్ ఏంటి.
హీరో : { నా ప్లాన్ తో సంబంధం ఏం వుంది, నువ్వేదో ప్లాన్ లో వుంటావ్ గా చెప్పు, యెదవ మొహమాటం  నువ్వు ను } నాకయితే  ఏ ప్లాన్స్ లేదు...
హీరొయిన్ : అయితే సెంట్రల్ లో సినిమా కి వెళ్దామా.
హీరో : { ఏదో డబ్బులు ఇది పెట్టేటట్టు వెళ్దామా అంటోంది....యధవధి అర్ధ రూపాయికి చిల్లర వుందా అని అడిగే పిసినారి } Yaa  Sure .
హీరొయిన్ : మరి ఏ సినిమా కి వెళ్దాం ???
హీరో : { సినిమా వాల్ పోస్టర్ చూసే ఫ్రీడం కూడా నాకు లేదు, ఇక సినిమా సెలక్షన్ కూడా. నీ మనసులో మెనూ  కార్డు వుంటది గా... ఆర్డర్ ఇవ్వు ,... ఇక్కడ బెర్రెర్ లా బేలగా ఎదురు చూస్తున్న}  ఎ సినిమా అయిన ఓకే డియర్. నీ ఇష్టమే  నా ఇష్టం .
హీరొయిన్ : అయితే బాడీ గార్డ్ సినిమా కి వెళ్దాం, కామెడీ బాగుందట.
హీరో : { అవును అందులో కామెడీ నీకు ట్రాజెడీ నాకు... టిషు పేపర్స్ [ Tissue Papers ] తో రఫ్ నోట్ బుక్  కుట్టుకుని  రైతు బజార్ లో హాఫ్ రేట్ కి అమ్మే అర మెంటల్ దాన... } యా sure .... Y  not .
హీరొయిన్ : అలాగే సెంట్రల్ లో షాపింగ్ కి కూడా వెళ్దాం, ఇప్పుడు 50 % sale వుందట.
హీరో : { ఒసే...పాపిష్టి దాన...మానవత్వం లేదటే నీకు, నువ్వు పరిచయం కానప్పుడు Karizma Byk లో క్లాసు గా  తిరిగి, కార్ కొనే ప్లాన్ లో వున్నా, అప్పుడు పరిచయం అయ్యావు... దీనెమ్మ  కార్ ఆలోచన పోయా, Karizma Byk తాకట్టు పెట్టా, ఇంకో ముప్పయ్ వేలు అప్పుల్లో కూరుకు పోయా. మా ఫ్రెండ్స్ నున్ను జాలి, దయ తో కూడిన ఒక విచిత్రపు చూపు చుస్తునారే... అయిన నీ మనసు కరగ లేదు, ఇక నాకొద్దు ఈ జీవితం, మా పల్లె కెళ్ళి పచ్చలు అమ్ముకుని భతుకు తా...} Hello... Hello... Signal సరిగ్గా లేనట్టు వుంది డ, రేపు మీట్ అవుదాం బంగారం. Bye for now , అని  రిప్లయ్ కోసం చూడకుండా ఫోన్ కట్ చేసేసాడు మన అభాగ్య హీరో.
మనిషి గతి ఇంతే, మగాడి బ్రతుకింతే ... గర్ల్ ఫ్రెండ్ వున్న మగాడికి - సుఖము లేదంతే... అంటూ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ హీరో ఫ్రెండ్స్ పాడుతుంటే .
కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్... గర్ల్ ఫ్రెండ్ వద్హురోయ్... అని హీరో తన ఆవేదనని వెళ్ళగక్కాడు.