Tuesday, June 19, 2012

అందమైన మనసులో... Part - 3


                                             అందమైన మనసులో...

                                    [బోలెడంత ప్రేమ - కొంచెం కన్నీళ్ళు ]

                                                                                                               PART - 3

అక్కీ  అలా కనుబొమ్మలు ఎగరేయడం  తో  కాస్త తత్తర పడి, వెంటనే తేరుకుని " హాయ్ ", అన్నాను కళ్ళతోటే. వెంటనే తను ప్రక్క వాళ్ళతో మాట్లాడటం ముగించి నా వైపుకి వస్తోంది.
"నువ్వు  ఇవ్వాళ చాలా  అందం గా వున్నావు అక్కీ", అని చెప్పాలి అని మనసులో అనుకున్నాను. నేను అసలే మొహమాటస్తుడిని, పైగా ముందున్నది అమ్మాయి కావడం తో నోట్లోంచి మాట భయటకి రాక  " గుడ్ మార్నింగ్ అక్కి", అన్నాను.
"మార్నింగ్ అజ్జూ... ఇవ్వాళ నువ్వు చాలా హ్యాండ్ సం  గా వున్నావ్. బ్లాక్ షర్ట్, బ్లూ డేనిం  జీన్స్   సూపర్", అంది నవ్వుతూ ."థాంక్స్", అన్నాను .
"నీ స్కిన్ కలర్ కి బ్రైట్  కలర్ డ్రెస్ భాగుంటుంది", అంది. నేను కృతజ్ఞతాపూర్వకం గా  నవ్వుతూ "ఏంటి స్పెషల్... హాఫ్ శ్యారి లో వచ్చావ్ ?", అన్నాను.
"స్పెషల్ అంటూ ఏమీ లేదు, పరికిణి అంటే నాకు చాలా ఇష్టం . బట్ క్యారీ చెయ్యడం కష్టం అని  ఆఫీసు కి వేసుకుని రాను. ఎనీ వేస్  ఇవ్వాళ ఫంక్షన్ కదా... అందుకని డ్రెస్ లో వచ్చాను ", అంది.
ఇంతలో అందరు రావడం తో  రిసార్ట్ లాబీ లో అసెంబుల్  అయ్యాం.
రిసార్ట్ బేరర్ వచ్చి వెల్కం డ్రింక్ కోసం అందరి దగ్గర మెనూ  తీసుకుంటున్నారు. అక్కడ బీర్ కూడా ఇస్తుండటం తో చాలా  మంది అదే డ్రింక్ ఆర్డర్ ఇచ్చారు. అతను నా దగ్గరకు వచ్చి మెనూ  అడిగాడు. ఇంతలో మా టీం లో స్వాతి అనే  అమ్మాయి "మెనూ  ఎందుకు చూస్తావ్ లే అర్జున్, నువ్వు బీర్ తాగవు కదా... అన్నీ  చూసి చివరకు ఆపిల్ మిల్క్ షేక్ అని ఆగుతావ్ ", అంది వెక్కిరింపు తో కూడిన నవ్వుతో . మాటకు బాగా కాగిన "పావ్ బజ్జి " పెనం మీద నిక్కర్ లేకుండా కూర్చున్నట్టు సర్రు   కాలింది నాకు. అందరు గట్టిగా నవ్వేసారు. ఇంతలో "Arjun is a good boy you know ... ఇలా మందు  గిందు  త్రాగడు ", అంటూ ముందుకి వచ్చాడు వరుణ్.   ఛి దినేమ్మ జీవితం మంచివాడు అన్న బ్రాండు మోయడం కంటే వంద కిలోల ఉప్పు బస్తా మోయడం సులువు సుమా... అని అనిపించింది నాకు. నాకు తెలిసినంత వరకు మంచివాడు అన్న బిరుదు కన్నా పెద్ద శిక్ష మరొకటి లేదు అనుకుంటున్నా... ఎందుకంటే ఒకసారి బిరుదు ఇచ్చారంటే మనం తప్పు చెయ్యాలనుకున్నా చెయ్యలేం, ఎక్కడ బిరుదు  కి  మచ్చ వస్తుందో అని. ఉదహరణకి మనం తాగాలని గ్లాసు లో  మందు పోసుకున్నా "ఒరే... నువ్వు మంచి వాడివి కదరా... నీకు ఇదేం  పోయే కాలం మందు  తాగుతున్నావ్??? ", అంటారు, సరే మనం అమ్మాయిలను చూసి కామెంట్ చెయ్యాలనిపించినా  "వాడు అమ్మాయిల జోలికి కూడా వెళ్ళడు రా... చాల బుద్ధిమంతుడు...", అంటారు. ఇక ఇంకేం కామెంట్ చేస్తాం... ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష examples వున్నాయ్ నాదగ్గర. నన్నడిగితే "మంచి వాడు" అన్న దానికంటే పెద్ద బూతు పధం ఇంకోటి ఉండదు.
అందరం వెల్కం  డ్రింక్, బ్రేక్ ఫాస్ట్  ముగించి ఆడిటోరియం లో కి వచ్చాం. తరువాత మా మేనేజర్ గారు స్టేజి ఎక్కి, కంపెనీ గురించి, మేము కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి, నెక్స్ట్ రాభోయే సర్వీసు పాక్స్ గురించిక్లైంట్స్ శాటిస్ఫ్యాక్టరీ గురించి, మా ప్రాజెక్ట్  చేస్తున్న రెవిన్యూ గురించి ఫుల్ గా క్లాసు చెప్పారు. తరువాత మా onsite co ordinators ఒక్కోకరే స్టేజి మీదకు వెళ్లి కాసేపు సొల్లు కొట్టారు. అంతా అయిన తరువాత మా తోటి కొన్ని  Team building activities చేయించారు. తరువాత స్విమ్మింగ్ కి వెళ్ళాం. అందరు అలసిపోవడం తో  లంచ్ చేసాం. లంచ్ చేసిన ఒక అరగంటకి  మా onsite co ordinator Jeff  Thomson  ముందుకి వచ్చి "Guys... I think everyone get bored of these routine games & activities. Today I ll suggest you to play one new dance game.", అని ఆగాడు. అందరు గట్టిగా తపట్లు కొట్టారు. ఏమి చెబుతాడా  అని కుతూహలం గా థామస్ నే చూస్తున్నారు.
“This game is for only unmarried people. So I want the list of them”, అన్నారు. మేము అందరు మా పేర్లు చిన్న చీటి లో రాసి డ్రాప్ బాక్స్ లో వేసాం.
“The game name is Paper Dance”, అన్నారు థామస్ .
అంటే మేము ఇప్పుడు పేపర్ తో డాన్సు వెయ్యాలా అన్నారు వెనక నుంచి. లేదు బాస్... పేపర్ చుట్టుకుని వెయ్యాలి అన్నాడు ఇంకొకడు. అందరూ కామెంట్స్ చేస్తున్నారని గ్రహించి  “It means the pair should dance on a paper”, అన్నారు. "....", అంటూ  ఒక్కసారిగా గట్టి గా తప్పట్లు కొట్టారు.
“Now coming to the terms & conditions, I ll provide a Chart of certain length to the pair. I ll start  the music and the pair should stand on the paper and dance till the music stops. Also the pair should not come out of the paper”, అని ఆగాడు. ఒక్కసారిగా హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్  అయిపోయింది. థామస్  డ్రాప్ బాక్స్ లో చెయ్యి పెట్టి ఒక్కొక్క పెయిర్  ని సెలెక్ట్ చేస్తున్నాడు . మొదట అబ్బాయిల బాక్స్ లోంచి ఒక చీటీ తీసి "ప్రశాంత్" అండ్ ది పెయిర్ ఈస్ "స్రవంతి" అన్నాడు. అందరూ ఆశ్చర్యం గా చూసారు. ఎందుకంటే ఆఫీసు లో సాల్సా డాన్సు ట్రూప్ లో వాళ్ళిద్దరు పెయిర్. చూడటానికి కూడా బాగుంటారు. తరువాత మా వరుణ్ గాడి పేరు తీసారు, వాడికి గాయత్రీ అని తమిళ్ అమ్మాయిని పెయిర్ గా వచ్చింది. పాపం వాడు ఏడవ లేక నవ్వు  మొహం పెట్టాడు. తరువాత నా పేరు తీసారుఅది దేవుడి దయో లేక కాకతాలియం గానో నాకు అక్కీ పెయిర్ గా వచ్చింది. అలా మొత్తం 9 పెయిర్స్ ని సెలెక్ట్ చేసారు. అందరం స్టేజి పైకి వెళ్లి నిల్చున్నాం. తరువాత మాకు చెరొక డ్రాయింగ్ చార్ట్ ఇచ్చారు.
“Guys, you have to stand on the chart & dance accordingly to the music. The main condition is you should move across the chart till the music ends”, అన్నాడు.
అందరిలోనూ ఒకటే బెరుకు. వాళ్ళ వాళ్ళ పెయిర్స్ ని ఇబ్బంది గా చూస్తున్నారు, ఎందుకంటే ఒక చార్ట్ మీద ఇద్దరు ఎదురెదురుగా నిలబడటం అంటే అర్థం చేస్కొండి. "ప్రశాంత్ & స్రవంతి" మాత్రం చాలా కాన్ఫిడెంట్  గా వున్నారు, ఎందకంటే వాళ్ళకు ఇంచు మించు త్రీ మంత్స్ గా ప్రాక్టీసు వుంది. అందరి పరిస్థితి ఏమో కానీ నా పరిస్థితి మాత్రం ఇంకా దారుణం గా వుంది. అక్కీ తో చాలా క్లోజ్  గా వున్నా మాట్లాడటం వేరు డాన్సు చెయ్యడం వేరు. అదీ అంత క్లోస్ గా  డాన్సు వెయ్యడం అంటే ఊహించుకోండి. మేము ఇద్దరం చార్ట్ మీద నిలబడ్డాం. అపరిచితులను చూసుకున్నట్టు ఒకరిని ఒకరు ఎగా దిగా చూస్తున్నాం.
"Guys... the song ll starts in 2 minutes, get ready ...”, అన్నారు థామస్. "వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్" , నా గుండెల్లో నడుస్తున్నట్టు అనిపించింది. అక్కీ కళ్ళల్లో కి సూటి గా చూడలేక కింద కి చూసాను. తన పరిస్థితి కూడా అలాగే  వుంది. అంత వరకు గలా గలా  మాట్లాడే వాళ్ళం కాస్త మౌనం వ్రతం చేస్తున్నట్టు ఉండిపోయాం. అక్కీ మెల్లగా తల పైకి ఎత్తి "నీకు డాన్సు వచ్చా ? ", అంది. నాకు ఏమి చెప్పాలో అర్థం కాక ఒక విచిత్రపు నవ్వు నవ్వాను... తను కూడా నవ్వేసి "నేను చిన్నపుడు  భరతనాట్యం నేర్చుకున్నాను. కాబట్టి నువ్వు జస్ట్ మూమెంట్ ఇవ్వు చాలు నేను మేనేజ్ చేసేస్తా", అంది. "అలాగైతే ఓకే ", అన్నాను నేను. ఇంతలో సాంగ్ స్టార్ట్ అయింది. నేను ఎక్కడ పట్టుకోవాలో  తెలియక నా కుడి చేత్తో తన ఎడమ  చేతిలోని చూపుడు వేలిని, నా ఎడమ చేత్తో తన కుడి  చేతిలోని చూపుడు వేలిని పట్టుకున్నానుడాన్సు చెయ్యడం స్టార్ట్ చేసాం. నేను  జస్ట్ లెగ్ మూమెంట్ ఇస్తున్నా , అక్కీ బాగా కవర్ చేస్తూ డాన్సు వేస్తోంది. ఇంతలో తను నా చేతి బేలన్సు తో ఒక రౌండ్ తిరిగి  స్టెప్  వేసింది, నేను పట్టుకున్నది తన వేలు కావడం తో జారిపోయింది... తను అలా పేపర్ మీద నుంచి  కింద పడిపోయేలోపు , నా చేతి ని తన చేతి తో గట్టిగా  పట్టుకుని పైకి లేపాను బ్యాలన్స్  కోసం ... ఇంతలో సాంగ్ ఆగిపోయింది. హమ్మయ్య  బ్రతికి పోయాం అని గట్టిగా ఊపిరి పీల్చుకున్న.  3 teams  ఎలిమినేట్ అయిపోయింది. అందులో వరుణ్ గాడు కూడా వున్నాడు. ఇక మిగిలింది సిక్స్ teams . ఇంతలో బెట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అందరి లో Hot favorite "ప్రశాంత్ - స్రవంతి" పెయిర్ కావడం తో అందరూ వాళ్ళమీద బెట్  కట్టారు. మా వరుణ్ గాడు మాత్రం నా మీద "Fast Track "  వాచ్ బెట్ కట్టాడు సునీత గారి తో. వాడు నా దగ్గరకు వచ్చి "మచ్చా... నీ మీద రెండు వేలు బెట్ కట్టాను, నీ మీద చాలా హోప్స్  పెట్టుకున్నా... వమ్ము చెయ్యకు ", అన్నాడు . "అసలే నా గుండెల్లో వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్  సూపర్ ఫాస్ట్ గా  పరుగెత్తుతుంటే... నీ గోల ఏంట్రా బాబు ", అని వాడిని తిట్టాను.
“Now guys, you have to fold your charts to half”, అన్నారు థామస్.
హాఫ్ మడత పెట్టగానే ఇంచుమించు న్యూస్ పేపర్ లోని మెయిన్ పేపర్ అంత సైజ్ అయింది చార్ట్. మెయిన్ పేపర్ అంటే అర్థం చేసుకోండి ఎంత సైజు వుంటదో... మేము ఇద్దరం చార్ట్ పై  నిల్చున్నాం. సారి కూడా  తన వేలిని పట్టుకున్నాను ... అక్కీ కాస్త చనువు తీసుకుని "అజ్జు... నా చేయి పట్టుకో ఏం పర్లేదు ", అని చేయి ఇచ్చింది.
ఇంతలో సాంగ్ స్టార్ట్ అయింది... ఈసారి షకీరా ఫుట్ బాల్ సాంగ్ ప్లే చేసారు.
నేను తన చేయి ని పట్టుకుని డాన్సు చెయ్యడం స్టార్ట్ చేశాను. నేను స్వతహా గా అథ్లెట్ ని కావడం తో, కాస్త డాన్సు ప్రాక్టీసు కూడా వుండటం తో  నా  బాడీ ని బాగా ఫ్లెక్సిబుల్ గా తిప్పేవాడిని, దాంతో మా మధ్య ఇంకా కెమిస్ట్రీ బాగా పండింది. కానీ మెయిన్  పేపర్ అంత సైజు చార్ట్ కావడం తో కాస్త ఇబ్బంది గా కాస్త ఆనందం గా వున్నది. తను రౌండ్ తిరిగేటప్పుడో ... లేక  నేను రౌండ్ తిరిగేటప్పుడో ఇంచు మించు ఇద్దరు కలిసిపోయేంత దగ్గరకు వెళ్ళేవాళ్ళం. సాంగ్ ఫాస్ట్ బీట్ కావడం తో మేము కూడా డ్యాన్స్ ని కాస్త ఫాస్ట్ చేసాం... అందరూ "ప్రశాంత్... స్రవంతి..." అని గట్టిగా అరుస్తున్నారు... వాళ్ళు కూడా సాల్సా Dancers కావడం తో చూడముచ్చటగా వేస్తున్నారు, టైమింగ్, రిధం ఎవిరీ  థింగ్ సూపర్బ్ అనిపించేంత అందం గా డాన్సు చేస్తున్నారు. నేను కూడా వాళ్ళ డాన్సు చూసాను, ఇంతలో నా పాదం కాస్త అక్కీ కాళ్ళ పై పెట్టాను, వెంటనే తీసే  లోపు కాస్త స్కిడ్ అయ్యాను జారి కింద పడిపోయే లోపు అక్కీ చాలా ఫాస్ట్ గా React  అయ్యి నా భుజాన్ని తన ఎడమ చేతితో బాలన్సు చేసి పైకి లేపడానికి ట్రై చేసింది, కానీ నేను తనకన్నా వెయిట్ కావడం తో తన రెండో చేత్తో నా నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నది... నేను అలా బెండ్ పోసిషన్ లోనే వున్నాను అంటే నా వీపు నేల వైపు , తను కాస్త ముందుకి వంగి నా మీద వున్నట్టు వుంది పోసిషన్, సీన్ కి అందరి  కళ్ళు మా మీద పడ్డాయి... ఇంతలో సాంగ్ స్టాప్ అయిపోయింది, మేము సేవ్ అయిపోయాం. "థాంక్స్ టు  అక్కీ", అని మనసులో అనుకుని మెల్లగా లేచాను... ఈసారి మరో మూడు teams ఎగిరిపోయాయి.
“Now guys, you have to fold your charts to half”, అన్నారు థామస్.
హాఫ్ మడత పెట్టగానే ఇంచుమించు “District Edition “[ మన సాఫ్ట్ వేర్ బాష లో అయితే A4 సైజు అంత అన్నమాట ].  A4 సైజు అంటే అర్థం చేసుకోండి... సైజు లో ఒక్కరు నిలబడటమే కష్టం... అటువంటిది ఇద్దరు నిలబడాలి. మేము ఇద్దరం sandals తీసేసి చార్ట్ మీద నిలబడ్డాం. మొదట నా ఎడమ పాదం తరువాత తన  కుడి  పాదం, తరువాత నా కుడి పాదం తరువాత తన ఎడమ పాదం అలా ఎదురెదురుగా గా నిలబడ్డాం... అంటే ఇంచుమించు ఒకటయిపోయాం అనుకోండి. తన తనువు లోని ప్రతి అనువు నా తనువు ని  తాకుతోంది ... తన గుండె చప్పుడు  కూడా నాకు విన్పించేటంత దగ్గరగా వున్నాను. తను శ్వాస తీసుకున్న ప్రతి సారి తన అందాలు నా హృదయాన్ని  తాకుతుంటే నా శరీరం లో కరెంటు ప్రవహించినట్టు, నా  మనస్సు కి తెలియని చిలిపి గాలి సోకినట్టు ఏదో తెలియని మధురానుబూతి లో  తెలిపోయాను. అప్పటి నుంచి అందరూ  "ప్రశాంత్... స్రవంతి..." అనే కాక "అజ్జు... అక్కీ..." అని అరవడం కూడా  స్టార్ట్ చేసారు.
అక్కీ చాలా కాన్ఫిడెంట్ గా నా కళ్ళలోకి చూసి "అజ్జు... నా కళ్ళలోకే చూడు... ప్రపంచం లో మనమిద్దరం తప్ప ఎవరూ లేరు, అరుపులు, తప్పట్లు నీకు ఏది విన్పించట్లేదు... ఒక్క సాంగ్ మాత్రమే వినిపిస్తోంది... చాలా కష్టపడి ఫైనల్ కి వచ్చాం... సారి ఛాన్స్ మిస్ కాకూడదు ", అని ఆగింది. తను మంత్రం వేసినట్టు నేను తన కళ్ళనే చూస్తున్నాను, భయట వినిపిస్తున్న అరుపులు నెమ్మదిగా నా చెవులకు ఎక్కడం ఆగిపోయాయి, ఇంతలో పాట స్టార్ట్ అయింది. సారి టైటానిక్ సినిమా లో  ని మ్యూజిక్ ప్లే చేసారు. మేమిద్దరం డాన్సు లో పూర్తి గా ఇన్వాల్వ్ అయిపోయాం . ఇద్దరం మా మా కోన పాదాలతో డాన్సు చెయ్యడం స్టార్ట్ చేసాం... గాలి కూడా దూరనంత దగ్గరగా డాన్సు చేస్తున్నాం, ఒకరి శరీరాలు  ఒకరిని తాకుతున్నాయ్, అలా తాకినప్పుడు పుట్టే కరెంట్ ని కూడా పట్టించుకోకుండా డాన్సు లో నిమగ్నమయిపోయాం . మ్యూజిక్ కాస్త ఫాస్ట్ బీట్ లోకి మారిపోయింది, మా డాన్సు కూడా ఫాస్ట్ అయింది . సాల్సా పెయిర్ కూడా వేడి గానే వేస్తున్నారు . మరొక పెయిర్ కింద పడిపోయారు. మేము అది ఏమి పట్టించుకోకుండా పాటకు, బీట్  కి తగ్గట్టు మా స్టెప్స్ ని మార్చుతున్నాం. మా చూపులలో, చేష్టలలో ఎటువంటి 'ఆకలి' లేక పోవడం తో  కెమిస్ట్రీ  బాగా కుదిరి టైమింగ్ తో డాన్సు వేస్తున్నాం. ఇంతలో సాంగ్ ని మార్చి "దిల్ తో పాగల్ హై", మ్యూజిక్ ని పెట్టారు. వెంటనే  మ్యూజిక్ మార్చడం తో  సాల్సా పెయిర్ తడబడ్డారు, అడుగులు తడబడి కాళ్ళు భయట పెట్టేసారు, మేము మాత్రం మా డాన్సు ని ఆపకుండా వేస్తున్నాం, నా కుడి చేత్హో తన కుడి చేతిని తీసుకుని బంతి ని తిప్పుతున్నటు తిప్పాను, తను కూడా తన ఎడమ చేతిని వెనక్కు  పెట్టుకుని, బోటని వెలి మీద నిలబడి తిరిగుతోంది... మ్యూజిక్ క్లయిమాక్స్  బీట్  కి రాగానే నేను కాస్త కిందకు వంగి నా రెండు చేతులతో పువ్వు కన్నా మెత్తనయినా  తన  నడుముని పట్టుకుని అలా పైకి ఎత్తాను. తను పరికిణి  లో వుండటం తో, అందమయిన గ్యాపు నాకు కలిసి వచ్చింది. ఇంతలో సాంగ్ ఆగిపోయింది, తను నా మీదగా బ్యాలన్సు అవుతూ కర్రెక్టు గా చార్ట్ మీదనే  దిగింది. నేను మెల్లగా తనకు మాత్రమే  వినిపించేటట్టు "నువ్వు ఇవ్వాళ చాలా అందం గా వున్నావ్ అక్కీ", అన్నాను, తను కాస్త సిగ్గు పడుతున్నట్టు నవ్వింది. 'సాంగ్ ఆగిపోయింది బాబు చెయ్యి తీయవచ్చు', అని ఎవరో అరవడం తో వెంటనే నేను తేరుకుని  అందమయిన తన నడుము మీద నుంచి  నా  చెయ్యి  ని అన్యమనస్కం గా తీసాను, తను కూడా టక్కున  దూరం గా  వెళ్లి పోయింది.
అందరూ "సూపర్బ్, కేక, తురుము , రచ్చ..." అంటూ షాకే హ్యాండ్ ఇస్తున్నారు. మా వరుణ్ గాడు అయితే  పరుగెత్తుకు వచ్చి "మామ చాల బాగా చేసారు రా... చూడటానికి రెండు కళ్ళు చాల్లెదంటే అర్థం చేసుకో ", అన్నాడు.
“One of the best performance I ever seen in my life buddy, really fabulous performance & awesome timing & great coordination. Proudly I can say that you both really  steeled the show”,  అంటూ గట్టిగా కౌగిలించు కున్నాడు థామస్. వాళ్ళు ఏదేదో పొగుడుతున్నారు కానీ నా బుర్రలోకి అయితే అది ఎక్క లేదు. నేను ఇంకా డాన్సు మొమెంట్స్ లోనే వున్నాను. అంతా అయిన తరువాత ప్రైజ్ డిస్ట్రిబ్యుషన్ చేసారు. Team Building Activities లో గెలిచినవారికి, గేమ్స్ లో విన్ అయినవారికి ప్రైజ్ ఇచ్చారు. ప్రేమకు ప్రతి రూపమయిన రాధా కృష్ణుల పాల రాతి బొమ్మను ఇచ్చారు. చాలా సూపర్ గా వుంది. ప్రైజ్ తీసుకుని స్టేజి దిగిన తరువాత  నేను "అక్కీ... రాధా కృష్ణుల బొమ్మ చాలా బాగుంది. నువ్వు డాన్సు  బాగా కస్టపడి చేసావ్... అందుకే నువ్వు ఉంచుకో ", అన్నాను.
"అదేం  లేదు అజ్జు... నీ కో ఆపరేషన్ లేకుంటే మనం గెలిచేవాళ్ళం కాదు... అది కాక నీకు కృష్ణుడంటే చాలా ఇష్టం. కాబట్టి నీ దగ్గర ఉండటమే కర్రెక్టు", అంది నవ్వుతూ.
" నీకు ఏది ఇవ్వకుండా నేను ఉంచుకోవడానికి చాలా గిల్టీ  గా వుంది అక్కీ ", అన్నాను.
"నాకుస్టార్ అంటే చాలా ఇష్టం ఇష్టం... సో నీకు ఎన్ని వీలయితే అన్ని కొని పెట్టు... మొహమాటం లేకుండా తీసుకుంటా", అంది.
"ఓహ్ సూపర్... నీకూ మా జానూ లాగే "5  స్టార్" అంటే ఇష్టమా? ", అని అడిగాను.
"జాను నా... అదెవరు, నాకు తెలియకుండా ?", అడిగింది కాస్త గట్టిగా.
"జాను అంటే నా మరదలు జానకి. తనకి కూడా "5  స్టార్" అంటే చాలా ఇష్టం", అని చెప్పాను.
"నీకు మరదలు వున్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు ?", అని చుర చుర లాడుతూ వెళ్లి పోయింది.
"అయ్యోరామ... మన మధ్య టాపిక్ ఎప్పుడూ రాలేదు కదా, అందుకే చెప్పలేదు. అయిన నాకు మరదలు వుంటే నువ్వు అలగడం ఏంటి ?", అన్నాను. తను సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళి పోయింది . అమ్మాయిలు సహజంగా పోసేస్సివ్ గా ఉంటారని తెలుసు కాని మరీ ఇంత గానా... భగవంతుడా అని చేతిలోని కృష్ణుడి బొమ్మ ను చూసాను. "పిచ్చి పుల్లయ్యా ... ఒక అమ్మయితోనే వేగలేక బేలగా నన్ను చూస్తున్నవే... పదహారు వేలమంది ని కంట్రోల్ చెయ్యాలి అంటే మాటలా అన్నట్టు జాలిగా నా వైపుకి చూసారు.
ఆల్రెడీ అయిదు గంటలు అయిపోవడంతో అందరు భయలుదేరారు. నేను కూడా రిటర్న్ బస్సు లో వెళ్తాను అని మా మేనేజర్ కి చెప్పి బస్సు ఎక్కాను. నేను మెల్లగా వెళ్ళి అక్కీ ప్రక్కన కుర్చ్చున్నాను. తను లేవబోయింది. "బెస్ట్ పెయిర్ ప్రైజ్ కొట్టి పది నిమషాలు కాకుండా మనం కొట్టుకున్నమంటే పరువు పోతుంది పిచ్చి మొద్దు... ఇది గో “5 Star” ", అని ఇచ్చాను. టక్కున “5 Star” ని లాక్కొని అక్కడనుంచి లేచి వెళ్లిపోయింది. ఇంతలో "Dumb Charades ", స్టార్ట్ చేసారు. 2  టీమ్స్  గా  డివైడ్ చేసారు. అందరికి తెలిసిందే సైగలతో టి  హింది మూవీ చెప్పాలి... వాళ్ళ టీం లో వాళ్ళు పేరు తెలుసుకుని చెప్పాలి. అందరూ స్టార్ట్ చేసారు. అక్కీ మొదట ముభావం గా వున్నా అందరిలో జోష్ చూసి ఆక్టివ్ అయిపోయింది. మేమిద్దరం ఒకే టీం లో వుండటం తో తను సైగలు చేసిన నేను టక్కు చెప్పేసే వాడిని. "బాబు మీ కెమిస్ట్రీ డాన్సు లో చూసాం... ఇక్కడ కూడా చూపించకండి. "అక్షర - అర్జున్" ఒకే టీం లో వుంటే నేను ఒప్పుకోను", అంటూ స్వాతి అరవడం మొదలెట్టింది. అలా తమాషా గా గొడవ స్టార్ట్ అయింది... అరుపులకు నిజం గానే మేము గొడవ పడుతున్నామేమో అని డ్రైవర్ గారు వెనక్కు తిరిగి చూసారు.
దాన్ని వరుణ్ గాడు గమనించి "డ్రైవర్ అన్నా... మేము తమాషా గా గొడవ పడుతున్నాం లే... నువ్వు ముందుకి చూసి నడుపు...లేక  పోతే అందరం పోతాం", అన్నాడు. డ్రైవర్ నవ్వుతూ ముందుకి చూసాడు, ఇంతలో ఎవరో ముసలి భామ్మ బస్సు ని చూసుకోకుండా రోడ్ క్రాస్ చేస్తూ వుంది. దాన్ని గమనించిన డ్రైవర్, బండిని ప్రక్కకు తిప్పబోయి అదుపు తప్పి ప్రక్కనున్న కరెంటు పోల్ ని డీ కొట్టింది. బస్సు చాలా ఫాస్ట్ గా గుద్దడం తో కరెంటు పోల్ వెరిగి బస్సు మీద పడిపోయింది, ముందు డోర్ లోంచి, విండోస్ లోంచి కరెంట్ వైర్లు లోపలకి వచ్చేశాయి.

                [Meet U frnds in next episode... వచ్చే  సంచికలో కలుద్దాం ]