Thursday, May 31, 2012

అందమైన మనసులో... Part - 2


                                          అందమైన మనసులో...

                                    [బోలెడంత ప్రేమ - కొంచెం కన్నీళ్ళు ]

                                                                                                               PART - 2

“Please give me your resume”, అని అడిగాను కళ్ళల్లో కి  సూటిగా చూస్తూ.  పాపం తడబడుతూ, ఫైల్ ఓపెన్ చేసి resume ఇచ్చింది .  

Resume చూస్తూ  “Tell me about yourself”, అని అడిగాను కాస్త గర్వాన్ని గొంతులో ప్రదర్శిస్తూ. తను గొంతు సవరించుకుని తన గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. తన పేరు " అక్షర " అట. B.Tech Electronics & Communication బ్రాంచ్  Vijayawada లో  కంప్లీట్  చేసిందట. ఇక తన ప్రాజెక్ట్ గురించి చెబుతున్నా  కూడా నా చెవులకు ఎక్కలేదు. తను "తెలుగు అమ్మాయి" అన్న పధం దగ్గరే  ఆగిపోయింది. అందమయిన  అమ్మాయి, పైగా తెలుగు అమ్మాయి కావడం తో అంత ఎత్తున్న  కోపం అమాంతం కిందకి పడిపోయింది
"Hey, feel comfortable, Don’t get tense. You can have water if you want”, అన్నాను మెల్లగా. తను కాస్త కంఫోర్ట్ గా ఫీల్ అయ్యి ముందున్న గ్లాస్ లో ని వాటర్ కొద్దిగా త్రాగింది.  
ఇక నేను ఆవేశం అనే రసాన్ని నా మొహం లో ప్రదర్శించ లేక పోయాను. కాస్త నవ్వుతూ మాట్లాడడం స్టార్ట్ చేశాను.  టెక్నికల్ గా కొన్ని Questions  అడిగాను, తను బాగానే రేస్పోన్స్ ఇచ్చింది. ఇంచు మించు ఒక గంట పాటు ఇంటర్వ్యూ చేసి, “You can leave for now, and I ll intimate the result to HR”, అన్నాను. “Ok Sir”, అని నవ్వుతూ లేచి వెళ్లి పోయింది. తను నేను ఒకే సారి ఇంటర్వ్యూ రూం నుంచి బయటకు రావడం మా టీం మెంబర్  సునీత గారు చూసారు, నా మొహం లో వెలుగు ని చూసి, "అరె ఏమయింది... ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది... ",  అని స్టార్ట్ చేసింది. పాట కు  సునీత గారి ని కోపం గా చూసినా  నా మనసులో మాత్రం "గాల్లో తేలినట్టుందే , గుండె పేలినట్టుందే...",  అని పాడుకుంటున్న  టైం లో వరుణ్ గాడు చూసి  "నువ్వు నీ యధవ సునకానంధం... మా లంచ్ అయిపోయింది, ఇక నువ్వు వెళ్లి చేసి రా", అని తన సీట్ లో కూర్చున్నాడు. నేను ఆఫీసు ఫుడ్ కోర్ట్ కి వెళ్లి ఫ్రూట్ బౌల్, మిల్క్ షేక్ తీసుకుని ప్రక్కనున్న టేబుల్ దగ్గర కూర్చున్నాను .
"ఒసే ఇప్పుడే ఇంటర్వ్యూ అయ్యింది, నాకు తెలిసినంత వరకు  పోయినట్టేనే... ", అని వెనుక నుంచి స్వీట్ తెలుగు వాయిస్ విన్పించింది. తల తిప్పి  చూసాను, అక్షర ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతోంది.  
" నా దరిద్రం కాకపోతే,  మొన్న గుడి లో నేను తిట్టిన వెధవే ఇక్కడ ఇంటర్వ్యూ చేసాడు. నన్ను చాలా సీరియస్ గా చూస్తూ questions అడిగాడు. నేను మోస్తరుగా సమాధానం చెప్పాను. బట్ గ్యారింటీ గా దొబ్బెస్తుంది అనుకుంటున్నాను, అయినా నా ఖర్మ కాకపోతే ఎవరూ లేనట్టు దరిద్రుడే ఇంటర్వ్యూ కి రావాలా!!! ", అని ఇంకా ఏదో చెబుతోంది. నాకు నవ్వొచ్చి  ఇక తిట్లు వినలేక లేచి మిల్క్ షేక్ తీసుకుని తన ముందు కూర్చున్నాను. రెడ్ హేన్దేడ్ గా బుక్ అయిపోయాం అని అర్థం అయిపోయింది తనకి. "నేను తరువాత ఫోన్ చేస్తాను నీకు ", అని కాల్ డిస్కనెక్ట్  చేసి నా వైపుకి చూసి మళ్లీ  దాపురించావేమిరా దరిద్రుడ అన్నట్టు నన్ను చూసి “My friend... phone... “, అంటూ ఇబ్బంది గా నవ్వింది .
"నాకు తెలుగు వచ్చు, మేము తెలుగు వాళ్ళమే, అందుకే నీ తిట్లు తినలేక మరియు వినలేక  నిన్ను ఆపుధామని వచ్చాను", అని నవ్వాను
"సర్, అది... రోజు నేను మిమల్ని తిట్టాను కదా, అది గుర్తు పెట్టుకుని  సెలెక్ట్ చెయ్యరేమో అని కోపం లో తిట్టాను... సారీ సర్", అంది
"పర్సనల్ ఇన్సిడెంట్స్ ని professional కి లింక్ చెయ్యము. అసలే తెలుగు అమ్మాయివి. కాబట్టి  భయం పెట్టుకోకు. నేను నిన్ను పాస్ చేశాను, H.R నుంచి కాల్ వస్తుంది,  భయపడకుండా బాగా మాట్లాడు.", అని చెప్పి " నన్ను తిట్టి బాగా అలిసిపోయినట్టు వున్నావ్,   మిల్క్ షేక్ త్రాగు బలం వస్తుంది ", అని మిల్క్ షేక్ కప్పు ని ఇచ్చి లేచాను. సర్పంచ్ గా ఓడిపోయిన నాయకుడి ని C.M. చేస్తే వాడి మొహం లో ఎంత  ఆనందం కనిపిస్తుందో అంత ఆనందం అక్షర కళ్ళల్లో  కనిపించింది
అదే రోజు H.R. రౌండ్ కూడా క్లియర్ చేసి సెలెక్ట్ అయిపోయింది. ఫ్రెషర్ కావడం తో తరువాత వారం జాయినింగ్ డేట్ ఇచ్చారు. తను .కే చెప్పి మరుసటి వారం  లో  జాయిన్ అయిపోయింది. తను మా టీం లోనే జాయిన్ అయ్యింది. నేనే ఇంటర్వ్యూ చెయ్యడం తో నన్నే తన మెంటర్ గా వేసారు . మాములుగా జాయిన్ అయిన వాళ్ళను ట్రీట్ ఆడుతారు, కానీ మా వాళ్ళు మాత్రం నన్ను అడగడం స్టార్ట్ చేసారు.  
లంచ్ టైం లో అక్షర కూడా మాతో పాటే వచ్చింది. ప్లేస్ ఎక్కడా  లేక పోవడం తో తను నా ప్రక్కన వున్న చైర్  లో  కూర్చుంది. 'సుడిగాడు అంటే  నువ్వేరా !!! ' అన్నట్టు సునీత నన్ను చూసి కళ్ళు  ఎగరేసింది. నాలో నేను మురిసిపోయాను... నా సిగ్గులు  మొగ్గలై పువ్వు లు పూయడానికి రెడీ అవుతుంటే " చాల్లే సంబడం , మూసుకుని భోజనం చెయ్ ", అని అనట్టు చూసాడు వరుణ్.  '120 కిలో మీటర్ స్పీడ్ లో వెళ్తున్న "ఆడీ", కారు ట్రాఫ్ఫిక్ లో రెడ్  సిగ్నల్  ని  చూసి సర్రున బ్రేక్  వేసినట్టు' నా సిగ్గులు మొగ్గలాగే మిగిలి పోయాయి.
అలా ప్రతి సీన్ ఒక పులకింత లాగా, కల లాగా ఫాస్ట్ గా మూవ్ అయిపోతోంది.

ఒక రోజు నేను బస్ స్టాప్ లో నిల్చుని బస్సు కోసం వెయిట్ చేస్తుంటే నా మొబైల్ మోగింది, చూడగానే అక్షర నెంబర్ డిస్ప్లే అయింది. అస్సలు నమ్మలేక పోయాను 'VIM బార్ తో కడిగిన స్టీలు పాత్ర లా' మెరిసిపోయింది నా ఫేసు . ఆఫీసు లో మాట్లాడుకోవడం తప్ప ఇంతవరకు నేను తనకు కానీ తను నాకు కానీ ఫోన్ చెయ్యలేదు. ఫోన్ లిఫ్ట్  చేసి "హాయ్ అక్షర... గుడ్ మార్నింగ్", అన్నాను.
" హాయ్ అర్జున్, వెరీ గుడ్  మార్నింగ్. బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా ?", అని అడిగింది.
"హా... అవును, నీకు ఎలా తెలుసు?", ఆశ్చర్యం గా అడిగాను.
"నేను అదే రోడ్ లో బైక్ మీద  వున్నాను. మీరు  రైట్ సైడ్ తిరిగితే కనిపిస్తాను", అని అంది.
నేను ఆనందం గా తిరిగి చూసాను. "రైట్ సైడ్ అంటే కుడి వైపు తిరగాలి బాస్ - ఎడమ వైపుకి కాదు ", అంది. ఓహ్ తత్తరపాటు లో బిత్తరపాటు అంటే ఇదేనేమో అని రైట్ సైడ్ తిరిగాను. బైక్ మీద హెల్మెట్ వేసుకుని  కూర్చుని ఒక అమ్మాయి చెయ్యి ఊపింది. నన్ను కాదులే అనుకుని అన్ని వైపులా చూసాను. తను హెల్మెట్ తీసి "అర్జున్ గారు... ", అన్నది. ఓహ్ అనుకుని ముందుకి వెళ్లి బైక్ దగ్గర నిలబడ్డాను. స్పెక్ట్స్ తీసి నన్ను చూసి నవ్వింది. జేమ్స్ బాండ్ సినిమా లో యాక్టింగ్ చేస్తున్న   తెలుగు హీరొయిన్ లా అనిపించింది. "మీరు బైక్ తీసుకుని రాలేదా ఇవ్వాళ ?", అని అడిగింది
"లేదు నా ఫ్రెండ్ onsite నుంచి వచ్చాడు, వాడు కావాలని అడిగితే ఇచ్చాను", అన్నాను
"ఓహ్... అయితే మీకు  అభ్యంతరం  లేకపోతే  నాతో రావచ్చు", అంది . అందమయిన ముద్దుగుమ్మ బైక్ రైడ్ ఛాన్స్ ఇస్తే వెధవయినా  వద్దంటాడా !!! కానీ నేను మొహమాటం తో "మా ఫ్రెండ్ వస్తాను అన్నాడు. సో, వాడి కోసం వెయిటింగ్", అన్నాను. వెంటనే నాలోని అంతరాత్మ భయటకు  వచ్చి "నువ్వూ నీ యదవ  మొహమాటం!!! అక్షర వెళ్లి పోయిందంటే ఆకాశం వైపు కి చూసి ఉమ్మేసుకోవాలి, దరిద్రుడా " అన్నాడు
తను డిసప్పాయింట్ గా పేస్ పెట్టి, "మాతో కూడా వస్తే, మేమూ ఫ్రెండ్స్  అవుతాం  సర్ ", అన్నది. ఇక బెట్టు చేస్తే నా అంతరాత్మ  గాడు భయటకు  వచ్చి నాలుగు పీకినా పీకుతాడు అనుకుని,  "సరే", అన్నాను
"డ్రైవింగ్ చేయండి ", అని బైక్ ఇచ్చింది. "చేతికి గ్లౌస్ అంతా  వేసుకున్నావ్... పర్లేదు నువ్వే డ్రైవ్ చెయ్", అన్నాను. ఓకే అని స్టార్ట్ చేసింది. నేను  వెనుక కూర్చున్నాను. లేడీస్ బైక్  (డియో ) కావడం తో నేను  కూర్చోవడానికి ఇబ్బంది పడ్డాను. మామూలు  గా  అమ్మాయిని  బైక్ లో ఎక్కించుకుని తిరిగాను కానీ అమ్మాయి వెనుక కూర్చోవడం ఫస్ట్ టైం. నేను వెనుక కూర్చుంటే అమ్మాయి కి  ఎలా అనిపిస్తుందో కానీ, నాకు  మాత్రం చాలా టెన్షన్ గా వుంది. ఎందుకంటే  బ్రేక్  వేసినప్పుడు ఎక్కడ పట్టుకోవాలో  తెలియదు.   బాయ్ ఫ్రెండో  అయితే పర్లేదు, భుజం  పట్టుకున్నా అది రొమాన్స్ లో  కలసి పోతుంది. అమ్మాయి వెనుక కూర్చోవడం నిజం గా చాలా కష్టం సుమీ... అని నాలో నేను భయపడుతుంటే,  అక్షర వేగం పెంచడం తో తన కురులు అలా గాల్లో కి లేచి నా మొహం మీద పడింది, అంభిక  అగరభత్తుల  లా    కురుల పరిమళం వెధజల్లుతుంటే నా మనసు నన్ను వదలి  అలా  మబ్బులోకి తేలిపోయింది.  నేను అలా గాల్లో విహరిస్తున్నంత లో షడన్ గా  బ్రేక్ వేసింది, నేను తన భుజం పట్టుకుంటే బాగోదని హెల్మెట్ పట్టుకున్నాను  బ్యాలన్స్ కోసం. అక్షర వెనక్కు తిరిగి  "ఇబ్బంది పడుతున్నట్టు వున్నారు , కాస్త ముందుకి జరిగి ఫ్రీ గా కూర్చోండి  ", అని చెప్పింది. అలాగే అన్నటు కాస్త ముందుకి జరిగాను
"వెనుక కుర్చున్నప్పటి నుంచి మీరు  ఒక మాట  కూడా  మట్లాడలేదు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్ప లేదు? ", అని అంది.  నేను మేఘాలలో  తిరుగుతుంటే నీ మాటలు నాకు ఎలా వినిపిస్తుంది,  అని మనసులో అనుకుని "ఓహ్, నువ్వు మాట్లాడింది  నాకు ఏది వినిపించ లేదు అక్షర ", అన్నాను. అలాగా అని తను కాస్త వెనక్కు వచ్చి మాట్లాడటం స్టార్ట్ చేసింది. అలా ఇబ్బంది  పడుతూ లేస్తూ  మాట్లాడుతున్నంతలో మా ఆఫీసు వచ్చింది. బైక్ ని పార్క్ చేసి ఇద్దరం కలసి లోని కి వెళ్ళాం.  "I think, మీరు  బైక్ లో కాస్త uneasy గా ఫీల్ అయినట్టు  వున్నారు ?", అని అడిగింది. మా భాధలు నీకు ఎలా చెప్పేది అనుకుని, "నేను height  ఎక్కువ, అది చిన్న బైక్ అందుకే కాస్త ఇబ్బంది పడ్డాను", అని కవర్ చేశాను
"ఓహ్ అలా ఐతే ఓకే ", అని నవ్వింది.
 రోజుటి  నుంచి మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఎంత క్లోజ్ అయ్యామంటే  మీరు ప్లేస్ లో నువ్వు అనుకునేంత అన్నమాటఇద్దరి  రూమ్స్ ఒకే ఏరియా లో కావడం తో ఆఫీసు కి కలిసే వచ్చే వాళ్ళం, కలిసే వెళ్ళే వాళ్ళం.  అక్షర చాల ఫాస్ట్ లర్నర్  కావడం  తో  రెండు నెలలో కంప్లీట్ చెయ్యాల్సిన ట్రైనింగ్, ఒక్క నెలలోనే  కంప్లీట్ చేసేసాను. అది కాక ఇద్దరం తెలుగు వాళ్ళం కావడం తో కమ్యూనికేషన్ advantage అయింది. దాంతో తనని ప్రాజెక్ట్ లో పడేసారు.
నెలలో ఆన్ సైట్ co ordinaters  రావడం తో వీక్ఎండ్  " ప్రకృతి రిసార్ట్ " లో  టీం ఔటింగ్ పెట్టారు. నేను మా టీం లో కాస్త 'తోపు' లాంటివాడిని కావడం తో ప్రోగ్రామ్స్ అర్రెంజ్ చెయ్యడానికి మా మేనేజర్ తో కలసి ముందే వెళ్లిపోయాను. తరువాత అందరూ  బస్సు లో   రిసార్ట్  కి వచ్చారు. అందరిని నవ్వుతూ పలకరిస్తున్నా నా కళ్ళు మాత్రం అక్కీ  కోసం వెతుకుతోంది [బాగా క్లోజ్ అయిపోయాం కద, కాబట్టి పెట్ నేమ్ తో పిలుస్తున్నాను బాబు, మీరు ఫీల్ అయిపోకండే...]. ఇంతలో బస్సు లోంచి అక్కీ  మెల్లగా పట్టు పరికిణి లో కిందకు దిగింది.   హాఫ్ శారి లో తను  సౌందర్యానికి  నిర్వచనం అన్నట్టు వుంది . గోల్డెన్ రెడ్ బ్లౌస్, రెడ్ దుప్పట్టా, గోల్డ్ కలర్ తో రెడ్  మిక్స్ అయిన bottom  వేసుకుని  అచ్చమయిన తెలుగు అమ్మాయి లా  వచ్చింది.  అందుకే అంటారు అమ్మాయి అందాన్ని  చూడాలంటే  అది శారి లోనే చూడాలి. దాచాల్సిన అందాన్ని దాచి, చూపించాల్సిన అందాన్ని చూపిస్తూ  సంప్రదాయం గా సెక్సీ గా కనిపించే కట్టు. అక్కీ  ది  పాలమీగడ లాంటి మేని రంగు కావండం  తో, రెడ్ కలర్ కాంట్రాస్ట్ అయ్యి ఇంకా చాలా చాలా సెక్సీ గా కనిపించింది. అస్సలు నేనైతే కళ్ళు తిప్పుకోలేక పోయాను. మొదటి సారి బైక్ లో కూర్చున్నపుడు జస్ట్ మబ్బుల్లో మాత్రమే విహరించాను, ఇక ఇప్పుడైతే   స్వర్గం అంచుల దాకా  వెళ్ళిపోయాను. హ్యాపీడెంట్  వైట్ వెలుగు కూడా నాముందు తక్కువే అనేటంతగా  మెరిసిపోతున్నాయ్ నా కళ్ళు.  వెన్నెల్లో గోదావరిని చూసినంత హాయిగా అనిపించడం తో నేను కళ్ళు కూడా  ఆర్పకుండా అక్కీనే చూస్తుండిపోయాను
అక్కీ నన్ను observe  చేసింది. ప్రక్క వాళ్ళతో మాట్లాడుతూనే నా వైపు కి  చూసి కళ్ళతో "హాయ్" అన్నట్టు కను బొమ్మలు ఎగరేసింది.

                                                                          
                                    [Meet U frnds in next episode... వచ్చే  సంచికలో కలుద్దాం ]