Tuesday, August 30, 2011

Mr. కళంకిత్...

Mr. కళంకిత్
                       వీడి జీవితం - కళలకు అంకితం                             
                 ----------------------------
ఫ్రెండ్స్...ఇంతకముందు నా ఆఫీసు లో రోజు...సారీ గంట జరిగిన సన్నివేశాన్ని మీకు కథ రూపంలో అందించాను. ఇపుడు నా లైఫ్ లో జరిగిన కొన్ని కధలను, మనుషులను, సన్నివేశాలను మీకు పరిచయం చేస్తాను.
నేను చిత్తూరు లో B.Tech చేశాను. మా క్లాసు లో అరవై మంది స్టూడెంట్స్ వుండేవారు. అందరిలో Mr. కళంకిత్ డిఫరెంట్. ఏంటి అదేదో E t.v. సీరియల్ పేరులా వుందని షాక్ ఐతే మరి వాడికున్న క్యాప్షన్ చూస్తే మీరేమంటారో. క్యాప్షన్ "వీడి జీవితం - కళలకు అంకితం". క్యాప్షన్ ఎందుకు పెట్టామో వాడితో మాట్లాడిన పది నిముషాలలో మీకు అర్థం అయిపోతుంది.
పూరి జగన్నాథ్ సినిమా లో లా మన వాడు బిలో యావేరాజ్ స్టూడెంట్. దాంతో తనలో దాగున్న కళలను అందరికి చూపించి కెవ్వు, కేక, రచ్చ, తురుము అనిపించుకోవాలని తపించి పోయేవాడు.బొమ్మల బాపు గారిని చూసి inspire అయ్యి తనలోని చిత్రకారుడిని నిద్ర లేపాడు.
మొదట గుర్రం బొమ్మ వేసాడు, అందరు గాడిద అన్నారు - బొమ్మను కాదు వాడిని.
కోపం తో కుక్క బొమ్మ వేసాడు, అందరు పంది అన్నారు - మళ్లీ బొమ్మను కాదు వాడినే.
పౌరుషంతో పంది బొమ్మ వేసాడు, అందరు ఎలుగు బంటి అన్నారు.
ఎలాగయినా మెప్పించాలని ఏనుగు బొమ్మ వేసాడు, అందరు నీటి ఏనుగు అన్నారు - ఈసారి మాత్రం బొమ్మనే లెండి. 
తరువాత T .V  లో పాడుతా తీయగా ప్రోగ్రాం చూసి మళ్లీ Inspire అయ్యి ది గ్రేట్ Gantasala, S.P. B అంత కాకపోయినా కనీసం కారుణ్య, శ్రీ రామచంద్ర లా Indian Idol అయ్యి అమ్మాయిలను పటాఇంచాలి  అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంట్లో ప్రాక్టీసు స్టార్ట్ చేసాడు.
"ఇది పాట కానే కాదు... రాగం నాకు రాదు..." అంటూ కచేరి మొదలెట్టాడు, అరుపులకు, సారీ గానామృతానికి పరవశించిపోయి చిత్రకార్తి మాసం కావడంతో ఊర్లోకి కొత్త కుక్క వచ్చిందని ఆశగా అన్ని కుక్కలు ఇంటిముందు ఆగి Mr. కళంకిత్ ని అదోల ఒరకంటతో చూసాయి. కుక్కల దండుని చూసి మొదట భాధ పడ్డాడు, భయపడ్డాడు తరువాత తేరుకున్నాడు. వెంటనే ప్రకనున్న కర్ర తీసుకుని అదిలించాడు. ఇంతలో వీధిలోని జనాలందరు ఇంటి ముందుకు కర్రలు తీసుకుని వచ్చారు.
"ఎంట్రిన్ డబ్బా లో ఎరుసేనక్కాయలు దాచుకు తినే ఎర్రి పీనుగా, అది పాట కాకపోతే ఎందుకు పాడావ్, రాగం రాకపోతే ఎందుకు అరిచావ్? ఇంకోసారి పాట పైత్యం అన్నావంటే డాక్టర్ లేని పిచ్చాస్పత్రి లో చేర్పించి పిచ్చి వాళ్ళ దగ్గర వైద్యం చేఇస్తం", అని అందరు చెప్పడంతో సారీ వార్నింగ్ ఇవ్వడంతో బెదిరిపోయాడు. బయటకు కనిపించే Mr. కళంకిత్ అయితే ఊరుకున్నాడు కానీ లోపల్లున కలాంతరాత్మ  ఊరుకోడుగా, 'నా కళ ను అర్థం చేసుకునే జ్జ్ఞానం పిచ్చినా జనాలకు లేదు కాబట్టి డైరెస్టు గా కాలేజీ ఆడిటోరియం లో ప్రదర్శించాలని అనుకున్నాడు. వెంటనే కాలేజీ లో ప్రతి శనివారం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో తన పేరు ఇచ్చాడు. తన వంతు రాగానే స్టేజి ఎక్కాడు. తన పాట కోసం ఎదురు చూస్తున్న ఎర్రి జనాలను చూసి ఒళ్ళు పులకరించి మతి, గతి, తప్పిపోయింది. లోపలున్న కలాంతరాత్మ పురివిప్పాడు.
"శంకరా...నాధ శరీరా బర", అంటూ స్టార్ట్ చేసాడు. మొదట అందరు పాట అనుకున్నారు, తరువాత పద్యం అనుకున్నారు, తరువాత పాఠం అనుకున్నారు...తరువాతే తెలిసింది పాఠం కాదు పైత్యం అని.
"శంకరా...", అంటూ పాటను అడ్డు అదుపు లేకుండా పరుగులేతించాడు.
"నువ్వు అపరా...", అంటూ అందరూ గట్టిగా అరిచారు.
"మీరు అలా అరిచారంటే ఇంకా గట్టిగా పడతాను", అంటూ ఇంకా గట్టిగా పాడడం మొదలెట్టాడు. చప్పట్లు వస్తాయనుకుంటే చెప్పులు వచ్చి మీద పడ్డాయి.ఎవరో కానీ కొత్త Bata Shoe అనుకుంట కసిగా విసరడంతో Mr. K కి తగాలరాని చోట తగలడంతో  కళా ప్రవాహానికి అడ్డు పడింది. Indian Idol judges & viewers బతికి పోయారు.

మన
Mr. K మరో వారానికి దెబ్బల నుంచి కోలుకున్నాడు. లోపల్లున కలాంతరాత్మ కూడా నిద్రలేచాడు. గానామృత బాండాన్ని పక్కన పెట్టి నట్యామ్రుథాన్ని ఒలికించాలి అనుకున్నాడు. అసలే ప్రభు దేవ, లారెన్స్ లకు Direction దోమ కుట్టడంతో డాన్సు మాస్టర్ పోస్ట్ ఖాలీలను పూరించాలని మళ్లీ సాంస్కృతిక కార్యక్రమాలలో తన పేరుని ఇచ్చాడు.
అందరికి ఎలా తెలిసిందోగాని పావుగంట లో Mr. K మొబైల్ కి పదివేల SMS లు వచ్చాయి. కొందరు వార్నింగ్ SMS లు పంపారు, కొందరు రాకెట్లు వేసారు, కొందరు కాల్ చేసి బెదిరించారు, కొందరయితే డైరెక్ట్ గా వచ్చి వార్నింగ్ ఇచ్చారు. అయినా లోపలున్న కలాంతరాత్మ బెదరలేదు, భయపడలేదు, పేరు వెనక్కు తీసుకోలేదు. మెల్లగా వెళ్లి తన సీట్ లో కూర్చున్నాడు. సీట్ లో తన కోసం Gift ఉంచారు. గాంధీగిరి లా నిరసనను తెలియజేస్తున్నారు అనుకుని పార్సెల్ ని ఓపెన్ చేసాడు. అందులో గొడుగు వుంది. గొడుగుతో పాటు ఎర్ర లెటర్ వుంది. గొడుగు పక్కన పెట్టి లెటర్ ఓపెన్ చేసాడు. "పీనుగులతో పరచకాలాడే ముదనష్టపు పీనుగా...మర్యాదగా నీ పేరు వెనక్కు తీసుకో, లేదంటే ప్రకనున్న గోడుగుని ఎక్కడో గుచ్చితే( కీక్...సెన్సార్ సౌండ్ - సినిమా లు చుడట్లేదేటి) నోట్లో బయటకు వస్తుంది. దాంతో ఊరుకోను, లోపలున్న గొడుగు ని ఓపెన్ చేస్తాను - ఇట్లు ప్రజాబందు", అని వుంది.
ఒకసారి లెటర్ లో ఉన్నది ఊహించుకున్నాడు అంత మర్యాదగా చెప్పడంతో పేరుని వెనక్కు తీసుకున్నాడు.

వరం పాటు కలాంతరాత్మ శాంతించాడు. అగ్ని పర్వతాన్ని ఆపవచ్చు, కానీ కళాగ్ని పర్వతాన్ని ఆపడం దేవుడి తరం కూడా కాదు. ఖాలీగా వున్న వారంలో 'A to Z ' తెలుగు ఛానల్ లో "నవ్వుతావా  - చస్తావ" ప్రోగ్రాం కి ఫ్యాన్ అయిపోయాడు. ప్రోగ్రాం ఏంటంటే మనం జోకులు చెప్పి అందరిని నవ్వించాలి. వాళ్లేసే యాదవానా...కుళ్ళు జోకులకు judges కష్టపడి మరీ నవ్వు తెప్పించుకుని నవ్వుతారు. ప్రోగ్రాం చూడగానే Mr. K కి మాంచి ఆలోచన వచ్చింది. తనలోని హాస్యామ్రుతాన్ని అందరిఫై ఒలికించాలి అనుకున్నాడు. ముందుగా క్లాసు లో ఫ్రెండ్స్ ని హాస్య సముద్రం లో ముంచి వాళ్ళను ఉక్కిరి - బిక్కిరి చెయ్యాలి, అటు తరువాత "నవ్వుతావా  - చస్తావ" ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేసి మా చిత్తూరు పరువుని ఆంధ్ర దేశం లో అల్లాడించాలి అనుకున్నాడు.
క్లాస్సులో తన హాస్యామ్రుతాన్ని ఎవరిఫై ఒలికిన్చాలా అని ఆలోచించాడు. క్లాస్సులో కెల్లా అమాయక అక్కు పక్షి ఎవరు అంటే అందరూ ఏకగ్రీవం గా నున్ను ఎన్నుకున్నారు. నన్ను చూడగానే Mr. కళంకిత్ కి ఆనందం రెట్టింపు అయింది. Mr. K నా వైపు వస్తుంటే మానబంగం సీన్ లో విలన్ ని చూసి హీరొయిన్ భయపడట్టు నేను భయం గా వాడిని చూసాను.
వాడు నాదగ్గరకు వచ్చి "మచ్చా (మా చిత్తూరు లో ఎవరిఫైనయినా ప్రేమ కారిపోతుంటే అపుడు ఉపయోగిస్తారు పధం) నేను నీకు మాంచి...జోకు చెప్పాలని డిసైడ్ అయ్యాను రా", అని ప్రక్కన కూర్చున్నాడు.
నువ్వు డిసైడ్ అయిన తరువాత నేను చేసేదేముంది  నా బొంద అని, 'స్వామీ వెంకటేశ్వర... గండం నుంచి నన్ను గట్టేకిస్తే ఆరు నెలల్లో ఆరుసార్లు మీ కొండకి వచ్చి గుండు కొట్టుకుంటాను' అని దేవుడిని ప్రార్థించి భయం గా Mr. కళంకిత్ వైపు చూసాను.
"తల్లి: స్కూలు మొత్తం లో నీకు ఎవరంటే ఇష్టం రా ప్రేమ్"
ప్రేమ్: లాంగ్ బెల్ కొట్టే లక్ష్మయ్య మమ్మీ...టకీమని చెపాడు ప్రేమ్."
హహహ...ఎలా వుంది మచ్చా...అడిగాడు Mr. K
"పాపిష్టి పిచ్చోడికి Ponds పౌడర్ పూసినట్టు అందం గా వుందిరా", అన్నాను వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ.
పట్టరాని ఆనందంతో నన్ను కౌగిలించుకుని "నా కళ ను ప్రశంసించిన మొదటి వ్యక్తివి నీవేర...నా జోకుల పుస్తకం నీకే అంకితం ఇస్తాను", అన్నాడు.
"పినొయిల్ బొట్టెల్ లో పాలు పోసుకుని తాగే పుండాకోరు వెధవ...నేను నిన్ను తిట్టాను రా దరిద్రుడ. ఆరో నేలలోనే పుట్టిన అష్టావక్రుడా, ప్రపంచంలో తిట్లను కూడా పొగడ్తలా ఫీల్ అయ్యే అయోమయం గాడివి నువ్వేరా", అని తిట్టాలనుకుని పళ్ళు ఇకలించి ఇంకేంటి రా విశేషాలు అన్నాను ( దీన్నే మరి - గూటిలో వున్న గుండ్రాయిని ఎక్కడో (కీక్...మళ్లీ సెన్సార్ సౌండ్) పెట్టుకోవడం అంటే.
"నీ కోసం ఇంకో జోకు చెబుతాను మచ్చా..
బార్య: పంతులకి పిచ్చా?
భర్త
: నేకేందుకా డౌటు?
బార్య
: పట్టపగలు...అదిగదిగో అరుంధతి నక్షత్రం అంటూ మనల్ని ఆకాసం చూడమంటాడేంటి?" అని ఆపాడు.
"తరువాత...", అన్నాను స్వాతిముత్యం సినిమా లో కమల్ హసన్ లా మొహం పెట్టి.
"తరువాతేముంది...అంతే జోక్ అయిపోయింది", అన్నాడు.

నాకు నేనే చిక్కలగిలి పెట్టుకున్నా నవ్వు రాలేదు, జంధ్యాల - బ్రంహానందం కాంబినేషన్ లో అన్ని సీన్లు గుర్తుకి తెచ్చుకున్నాను అయినా నవ్వు రాలేదు. లోపల ఏడుస్తూ కూడా బయటకు నవ్వవచ్చు అని నాకు ఇపుడే తెలిసింది. "అడిగి మరి రెండు జోకులు విన్నావంటే నీ పేరు సువర్ణాక్షరలతో లికించ వచ్చు మచ్చా. నీ కోసం మరో జోక్", అని ఆగాడు.
నాకింతవరకు లూస్ మోషేన్స్ రాలేదు కానీ నా ప్యాంటు కింద తదిచినట్టు అనిపించింది. దరిద్రుడు చెప్పినట్టు నేను ఇంకో జోక్ వింటే నిజం గానే నా పేరు సువర్ణాక్షరలతో లికించాల్సి వస్తుంది నా సెవపేటిక మీద అని అనుకుని "అరె...అక్కడ సువర్ణా నిన్నే అదోలా చూస్తోంది. పోయి నీ హాస్యామ్రుతాన్ని ఒలికించు", అన్నాను.
సువర్ణా మా క్లాసు లీడర్. బాగా బలంగా, పుష్టిగా వుండటంతో అమ్మయి నే లీడర్ గా పెట్టారు. అమ్మాయికీ కాప్షన్ వుంది "విగ్రహం ఎక్కువ - నిగ్రహం తక్కువ".
మన Mr. కళంకిత్ సువర్ణ దగ్గరకు వెళ్లి "సువర్ణా...నేనిప్పుడు నీకో జోక్ చెబుతాను అన్నమాట...నువ్వు నవ్వాలన్న మాట", అని జోక్ చెప్పాడు.
వెంటనే "అబ్భా...", అని గట్టి గా సౌండ్ వచ్చింది. Mr. కళంకిత్ తన ఎడమ చెంపని ఎడమ చేత్తో రుద్దుకుంటూ వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు.
ప్రక్క వాడు బాధ పడుతుంటే ఇంత ఆనందం గా ఉంటుందని ఇపుడే తెలిసింది నాకు.
వాడు నా వైపు కి చూసి "జోక్ తనకు నచ్చక పోతే చెప్పోచుగా, కొట్టడమెందుకు", అని నసిగాడు.
"ఇంతకి ఎం జోక్ చెప్పావు రా", అని అడిగాను. ( దీన్నే మరి - రోట్లో వున్న రోకలి ఎక్కడో (కీక్...మళ్లీ సెన్సార్ సౌండ్) పెట్టుకోవడం అంటే...పెట్టుకోవడమే కాదు, కలబెట్టం కూడా అనొచ్చు).
"ముగ్గురు ఆడవాళ్లు పార్టీ కి చీర కట్టుకోవాలో అని మాట్లాడుకుంటున్నారు.
మొదటి స్త్రీ: నా భర్త కు నల్ల జుట్టు వుంది...అందుకు నేను నల్ల చీర కట్టుకుంటాను అంది.
రెండవ స్త్రీ: నా భర్త కు తెల్ల జుట్టు వుంది...అందుకు నేను తెల్ల చీర కట్టుకుంటాను అంది.
మూడవ స్త్రీ: నా భర్త కు అసలు జుట్టే లేదు...అంటే నీను చీర కట్టుకోకుండా రావాలా అంది !!!" అని ఆపాడు.
"అమ్మాయిలకు అడుల్ట్ కంటెంట్ జోకులు చేబుతవురా...సెవాలతో సరసాలాడే సాడిస్ట్టు దరిద్రుడ", అనితిట్టాలనుకున్నాను, కానీ తిట్టలేదు.
కాసేపటికి నొప్పి తగ్గినట్టుంది, నీ వైపు కి చూసి ఇంకో జోక్ చేబుతానురా అన్నాడు.
మొన్న జరిగిన Mathematics Exam లో కిషోర్ గాడు నాకు చూపించలేదు. అందుకు వాడిఫై పగ తీర్చుకోవాలనుకుంటే మంచి అవకాశం వచ్చింది "అరె... కిషోర్ గాడి కి నీ జోక్ చెప్పి నవ్వించర", అని దొంగల మీదకు పోలీసు కుక్కలను వదిలినట్టు వదిలాను.
Mr. K వాడి దగ్గర కు వెళ్లి ఏదో జోకు చెప్పాడు. పాపం కిషోర్ బాగా Hurt అయ్యినట్టున్నాడు, వెంటనే  మన Mr. K చేయి పట్టుకుని గట్టి గా కరిచాడు. అటుపక్క ఇరవయ్ మంది ఇటుపక్క ఇరవయ్ మంది పట్టి లాగి విడిపించారు. భాధతో, భయంతో, భావోద్వేగంతో ఏడుస్తూ వచ్చి నా పక్కన కూర్చున్నాడు.
మాములుగా కసి మీదున్న ఊర కుక్క కొరికితే పైన రెండు కింద రెండు పళ్ళు పడి అరకిలో కండ పోతుంది. కానీ కాకా మీదున్న కిషోర్ గాడు కొరకడంతో పైన ఐదు కింద ఐదు పళ్ళు పళ్ళు పడి, ఇంచు మించు కిలో కండ వచ్చేసి వుంటుంది.
ఇంతలో Electronics సర్ క్లాసు లోకి ఎంటర్ అవ్వడంతో Mr. K తన బాధ ని పంటి కిందే ఆపుకున్నాడు. మా సర్ మహిమే అంత, తను క్లాసు లో పాఠం చెబుతుంటే జోల పాట లా హాయ్ గా నిద్ర వస్తుంది. లాస్ట్ బెంచ్ కావడం తో నిద్ర పోయాను. క్లాసు అయిపోగానే సర్ వెళ్లి పోయారు. Mr. K కి నొప్పి తగ్గినట్టు వుంది, నిద్ర పోతున్న నన్ను లేపి "ఏం చేస్తున్నావ్?"అని అడిగాడు.
'అరకిలో పచ్చి మిరపకాయలు తిన్నట్టు' ఒళ్ళు మండింది నాకు.
"ఓహ్...నిద్ర పోతున్నావా? ఏం కళ వచ్చింది? నాకు చెప్ప కూడదు?", అన్నాడు.
"నీయబ్బా...పుల్చిపోయిన పెరుగన్నం లో పురుగుల మందు కలిపి గొట్టంతో నట్లో కుక్కేస్తా నపుంసకుడా", అని అరవాలనుకున్నాను, అయినా ఆపుకున్నాను.
"నీ నిద్ర పోవడానికి నేనో మాంచి జోక్ చెబుతాను,
రెండు చీమలు స్కూటర్ మీద వేల్తునాయి" అన్నాడు"నాకు చేమ జోకులు నచ్చవు", అన్నాను కోపంగా.
"రెండు పందులు పల్సర్ మీద వేల్తునాయి" అన్నాడు."నాకు పంది జోకులు కూడా నచ్చవు", అన్నాను ఇంకా కోపంగా.
"రెండు పులులు హోండా మీద వేల్తునాయి" అన్నాడు.
"ఒరేయ్ నీయబ్బా...సెవాల మీద పడ్డ మరమరాలతో భెల్ పూరి చేసుకుతినే బేవార్సునాయాల...ఇంకోసారి జోకు అని నన్ను గోకావంటే మానభంగం కేసు పెట్టి క్రిమినల్ కసబ్ గాడు  వుండే సెల్లు లో తోసేస్తా. నీ జీవితం కళలకు అంకితం కాదురా గూట్లే - నీ జీవితం కళలకు కళంకం రా" అంటూ గట్టిగా అరిచాను. అమాయకం గా వుండే నాలో ఇంత Fire ని చూసి మొదట ఆశర్య పోయాడు తరువాత అక్కడనుంచి పారిపోయాడు. దెబ్బకు తన కళలకు తాత్కాలికం గా తాళం వేసాడు.
T.V. ఆన్ చెయ్యగానే "Harry Porter " మూవీ వస్తోంది. దాన్ని చూడగానే మాంచి ఆలోచనవచ్చింది.
వెంట్రుకంత కళ వుంటే అపుకోవచ్చు కానీ వొళ్ళంతా కళ ప్రవహిస్తుంటే ఆపుకోలేకపోయాడు. శ్రీ కృష్ణుడి చిన్నప్పటి లీలలను C.D. లో చూసి దాన్ని ఇంగ్లీష్ లో తర్జమ చేసి "Harry Porter " బుక్ రాసి ప్రపంచ ప్రక్యతి గాంచిన J.K Rowlings ని ఎలాగైనా బీట్ చెయ్యాలుకున్నాడు. Sidney Sheldon, Shakespeare అంత కాకపోయినా ఎండమూరి, మధుబాబు లా నాలుగు పుస్తకాలు రాసి పడేయాలనుకున్నాడు. అదే ఆవేశాన్ని కంటిన్యూ చేస్తూ 'ప్రగతి బుక్ సెంటర్ కి వెళ్లి - డజను వైట్ పేపర్స్ కొన్నాడు. అయిన...నాలోని రచయితామృతం డజను పేపర్లో బంధిచడం కష్టం అని మళ్లీ షాపు కి వెళ్లి "రెండు డజన్లు..., కాదుఆరు డజన్లు..., కాదు కాదు డజను డజన్లు ఇవ్వండి", అని అడిగాడు.
స్ట్రీట్ డాగ్ లా డౌట్ గా ఫేసు పెట్టాడు షాపు అబ్బాయి.
"డజను డజన్లు అంటే 12*12 = 144 పేపర్స్ రా సంగటి మొహమొడ", అన్నాడు.
మనసులోనే
పచ్చి బూతులు తిట్టుకుంటూ పేపర్స్ ని ప్యాక్ చేసాడు.
"అలాగే డజను డజన్ల బ్లూ ఇంకు పెన్నులు, ఇంకా డజను డజన్ల రైటింగ్ ప్యాడ్లు ఇవ్వు", ఆర్డర్ వేసాడు Mr. కే
మొత్తం సరంజామా ప్యాక్ చేసి ఇచ్చాడు షాపు అబ్బాయి.డబ్బులు ఇచ్చి ప్యాక్ ని బైక్ లో పెట్టుకున్నాడు.
"అవును సుమీ...డజను డజన్ల పేపర్లు, పెన్నులు Ok కానీ డజను డజన్ల ప్యాడ్లు ఎందుకు, అన్ని ఒకే ప్యాడ్ మీద రాయచ్చుగా", అనుకుని షాప్ వాడి దగ్గరకు వెళ్ళాడు.
"కోతి దగ్గర కొబ్బరి కాయ కొట్టేసే ఫెసును నువ్వూ ను...ఇంకోసారి డజను, అర డజను అంటే గొంతు కొరికి చంపేస్తా", అని అరవడం తో మన Mr. K జడుసుకుని, భయపడిపోయి, తడిసిపోయి ఇంటికి వచ్చేసాడు.
చేతిలో ప్యాడ్ వుంది, పేపర్ వుంది, పెన్ వుంది మరి స్టొరీ రాయడానికి స్ట్రాంగ్ పాయింట్ లేదు...అని అల్లోచిస్తూ T.V. ఆన్ చేసాడు. T.V. లో నాగార్జున మజ్ను మూవీ వస్తోంది. వెంటనే లోపల వున్నా కళా  బల్బు వెలిగింది.
సాదారణ నాగేశ్వర రావు ని నటసామ్రాట్ A N R ని చేసిన సినిమా ప్రేమనగర్.
సాదారణ
నాగార్జున ని  యువసామ్రాట్ నాగార్జున గా మార్చిన సినిమా  మజ్ను.
సాదారణ వెంకటేష్ ని విక్టరీ వెంకటేష్ ను చేసిన సినిమా ప్రేమ.

'
అంటే ఇలా అందరు స్టార్లు అయ్యింది ప్రేమ మీదనే. సో నేను కూడా స్టొరీ ప్రేమ మీద రాయాలిఅనుకున్నాడు. అనుకున్నాడే గాని ప్రేమ మీద మానవాడికి అస్సలు పట్టు లేదు. పార్క్ లలో ప్రేమికులు ఎకువగా ఉంటారని వినడం తో  చేతి లో పెన్ను చంకలో ప్యాడు పేపర్ లు పెట్టుకుని బయటకు నడిచాడు. కానీ పార్క్ ఎక్కడ వుందో మన Mr. K కి తెలియదు.
దారిన పోయే దానయ్య దగ్గరకు వెళ్లి "మేస్టారు మన చిత్తూరు లో పెద్ద పార్క్ ఎక్కడ వుంది", డౌట్ గా అడిగాడు.
"పిచుక గూట్లో పీచుమిటాయి వెతికే పింజారి వెధవ, నీళ్ళు, నీడా దొరకడం కష్టం గా వున్న చిత్తూరు లో నీకు పార్క్ కావాలా...పిచ్చినా పినుగా, అది కూడా పెద్ద పార్క్...ఆశకు కూడా హద్దు వుండాలి", అని వెళ్లి పోయాడా పెద్ద మనిషి.
అడ్రస్ చెప్పు అంటే అర్థంకాకుండా మాట్లాడుతున్నాడు అనుకుని, మే బి మెసానిక్ గ్రౌండ్స్ లో ప్రేమ పక్షులు దొరుకుతాయని అక్కడికి వెళ్ళాడు. మెసానిక్ గ్రౌండ్స్ మొత్తం తిరిగాడు ప్రేమికులు కాదు కదా పిచుకలు కూడా కనపడలేదు. వెళ్లి పోదాం అని బయలదేరబోతే దూరం గా చెట్టు పొదల్లో ఏదో కదులుతున్నట్టు కనిపించింది. దగ్గరికి వెళ్ళాడు పొదల్లో కదలిక కూడా ఎక్కు అయింది. మొదట కుక్క అనుకున్నాడు, తరువాత అడవి పంది అని confirm చేసుకున్నాడు. భయపడ్డాడు బలమైన రాయి తీసుకుని విసిరాడు. పొదల్లోంచి "అబ్భా....", అంటూ ఒక వ్యక్తి పైకి లేచాడు. పాపం రాయి బలం గా తగలడంతో నుదిటి మీద నుంచి రక్తం కారుతోంది. పళ్ళు పటపట కొరుకుతూ పరుగేతుకుని వచ్చి Mr. K ముక్కు మీద గుద్దాడు. ఇప్పుడు Mr. K ముక్కు లోంచి రక్తం కారడం స్టార్ట్ అయింది. పొదల్లోంచి అమ్మాయి కూడా లేచి వచ్చి Mr. K చెంప మీద కొట్టి ఇద్హరు వెళ్ళిపోయారు. మెసానిక్ గ్రౌండ్స్ మనకు అచ్చు వచినట్టు లేదు అనుకుని, బైపాస్ రోడ్డు దగ్గర కొత్త గా పెట్టిన కాఫీ డే లో కాస్ట్లీ ప్రేమ దొరుకుతుంది అని అక్కడకు వెళ్ళాడు. షాప్ లో మూలగా జంట ఒకే కోల్డ్ కాఫీ లో రెండు స్ట్రాలు వేసుకుని తాగుతున్నారు. అరగంట పాటు మన Mr. K వాల్లనే అబ్సేర్వ్ చేసాడు. ఇద్హరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. Third Umpire decession కోసం ఎదురు చూస్తున్న బ్యాట్స్ మెన్  లా అబ్బాయి అమ్మాయినే చూస్తున్నాడు, మాంసం ముక్క కోసం కుక్క ఆశగా ఎదురు చుస్తున్నటు అమ్మాయి అబ్బాయినే చూస్తోంది. అరగంట పాటు ఇద్దరు తాగినా, అర గ్లాసు కూడా కంప్లీట్ కాలేదు.
సహనం కోల్పోయిన Mr. కళంకిత్ వాళ్ళ దగ్గరకు వెళ్లి "కాఫ్ఫి డే లో కకృతి పన్లేంటి?, కావాలంటే నేను ఇంకో కాఫీ కొనిస్తా తాగి చావండి - ఎంగిలి ఆకులు కడిగి హాఫ్ రేట్ కి అమ్మే ఏబ్రాసి మొహల్లా వున్నారు" ,అన్నాడు ఆవేశంగా.

"ఒరేయ్...ఇలా వంగు", అన్నాడు అబ్బాయి.
బుద్ధి గా వంగాడు Mr. కళంకిత్. "ఊర పందిని ఈడ్చి తన్నితే ఏమవుతుంది?", అని అడిగాడు.
"దూరం గా వెళ్లి పడుతుంది", వినయం గా సమాధానం ఇచ్చాడు Mr. కళంకిత్.
"నేను నిన్ను అలాగే తన్ని, నువ్వు అలాగే దూరం గా పడేలోపు, ఇక్కడి నుంచి వెళ్ళిపో", అన్నాడు...సారీ వార్నింగ్ ఇచ్చాడు.
అంత మర్యాదగా చెప్పడం తో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు Mr. కళంకిత్.

ప్రేమ
కథలు రాయడం తన వాళ్ల చేత కాదు అనుకుని T.V  ఆన్ చేసాడు. అన్నాహజారే గారి  సత్యాగ్రహం, అవినీతి పై ఉద్యమం ఎక్కువగా వుండటం తో T.V లో Tagoor, Gentelman, Mallana, Kick లాంటి మూవీస్ వేసారు. టాగూర్ సినిమా క్లయిమాక్స్ లోని కోర్ట్ సీన్ చూస్తుంటే Mr. కళంకిత్ రక్తం సల సల కాగిపోయి ఒళ్ళంతా బొబ్బలు ఎగిరి పోయేటట్టు అయింది  ఇన్స్పిరేషన్ తో దొంగతనం చేసి లేని వాళ్ళకు ఇవ్వాలి అనుకున్నాడు. అదీకాక అరవై నాలుగు (64 ) కళ్ళలో చొర కళ కూడా ఒకటి. కాబట్టి ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనుకుని సేబాష్...అని వెన్ను తట్టుకున్నాడు.నాలుగు ఇంగ్లీష్ సినిమా లు చూసి అరవ డైరెక్టర్ తో అరవయ్ కోట్లు కర్చుపెట్టి సినిమా తీసే తెలుగు నిర్మాత లా కాదు మన Mr. కళంకిత్, ఏదయినా ప్రాక్టికాల్ చేస్తాడు. ఆవేశం చల్లారిపోకుండా రోజు రాత్రి కే ప్లాన్ చేసి మొదటి దొంగతనం ఘనం గా వుండాలని ఇన్స్పెక్టర్ ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నాడు. రాత్రి పన్నెండు గంటలకు అలారం పెట్టుకుని లేచి, ఒంటికి ఆముదం పూసుకుని నల్ల బట్టలు వేసుకుని చేతిలో టార్చ్ లైట్ చంకలో చాన్తాడుతో బయలుదేరి ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళాడు.
ఫింగెర్ ప్రింట్స్, పోస్ట్ మొర్టెం లాంటి కొత్త టెక్నాలజీ వచ్చేయడం తో పని లేక పోలీసులు లా పోలీసు కుక్కలు కూడా బోజ్జల్లు పెంచేసి హ్యాపీ గా బజ్జునాయి. మొదటి దొంగతనం కావడంతో తడబడుతూ వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు.
"తల నొప్పి కి విరోచనాల మాత్రలు వేసుకునే వింత జీవి లా వున్నావ్...దొంగతనానికి వచ్చి కాలింగ్ బెల్ కోడతవేంటిరా కొండ నాయాల...అన్నీ మూసుకుని నన్ను ఫాలో అవ్వు", అన్నాడు గజ దొంగగా గంగులు.
సీనియర్ దొంగను ఫాలో అయ్యాడు మన జూనియర్ దొంగ. తాడుతో వెనుక వైపు నుంచి మెడ మీదకు ఎక్కి...పొగగొట్టం లోంచి వంట రూము లోనికి తాడుతోనే దిగేసారు.
మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న సీనియర్ దొంగ చెయ్యి పొరపాటున గ్ళాస్సు కి తగిలి క్రింద పడింది. బెడ్ రూం లో లైట్ వెలిగింది, సీనియర్ కావడం తో పిల్లి లా అరిచాడు, బెడ్ రూం లో లైట్ ఆఫ్ అయింది.
సీనియర్ ని ఫాలో కాకా పోతే కోప్పడతాడని...ప్రక్కన వున్న బిందె ని తీసి ధబెల్ కింద పడేసాడు మన Mr. కళంకిత్ సారీ Mr. జూనియర్.
బెడ్ రూం లో లైట్ వెలిగింది. తనలోని కళను చూపించడానికి కర్రెక్టు టైం వచ్చింది అనుకుని మేమిక్రి స్టార్ట్ చేసాడు. మొదట పిల్లిలా అరిచాడు అక్కడితో లోపలవున్న కలాంతరాత్మ శాంతించలేదు పురి విప్పి నాట్యం చేయడం స్టార్ట్ చేసాడు. పిల్లి లా స్టార్ట్ చేసి, కుక్క లా, పంది లా, పాము లా, పులి లా మేమిక్రి  చేసాడు. ఇంకా ఎన్నో జంతువులను ఇమిటేట్ చెయ్యాలి అనుకున్నాడు, బెడ్ ర్రోం లోనే కాదు మొత్తం ఇల్లంతా లైట్లు వెలిగాయి. పరిస్థితి అర్థం చేసుకున్న సీనియర్ దొంగ గంగులు జంప్.
పాపం
రెడ్ హందెద్ గా బుక్ అయిపోయాడు మన జూనియర్ దొంగ. నిద్రను చెడ గోట్టడమే కాకుండా తన ఇంట్లోనే దొంగతనానికి వచ్చిన Mr. కళంకిత్ ని చూడగానే ఆవేశం తో ఊగిపోయాడు బయటకు ఈడ్చుకెళ్ళి కుల్ల బోదిచాడు. కానిస్టేబుల్ రాగానే వాళ్ళకు అప్పగించి తను నిద్ర లోకి వెళ్ళిపోయాడు. "రెడ్దోచ్చా మొదలెట్టు" అన్నటు సెకండ్ రౌండ్ కానిస్టేబుల్ స్టార్ట్ చేసారు. తెల్లవార్లు స్టేషన్ లో వేసుకుని చితగొట్టి ఇక కొట్టే ఓపిక లేక వదిలి పెట్టారు. పోలీసు దెబ్బలు కొత్త కావడం తో నెల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.

రెస్ట్
లో వుండటం తో ఇంట్లో T.V. చూసేవాడు. మన తెలుగు చానేల్ల మీద విరక్తి వచ్చి స్టార్ స్పోర్ట్స్ పెట్టాడు. ఇండియా Vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ వస్తోంది.
మొదటి టెస్ట్ మొదటి బంతి నుంచి ఆకరు టెస్ట్ ఆకరు బంతి వరకు సచిన్ 100th Century చేసి ఇండియా ని గెలిపిస్తాడు అనుకుని ఆశగా ఎదురు చూసాడు. సచిన్ Century చెయ్యలేదు ఇండియా గెలవలేదు మ్యాచ్ లో కాకపోయినా కనీసం Highlights లో అయిన ఇండియా గెలుస్తుంది అని ఆశ పడ్డాడు మ్యాచ్ లో కంటే ఫాస్ట్ గా Highlights  లో ఇండియా ఓడిపోయేది.
వెంటనే
తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది. అరవై నాలుగు (64 ) కళ్ళలో క్రీడా కళ వుందో లేదో తెలియదు, కానీ ఉండవచ్చు అనుకుని, పోయిన మన ఇండియా పరువు ని వెంటనే నిలబెట్టాలని చేతిలో బాలు చంకలో బ్యాట్టుతో బయలుదేరాడు. IPL కి opposite  గా PPL (కీక్... అని సౌండ్ రాలేధని ఆశ్చర్య పోకండి...ఇక్కడ సెన్సార్ అవసరం లేదు, PPL అంటే Premier లకే Premier League అన్నమాట) ని స్టార్ట్ చెయ్యాలి అనుకుని ఇంటి బయటకు వచ్చాడు.
ఇంతలో ఎదురుగా తెల్ల గెడ్డం తో వున్న నల్ల స్వామీజీ ఎదురుగా వచ్చారు.
స్వామిజి ని చూసి "ఏంటి స్వామి...ఇలా మా ఇంటికి వచ్చారు", అని ఆశ్చర్యం గా అడిగాడు.
"నేను చిత్తూరు పట్టనం లోని ప్రజలకు మేలు చేయ్యాలని సంకల్పించి ఇక్కడకు వచ్చి, అందరిని వాళ్ళ వాళ్ళ కష్టాలను చప్పమని అడిగాను. కానీ అందరికి ఒకే కష్టం...అదే నీ కళాభిమానం", అని అన్నాడు.

తెలుగు
exam  కి తమిల్ question పేపర్ ఇస్తే ఎలా తెల్లమొహం వేస్తారో అలా బ్లాంక్ ఫేసు పెట్టాడు మన Mr. కళంకిత్.
"చూడు నాయన...బ్యాట్టింగ్ లో తొంబై తొమ్మిది సెంచురీలు కొట్టిన సచిన్, తన నట విశ్వరూపాన్ని చూపిన కమల్ హసన్, ప్రజా సంతోషమే తన జీవిత పరమావధి గా పరితపించే షక్కీ...ఇలా చాలా మంది గొప్పవారని నువ్వు అనుకునుంటున్నావు...", అని కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు.
సెంటిమిటర్ సందిస్తే కిలోమీటర్ దూసుకుపోయే Mr. K వెంటనే "స్వామి, నాకు సచిన్ తెలుసు, కమల్ హసన్ తెలుసు కానీ ఎవరు స్వామి షక్కీ?", అని అడిగాడు .
ఎప్పుడూ సుందర వదనం తో వుండే స్వామిజి కి కోపం నషాళానికి ఎక్కింది మూడు కిలో గుంటూరు కారం ముక్కు లో వేసినట్టు ఊగిపోయారు "త్రాస్టుడ...!!! అక్షయ పాత్ర చేతిలో పెట్టుకుని అడుక్కు తినే భ్రస్టుడ...అని మొదలు పెట్టి...అరవై సంవస్తరాలుగా ఆపుకున్న అమ్మనా బూతులు( కీక్ కీక్  కీక్...@#$%^&*()_+|...అమ్మనా బూతులు కదా...ఎక్కువ సెన్సార్ సౌండ్ వస్తోంది) ఆపకుండా అరగంటపాటు తెలుగు లో మొదలెట్టి వయా సంస్కృతం, గ్రాంధికం లాంటి బాషలను టచ్ చేసాడు.అరగంట తరువాత కాస్త శాంతించి, ఆంద్ర దేశం లో పుట్టి, సమాజ సేవయే తన జీవిత పరమావధిగా బావించి, పర పురుషుల కోసం పెళ్లి ని కూడా త్యాగం చేసిన త్యాగశీలి. మన రాష్ట్రమే కాకుండా కేరళ, తమిళనాడు మొదలగు ప్రాంత ప్రజలకు వినోదం పంచిన షకీల నే షక్కి", అని తన ఉగ్ర రూపాన్ని శాంతింప చేసాడు.
స్వామిజి  ఆవేశం చూసి హడలిపోయాడు...తనలో ఇంకా చాలా డౌట్స్ వున్నా అమ్మనా బూతులుకు బయపడి అన్నిటిని అడగలేక మింగేసాడు.
చూడు నాయన...నేను పైన చెప్పిన ముగ్గురు సచిన్, కమల్ హసన్, షక్కి... అందరూ అనుకుంటున్నటు గొప్పవారు కాదు. కళ లను వ్యక్తం చేసేవాడు ఎప్పుడూ గోప్పవాడుకాలేడు. తన కళ ని తనలోనే అంచుకునే వాడె నిజమైన గొప్ప కళాకారుడు. వాడినే "సకలకళా వల్లభాన్" అంటారు. "సకలకళా వల్లభాన్" అంటే సకల కళలను వల వేసి పట్టుకుని బన్ను ని తినట్టు తిని అరిగించు కోవడం అన్నమాట", అని ఆపాడు.
Mr. కళంకిత్ కి స్వామి మాటలకు బాగా Inspire  అయ్యి "సకలకళా వల్లభాన్" బిరుదు కోసం తన కళలను మింగేసి, కలాంతరాత్మ ను సజీవ సమాధి చేసాడు.
                                                         ***************
ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు.
ఇట్లు మీ నేస్తం,విక్రం91 9916713090.మీ అముల్యమయిన సలహాలు, సూచనలు పంపవలిసిన చిరునామా amruthambyvicky@gmail.com vikrampreddi@gmail.com