Wednesday, November 16, 2011

కౌబోయ్ కామేష్ - 1

                                  కౌబాయ్ కామేష్
                                 ---------------------



             ఫ్రెండ్స్ ఇంతకముందు నా కాలేజీ ఫ్రెండ్ మిస్టర్. కళంకిత్ కథను మీకు చెప్పాను, వాడికున్న కళాభిమానాన్ని చూసి హాయ్ గా నవుకున్నారు. ఇప్పుడు నా చెడ్డీ దోస్త్ [ మా చిత్తూరు లో చిన్నపటి నుంచి అంటే చెడ్డీలు వేసినప్పటి నుంచి ఫ్రెండ్స్ గా వుంటే వారిని చెడ్డీ దోస్త్  అంటారు] "కౌబోయ్ కామేష్" ని మీకు పరిచయం చేస్తాను. ఏంటి పేరు వెరైటీ గా వుంది అనుకుంటున్నారా. పేరే కాదు మనిషి కూడా వెరైటీ నే. అసలు కాముడికి పేరు ఎలా వచిందంటే,
ఒకరోజు  మా కాముడు  వాళ్ళ ఇంటిలోని ఆవు పాలు పితకాలనుకున్నాడు. మొదటిసారి కావడం తో కాస్త తడబడ్డాడు, ఆవు తన ఎడమ కాళ్ళతో కాముడిని  తన్నింది, ప్రక్కన వున్న తాడు తో ఎడమ కాళ్ళను పోల్ కి కట్టాడు, తరువాత రెండో కాళ్ళతో బకెట్ ని తన్నింది, తిరిగి ఇంకో తాడు తో కుడి కాళ్ళ ని ఇంకో పోల్ కి కట్టాడు, తరువాత పితకడం మొదలెట్టాడు...ఈసారి తోక తో కొట్టింది, ప్రక్కన తాడు లేకపోవటం తో కోపం తో తన ప్యాంటు కి వున్న బెల్ట్ ని తీసి ఆవు  తోక పట్టుకుని కట్టడానికి ప్రయత్నిస్తుంటే వాడి ప్యాంటు ఊడిపోయింది...అదే టైం కి ప్రక్కింటి పద్మా, ఆవు వెనక వున్న కాముడిని చూసి అపార్థం చేసుకుని కేవ్వుని అరిచింది... అంతే రోజు నుంచి మా వాడు "కౌబోయ్ కామేష్" అయిపోయాడు
మా కాముడు    మధ్యనే  ఒక  కాలేజీ  నుండి  తన  బీ. టెక్ ( సివిల్ అండోయ్ !) పూర్తి  చేసుకుని   నా రేఫెరన్స్  ద్వార మా కంపెనీ లో జాబు సంపాదించాడు . అప్పటిదాకా ఏదో  సాదాసీదాగా, మామూల   మనిషిలాగా  గడిపేసిన  కాముడు    సఫ్ట్వేర్  కంపెనీలో  ఎలాటి  పరిస్థితులను  ఎదుర్కొంటాడు అన్నదే  ఈవేళ్టి  నా  కథాంశం.
మొదటి
రోజు కావడం తో వాడిని నేను  ఆఫీసు కి నా బైక్ లో  తీసుకుని వెళ్ళాను.  "అష్ట దరిద్రాన్ని ఇష్టం గా బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని వెళ్తున్నావ్ జగ్రత్హ సుమీ ... ", అని ఆకాశవాని గట్టి గా నవ్వింది. టైం కానీ టైం లో   నవ్వెంటో  అర్థం కాక, తొక్కలే నా గురించి కాదు...ఎవరో సుమీ గురించి అనుకుని నా I.D. కార్డు ని రిసెప్షన్ అమ్మాయికి చూపించాను. దాంతో అమ్మాయి నవ్వుతూ లోనికి వెళ్ళమని చెప్పింది. ఇంతలో నాకు ఫోన్ రావడం తో మాట్లాడుతూ ప్రక్కకు వెళ్లి పోయానే. మా కామేష్ నన్ను అనుసరించాడు. ఇంతలో రిసెప్షన్ అమ్మాయి కాముడు ని ఆపి,"Please show me your’s Sir”, అంది.
"మరాటి సెంటిమెంటు సినిమా చూస్తున్న తెలుగు ప్రేక్షకుడి లా తెల్ల ముకం వేసాడు.[ చెప్పడం మరచి పోయాను మా కాముడు కి ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు, మిగిలినది వుహించుకుంటాడు.] తనకు అర్థం అయిన పదాలను అర్థం చేసుకుని మిగిలిన దానికి తన ఊహలను జతచేర్చి "నేను చూపించను !!! ", అన్నాడు.
"Please show me your’s Sir...othewise I ll not send you Inside”, అంది కాస్త గట్టిగా. మా కాముడుకి వీరావేశం వచ్చింది, "నువ్వు అమ్మాయివి, నేను అబ్బాయి ని...నాది నీకు ఎలా చూపిస్తాను? నేను చూపించను...", అని గట్టి గా అరిచాడు. అరుపులకి నేను పరుగేత్హు కు వచ్చి విషయం అర్థం చేసుకుని వాడు నా ఫ్రెండ్  అని అమ్మాయి కి చెప్పడం తో టెంపరరీ  I.D. కార్డు  ఇచ్చింది.
"ఓహ్...తను అడిగింది ఎంట్రీ పాసా!!! నేను ఇంకా ఏదో చూపించ మంది అనుకున్నా ను ", అని చెప్పాడు.
"ఓర్నీ మిడత మెదదోడా...ఇంగ్లీష్ ని అర్థం చేసుకో, వుహించుకోకు", అని తిట్టి లోనికి తిసుకెల్లాను.
ఇంకా తన H.R. రాకపోవడం తో పద  మచ్చా , ఒక   కాఫీ  తాగుతూ  మాట్లాడుకుందాము ", అన్నాను. ఇద్దరం కలిసి  కెఫెటీరియాకి  వెళ్ళాము. అక్కడ   మా  మధ్యన  సంభాషణ:
కాముడు : ఏంటి , ఇది  మెస్సా ?
నేను : మెస్సు   లాంటిదే , కెఫిటీరియా  అంటారు.
కా : ఓహో... ఫుల్  మీల్స్   ఎంత, ప్లేట్   మీల్స్  ఎంత?
నేను : ( ఒక్క నిముషం  ఖంగు  తిని ) ఒరేయ్  బాబు, ఇక్కడ   మీల్స్   ఫ్రీరా, నువ్వెంతైనా   తినొచ్చు .
కా : ఆహా, మరి   పార్సెల్   కూడా  చేసుకోవచ్చ?
నేను : అక్వరియం లో చేపలు పట్టే అర మెంతలోడా... అది  కుదరదు, అని కాఫీ మెషిన్ లోంచి రెండు కాఫీ లు తీసి కాముడికి ఒకటి ఇచ్చి నేను ఒకటి తీసుకున్నాను.
ఇంతలో  H.R. అమ్మాయి  Richa Pallod  వచ్చి  "హాయ్ ఆనంద్", అని చెప్పి విష్ చేసింది  . నేను "హాయ్", అని చెప్పి, నా ప్రక్కనున్న కాముడుని పరిచయం చేస్తూ  "Meet my friend Kamesh...", అని  చెప్పాను .
"How are you doing Kamesh ?" అంది. కాముడు  ఒక  విచిత్రమైన  నవ్వు నవ్వి ఊరుకున్నాడు .
" I think you both are college friends !" , అని అడిగింది రిచా. ఇంతలో మా వాడు "Not  college friends ...me and Anand Chaddi dosth...", అన్నాడు నవ్వుతూ.
"What is mean by Chaddi Dosth ... Ananad ???", అంది రిచా.
"థాయిలాండ్ లో తాటి కళ్ళు అమ్మాలనుకునే తింగరి ముకం నువ్వూ  ను" అని వాడిని తిట్టుకుని ఏమి చెప్పాలో అర్థం కాక "In our place we used to call childhood frnds in short form as Chaddi dosth...", అన్నాను. ఏం అర్థం చేసుకుందో గాని ఆమెనవ్వేసి, " Do you have any account Kamesh ", అని అడిగింది.
" Yes, I have 2 accounts, one in my college canteen and other in my village kaka hotel ", అన్నాడు కలరేగారేస్తూ.
"నీ యబ్బా...పక్షవాతం  అంటే పక్షి కి వచ్చే వాతం అనుకునే పిచ్చి నా డ్యాష్ గా, అని బూతు గొంతులోకి వచ్చినా మింగేసాను.
" Good Humorous joke ", అంది రిచా. "Hmmm...cool guy, I ll take him to the bank guys", అన్నాను.
" Do you need any thing else Kamesh ?", అంది రిచా.
"Yes ... నీ జాతకం, రెండు ఫోటో లు, కులం, గోత్రం లాంటి డీటేల్స్  ఇస్తే...మా నాన్న కు చూపించి నిన్ను పెళ్లి చేసుకుంటాను", అని మనసులో వున్నా మరీ ఇంత మంది లో అడిగితే బాగోదని "నో...", అన్నటు తల ఊపాడు.
"See you around Kamesh,  Meet you some other time !!", అని వాడికి చెప్పి  "If you dont mind...can you please take him arround the office...",  అంది . "Yaa sure ", అన్నాను. అమ్మాయి వెళ్లి పొయింది.  ఉరి శిక్ష నుంచి తప్పించుకున్న  ఉగ్రవాది లా ఊపిరి పీల్చుకుని, హమ్మయ గండం గట్టేకింది అనుకుని మా కాముడి వైపుకి చూసాను.
అర్థ రూపాయి కే  అర కిలో  బంగారం  దొరికినట్టు  కాముడు  ఒక  తన్మయత్వం  నిండిన  ఎక్స్ప్రెషన్   పెట్టాడు. అది  గమనించిన  నేను, ఇలాగన్నాను.
నేను : హెల్లో  బాసు . ఏమిటి  సంగతి?
కా : అబ్బే , ఏమీ  లేదు.
నేను : ఏదో   ఉండే   ఉంటుంది , చెప్పులే!
కా :    అమ్మాయి   నాకు   పడిపోయింది రా .
నేను : ( ఇది  విని  పొలమారగా   తాగుతున్న  కాఫీ  మళ్ళి  కప్పులోకే  ఒంపేసి ) నీకా   ఫీలింగ్   ఎందుకు   వచ్చింది   బంగారం ?
కా : ఒరే  ఆనందు , నీకు  జీకే   తక్కువ  అనుకుంటాను. పట్ట పగలు, ఇంత మంది మధ్యలో  ఒక  అమ్మాయి  ఒక   అబ్బాయి ని  చూసి  పదే   పదే  నవ్వుతూంటే , షేక్   హ్యాండులు   ఇచ్చేస్తూ   ఉంటే , " మళ్ళీ   కలుద్దామని   పబ్లిక్   గా " చెప్తూ   ఉంటే   దాని   అర్థం   ఏమిటి ?
నేను :    అమ్మాయికి   ఆల్రెడీ   పెళ్ళయ్యి   ఉంటే , ఆమెకు   ఇద్దరు   పిల్లలు   ఉంటే , ఆమె   అందరినీ   అలాగే   పలకరిస్తుంటే   దానికర్థం   ఏమిటి ?
కా : ...?
నేను  : బాబు , ఇక్కడ   అమ్మాయిలు   దాదాపు   అందరూ   ఇలాగే   ఉంటూ   ఉంటారు . అలాగని   వాళ్ళందరూ   నిన్ను   ప్రేమిస్తున్నారు   అని   అనుకోకు . దెబ్బైపోతావు.
కా : హా ? హయ్యారే ? ఏమి      పరాభవము . మరి "Meet you some other time!"  అంది...నువ్వు ఉన్నవని సిగ్గు పడిందేమో లేక పోతే some other time!  కూడా చెప్పేదే", అన్నాడు.
నేను
: [ఆకలికి ఆవు పేడ లో  పంచదార కలుపుకుని తినే కంపు నాయాలా అని మనసులో అనుకుని ] అదేదో మాట వరసకి అన్నది రా బాలరాజు....
పాపం కాముడు బాగా దిస్సపాయింట్ అయిన్నటు ఫేసు పెట్టాడు.
కా :  అవును . నన్ను "see  you  arround ", అంది, అంటే నా చుట్టూ చూస్తుందా? ?
నేను:  వామ్మో , వాయ్యో . నీ  ఇంగ్లీష్  వొకాబులరీ మీద విరోచనాల తో వున్న  కాకి రెట్ట వెయ్య , నన్ను  ఒదిలెయ్యరా  బాబు. పద  నీకు  ఆఫీసు  చూపిస్తాను.
ఇద్దరూ   నడుచుకుంటూ   ఒక   గదిలోకి   వెళ్ళాము.
నేను: దీనినే   రిక్రియేషన్   రూం   అంటారు . ఇక్కడ   క్యారం బోర్డ్ , చెస్, టి. టి   లాంటి   గేమ్స్   ఆడుకోవచ్చు .
కా : బాగుంది . ఇంతకీ  ఇక్కడ  క్రికెట్  ఆడరా ?
నేను:  ఇక్కడ ఆడటానికి కుదరదు, కానీ బౌలింగ్ గేమ్ వుంది ఆడుదాం రా అన్నాను. వాడు  బౌలింగ్ బాల్ ని చూసి
కా: ఏంది రా ఇది...బాల్ ఇంత పెద్దది గా వుంది , దీంతో బౌలింగ్ చెయ్యడం కష్టం కదా !! అది కాక అటు అటు ప్రక్క బ్యాట్స్మేన్ కూడా లేదు", అని అడిగాడు.
నేను: ఓరి నా చంటి సినిమా లో వెంకటేశు...ఇక్కడ బౌలింగ్ అంటే క్రికెట్ లో బౌలింగ్ కాదు... పెద్ద బాల్ తో అటు ప్రక్క వున్న చిన్న చిన్న పోల్స్  ని పడగొట్టాలి, అన్నాను.
కా: బ్యాట్స్మేన్ లేనప్పుడు కడ్డీలను పడగోడితే కిక్కేముంది నా బొంద...నాకు గేము నచ్చ లేదు అన్నాడు.
పళ్ళు లేని పిచ్చి కుక్క కొరికితే ఆనంద పడాలో, బాధ పడాలో అర్థం కానట్టు వుంది నా పరిస్థితి.
అలాగే  నడుచుకుంటూ  వాళ్ళ మేనేజర్ రూం లో వాడిని వదిలి  మీ  మ్యానేజర్తో  మీటింగు అయ్యాక   కలుద్దాము అన్నాను.
--------------------------------------------------------------------------------------------------------
రెండవ బాగం కూడా చదివి ఆనందించండి.