Friday, July 13, 2012

అందమైన మనసులో...PART - 5



                              అందమైన మనసులో...
                                       [బోలెడంత ప్రేమ - కొంచెం కన్నీళ్ళు ]                                                                                                                                                                                                                                                   
                                                                                                                             PART - 5



“So… wats next ? నేను ఏమి చెయ్యాలి ఇప్పుడు ?", అని అడిగాను అమాయకం గా .
"ఇంకేముంది... అక్కీ కి నీ లవ్ ని ఎక్ష్ప్రెస్స్ చెయ్యాలి ", అన్నాడు.
"అక్కీ కి నేను లవ్ ని ఎక్ష్ప్రెస్స్ చెయ్యడం ఏంటి ?", అడిగాను ఆశ్చర్యం గా .
"బాలరాజు... నువ్వు అక్కీ ని  లవ్ చేస్తున్నపుడు, నువ్వే వెళ్లి ఎక్ష్ప్రెస్స్ చెయ్యాలి ".
"ఓహ్...అలా అంటావా !!! అయినా నేను అక్కీ కి ఎక్ష్ప్రెస్స్ చెయ్యను ",
"ఇదేం కర్మ రా బాబు... అక్కీ లవ్ చేస్తున్నపుడు అక్కీ కి చెప్పకుండా వాళ్ళ అమ్మకి ఎక్ష్ప్రెస్స్ చేస్తావా ఏంటి ? నువ్వు నీ యదవ డైలాగు", అన్నాడు సీరియస్ గా.
"ఏమో రా నాకు తెలియదు ... నాకు చాలా టెన్షన్ గా వుంది ",
" అమ్మాయిలను సెర్చ్ చెయ్యడం లో అబ్బాయిలు గూగుల్ కన్నా ఫాస్ట్ బట్ express చెయ్యడం లో IRCTC వెబ్ సైట్  కన్నా స్లో అంటే ఏమో అనుకున్నాను రా అది నిజమే అనిపిస్తోంది నాకు. అయినా నీకు  టెన్షన్ ఎందుకు మచ్చా ? ",
"అది కాదు రా...  నేను ఇప్పుడు ఎక్ష్ప్రెస్స్ చేసి తను ఒప్పుకోలేదంటే అప్పుడు పరిస్థితి ఏంటి ?", అడిగాను.
"అడిగావా.. ఇంకా అడగలేదేంటా అని వెయిట్ చేస్తున్నా... ప్రతి తెలుగు అబ్బాయి - సారీ ప్రేమికుడి  పరిస్థితి ఇంతే మామ... లవ్ చేస్తారు, ఎక్ష్ప్రెస్స్ చెయ్యడానికి వెనక అడుగు వేస్తారు. అదేంటి రా అంటే తను లవ్ చెయ్యక పోతే ఎలా రా అని డౌట్ . అయినా  అది నీ తప్పు కాదు రా... ఇండియన్ బ్లడ్ లోనే వుంది ఆ వెధవ డౌట్... ఛి ధీనెమ్మా  జీవితం ", అన్నాడు.
"అది కాదు రా... తను లవ్ చేస్తే ప్రపంచం లో నాకన్నా అదృష్టవంతుడు  ఇంకొకడు వుండదు, బట్.. బై ఛాన్స్  తను నన్ను ఒక మంచి ఫ్రెండ్ గానే చూస్తూ వుంటే, మా ఫ్రెండ్ షిప్ చెడిపోతుంది కదా రా ...  నేను నా ప్రేమను త్యాగం చెయ్యడానికి రెడీ గా వున్నాను , కానీ తన ఫ్రెండ్ షిప్ చెడి పోతే మాత్రం తట్టుకోలేను ", అన్నాను .
"అర్జున్... నువ్వు మరీ సిద్దార్థ - దిల్ రాజు సినిమా లో  లా డైలాగ్స్ కొట్టకురా... అలాంటివి  మూవీస్ లో బాగుంటాయ్.. బట్ ఇది రియల్ వరల్డ్... కాస్త బుర్ర పెట్టి ఆలోచించు, తను నీ బెస్ట్ ఫ్రెండ్ రా... నువ్వు ఎక్ష్ప్రెస్స్ చేస్తే తప్ప కుండా ఒప్పుకుంటుంది", అన్నాడు.
"అదే రా నా బాధ. అక్కీ నాకు మంచి ఫ్రెండ్. మా ఫ్రెండ్షిప్ చెడి పోకూడదని నా ప్రేమను యాక్సెప్ట్ చెయ్యకూడదు. తనకు నా పై రియల్ ఇంటరెస్ట్ వుండి యాక్సెప్ట్ చెయ్యాలి. నాకు తెలిసి చాలా ప్రేమలు మొహమాటం వల్లనో, పక్క వాడిని బాధ పెట్టకూడధనో ప్రేమలను యాక్సెప్ట్ చేస్తారు. సపోస్ నేను తనకు ఎక్ష్ప్రెస్స్ చేస్తాను, తను నన్ను కాకపోయినా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, అది నేనే ఐతే తప్పేంటి అని యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదు రా. ఒక వైపు మొదలై రెండో వైపు ఎండ్ అవ్వడానికి  ప్రేమ అనేది ట్రైన్ జర్నీ కాదురా. ఇద్దరి వైపు నుంచి వుండాలి, అలాంటి ప్రేమలే ఎండ్ వరకు కలసి ఉంటాయ్. నాకు అటువంటి ప్రేమ కావాలి, అంతే కానీ నా ఫ్రెండ్షిప్ చెడి పోతుందనో, లేక నేను బాధ పడతాననో తను యాక్సెప్ట్ చెయ్యకూడదు ", అని ఆగాను.
"అరె... నువ్వు  టూ ఫిలాసఫికల్  గా ఆలోచిస్తున్నావ్ రా, కం అవుట్ అఫ్ దట్ మైండ్ సెట్ రా. ప్రపంచం నువ్వు అనుకున్నంత స్లో గా నడవడం లేదు. నువ్వు ఇంకా "ఏరువాకా సాగాలో రన్నో చిన్నన్న... ", అన్న పాట దగ్గరే వున్నావ్, జులాయి ఆడియో కూడా మార్కెట్ లోకి వచ్చేసింది.  ఇప్పటి  జనరేషన్   అమ్మాయిలకు ఏమి కావాలో తెలుసు, ఏది పొందాలో తెలుసు. వాళ్ళకు నచ్చితేనే చేస్తారు, నచ్చకుంటే అస్సలు కాంప్రమైస్  కారు , అది డ్రెస్ కావచ్చు - జాబ్ కావచ్చు,  ప్రేమ కావచ్చు - పెళ్లి కావచ్చు. అది కన్న తల్లయిన, తండ్రయిన, ఫ్రెండ్ అయినా ఆకరకు భర్త అయినా కాని వాళ్ళ చాయిస్ ని వదులుకోరు ", అన్నాడు.
వాడు చెప్పింది కాస్త కరెక్ట్ అని నేను  ఆలోచించడం స్టార్ట్ చేశాను.
"అర్జున్, ఒక్కసారి పాసిటివ్ గా థింక్ చెయ్. అక్కీ కూడా నిన్ను లవ్ చేస్తుండవచ్చు గా, తను కూడా ఎక్ష్ప్రెస్స్ చెయ్యడానికి నీ లాగే మొహమాట పడుతుండవచ్చు గా. హానెస్ట్ గా చెప్పాలంటే రిలేషన్ షిప్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఆగి పోవలసిందే. అది ఫ్రెండ్షిప్ కావచ్చు మరేదయినా కావచ్చు. జీవితాంతం మీరు ఇద్దరూ ఇలాగె ఉంటారని చెప్పలేరు. కాబట్టి ముందు నువ్వు ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచించు, అంతే కాని దాని రిజల్ట్స్ గురించి థింక్ చెయ్యకు", అన్నాడు.
వాడు చెప్పింది నా బుర్రకి బాగా ఎక్కడం తో అక్కీ కి ఎక్ష్ప్రెస్స్ చెయ్యడానికి రెడీ అయ్యాను.
"ఆర్జూ... ఒక్కటి మాత్రం మరచిపోకు ... నువ్వు ఎక్ష్ప్రెస్స్ చేసే రోజు చాలా చాలా స్పెషల్ గా వుండాలి. అలా చూస్ చేసుకుని మరీ అడుగు ముందుకి వెయ్", అని వరుణ్ అక్కడి నుంచి వెళ్లి పోయాడు.
ఇక ఆ రోజుటి నుంచి సారి ఆ సెకండ్ నుంచి అక్కీ కి ఎలా ప్రపోస్ చెయ్యాలో అనే పని లో మునిగి పోయాను. ఎన్నో లవ్ స్టొరీ  మూవీస్ చూసాను ధైర్యం సరి పోలేదు, లవ్ నావెల్స్ చదివాను అడుగు ముందుకి పడలేదు, ప్రేమ జంటలని కలిసి వాళ్ళ వాళ్ళ అనుభవాలను తీసుకుని ఫైనెల్ గా  అక్కీ బర్త్ డే రోజు తనకు ప్రపోస్ చెయ్యడానికి రెడీ అయ్యాను.
చాలా సినిమా లో కవిత్వం తో హీరొయిన్ లను పడగొట్టడం నాకు నచ్చి నేను కూడా అలాగే అక్కీ ని ఫ్లాట్ చెయ్యాలి అనుకుని వరుణ్ గాడికి చెప్పను. వాడు వెన్ను తట్టాడు. కొండంత  ధైర్యం వచ్చింది. నాలుగు కవితలు రాసి వాటిలో బెస్ట్ కవిత ను సెలెక్ట్ చేసి మన వాడికి చూపించి అప్రూవల్ తీసుకుందామని వాడి దగ్గరకు వెళ్ళాను.
"మామ, నేను ఒక కవిత రాసాను రా... దానిని నువ్వు చూసి కరెక్ట్ చెయ్యాలి ", అని వాడికి నా చేతోలోని పేపర్  ని ఇవ్వ భోయాను.
ఇంతలో వాడు "మామ... నీ కోసం నేను కూడా రెండు కవితలను రాసాను, కావాలంటే వాడుకో ", అన్నాడు. వాడు లవ్ మ్యాటర్ లో  నాకంటే expert  కావడం తో, "ముందు నువ్వు రాసింది చదువు, నచ్చితే వాడుకుంటాను ", అన్నాను.
సరే అని వాడు  కవిత్వం చెప్పడం స్టార్ట్ చేసాడు.
"ప్రియా... !!! ",
"అరె ... నేను లవ్ చేస్తోంది ప్రియని కాదు, అక్కీ ని ", అన్నాను.
" సెకండ్ ఫ్లోర్ లో పెట్రోల్ బంక్ పెట్టి లాస్ అయిపోయిన  ఉల్ఫా నాయాలా ... ప్రియా ప్లేస్ లో అక్కీ ని పెట్టుకో, లేక పోతే వాళ్ళ బామ్మను పెట్టుకో... ఫ్లో  లో  ఫ్లాస్ వున్నా  పట్టించుకోకుండా  ఫాలో  అయిపో బె " అని కవిత్వం మొదలెట్టాడు 

ప్రియా !!
నేనూ మార్గదర్శి లో చేరి ఒక లవర్ ని కొనుక్కునే కెపాసిటీ నాకు లేదు అందుకే
ఓ ప్రియా! నా పై ద్వేషం అనే మురికి ని TIDE  సోప్ తో ఉతికి, అవాక్కయ్యే  లా  ప్రేమ అనే మెరుపు లాంటి తెల్ల ధనాన్ని తీసుకుని రా !!
Fair & Lovely లా అయిదు వారాల అందమయిన ప్రేమ కంటే Fairever  లా సాధించనిది ఏది లేదని నిరూపించి L.I.C జీవన్ ఆనంద్ పాలసి లా జీవితాంతం తోడుంటావని ఆసిస్తూ... నీ ప్రేమ  దాసు.
"ఎలా వుంది మచ్చా ఈ కవిత ??", అని అడిగాడు.
"దరిద్రుడా... ఆమ్వే [Amway]  వాడు, వాడి ప్రాడక్ట్స్  మార్కెటింగ్ కోసం లెటర్ రాసినట్టు వుంది. అయినా దీన్ని కవిత్వం అనరు - కపిత్వం అంటారు ", అని అన్నాను.
"ఓహ్ .. నా కవిత ఆ రేంజ్ లో వుందా !!! అయితే నేను మరో కవిత రాసాను అది నీకు వినిపిస్తా... కానీ ఒక షరతు... ఇది కొంచం సెంటిమెంట్ తో రాసాను... నువ్వు కన్నీరు పెట్ట కూడదు ", అన్నాడు .
వాడి కాన్ఫిడెన్సు చూసి నాకు కాస్త ముచ్చటేసి "బాగుంటే నేను కన్నీరు పెట్టను, బట్ బాగా లేదనుకో నువ్వు కన్నీరు పెట్టాల్సి వస్తుంది ", అని చెప్పాను.
ఐతే కాస్కో అంటూ మొదలెట్టాడు...

" ప్రియా...
నేను కళ్ళు లేని కబోధిని కాను !
కాళ్ళు లేని కుంటి వాడినీ కాను !!
మాట మాట్లాడలేని మూగ వాడిని  కాను !
పాట వినిపించని చెవిటి వాడినీ కాను !!
ఉప్పు తినలేని  B.P. పేషంట్ ని కాను !  
తీపి పదార్థాలు తినలేని షుగరు పేషంట్ ని కాను !!
ఓ ప్రియ... ఈ మనసున్న మారాజు ని ఎలుకోవా... ప్రేమ పిచ్చి వాడి పై జాలి చూపవా !!
అని ఆపాడు.

పిసాచాలతో పరాచికాలు ఆడటం అంటే ఇదేనేమో అని మనసులో అనుకుని "నీ యబ్బా.. హాస్పిటల్ కి వెళ్ళ లేని పేషంట్, డాక్టర్ కి లెటర్ రాసినట్టు  వుంది ... ఇక నీ కవితలు వద్దు నీ  పిండాకూడు వద్దు నా భాధ లు నేను పడతాను", అన్నాను. వాడి కవితా జ్ఞానం నాకు అర్థం అయిపోయి, ఇక నా కవిత్వం వాడికి చెప్పినా వెస్ట్ అని అక్కడ నుంచి వెళ్ళిపోయాను.

అక్కీ బర్త్ డే రానే వచ్చింది. ఆ రోజు బాగా ప్రిపేర్ అయ్యాను. Saturday  అక్కీ బర్త్ డే కావడం తో Friday నైట్  తనకు ఫోన్ చేసి "అక్కీ...రేపు మార్నింగ్  5.00 AM  కి రెడీ గా ఉండు, నేను మీ P.G. కి వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను, భయటకు వెళ్దాం", అని చెప్పాను.
"హలో హలో... కాస్త ఆగు బాబు... ప్లాన్ ఏంటి ? ఎక్కడకు వెళ్తున్నాం ? అయినా మరీ 5.00 AM అంటే చాలా కష్టం, అదీ వీక్ ఎండ్", అని ఏదో చెబుతోంది.
"Nothing doing... I ll call there at sharp 5’o clock  in the morning... be ready... Gud Night, have a sweet sleep... Bye ", అని ఫోన్ డిస్కనెక్ట్  చేశాను . మరుసటి రోజు తొందరగా మేల్కొని, బాగా తయారయ్యి, నేను రాసిన కవిత ను తీసి జేబులో పెట్టుకుని కరెక్టు గా 4.45 కి మా రూం లో స్టార్ట్ అయ్యి వాళ్ళ  P.G. దగ్గరకు వెళ్ళాను. తను ఆల్రెడీ భయట వెయిట్ చేస్తోంది.
"హాయ్... గుడ్ మార్నింగ్ అక్కీ", అన్నాను.
"హే... పిచ్చి పట్టిందా నీకు. ఇంత పొద్దున్న ట్రిప్ ఏంటి ", అని తల మీద కొట్టింది.
"Surprise అంటే ఇలాగె వుంటుంది మేడం... నువ్వు జస్ట్ నా బైక్ మీద కూర్చో నీ లైఫ్ లో ఎప్పుడు చూడని ప్లేస్ కి నిన్ను తీసుకుని వెళ్తాను", అన్నాను. లోపల ఇష్టం వున్నా కానీ ఏదో ఇంటరెస్ట్ లేకుండా వస్తున్నట్టు బైక్ మీద కూర్చుంది . బైక్ ని హేబ్బాల్ మీదు గా నంది హిల్స్ కి పోనిచ్చాను. నంది హిల్స్ బెంగుళూరు కి దగ్గర లో వున్న హిల్ స్టేషన్. సుమారు 4500 అడుగుల ఎత్తు లో వుంటుంది . బెంగుళూరు కి దగ్గర లో వున్న చాలా అందమయిన ప్రదేశం. మనం మేఘాల కన్నా ఎత్తులో , ఆకాశం కింద వున్నట్టు అనిపిస్తుంది. నేను ఇప్పుడు అక్కీ ని  అక్కడికే తీసుకుని వెళ్తున్నాను. ప్రొద్దున అయిదు గంటలే కావడం తో క్లైమేట్ చాలా చల్ల గా వుంది, దానికి తోడు సన్నగా పడుతున్న వర్షపు జల్లులతో  క్లైమేట్ చాలా సూపర్ గా వుంది.  ట్రాఫ్ఫిక్ కూడా లేకపోవడం తో నేను వంద కిలో మీటర్ల ఫాస్ట్ తో దూసుకుని వెళ్ళాను. అర గంటలో నంది హిల్స్ రీచ్ అయిపోయాం. చుట్టూ ప్రక్కల పెద్దగా జనాలు కూడా లేరు. బైక్ ని పార్క్ చేశాను. అక్కీ కాస్త కోపం గా ప్రక్కన నిల్చుంది.
"అక్కీ... నువ్వు కాసేపు కళ్ళు మూసుకో, నీకో సర్ ప్రైస్ చూపిస్తాను ", అన్నాను.
అక్కీ కాస్త చిరాకు పడుతూ "అసలే నాకు చిరాకు గా వుంది నువ్వు తొక్కలో కళ్ళు మూసుకో, నిద్ర పో లాంటి వి చెప్పకు", అంది.
“Just close UR eyes for a while dear & fallow my guidelines”, అని బలవంతం గా నా చేతులతో తన కళ్ళను క్లోజ్ చేసి ఆల్రెడీ నేను ప్లాన్ చేసిన ప్లేస్ కి తనను తీసుకెల్లాను. ఆల్రెడీ నేను మా ఫ్రెండ్స్ ద్వారా అక్కడ సెట్ అప్  మొత్తం చేఇంచేసాను. తరువాత నేను నా చేతులను తీస్తూ " అక్కీ ప్లీజ్... కాసేపు కళ్ళు తెరవకు", అన్నాను . చిరకుగానే ఫేస్ పెట్టి కళ్ళు ఓపెన్ చెయ్యలేదు. నేను తీసుకుని వచ్చిన బర్త్ డే కేక్ ని ఓపెన్ చేసి కేండల్స్ ని పెట్టి వెలిగించాను, తరువాత తనను కేక్ కి ఆపొసిట్ గా తీసుకుని వెళ్లి " ఇప్పుడు కళ్ళు తెరువు అక్కీ ", అన్నాను.
తను మెల్లగా కళ్ళు తెరిచింది... నేను చేసిన సెటప్ కి దిమ్మతిరిగి పోయింది... చుట్టు ప్రక్కల మొత్తం తెల్లటి మబ్బులు, అది వర్షమా లేక మంచా అన్నట్టు పడుతున్న తొలకరి జల్లు, అయిష్టం గా కళ్ళు తెరుస్తున్న చిన్న పిల్లాడి లా అప్పుడే పై కి వస్తున్న సూర్యుడు, పొగలు కక్కుతున్న బ్రూ కాఫీ  లా మేఘాల మా కింద నుంచి వెళ్తుంటే ఆ క్లైమేట్ కి, అంత అందమయిన లొకేషన్  కి  అక్కీ ఫ్లాట్ అయిపోయింది.
“Woooooowwww... what an environment, what a location. Really it’s amazing Arju ”, అని చిన్న పిల్లలా గెంతుతూ పరుగెడుతోంది, అస్సలు అంత ఆనందం గా, అంత అల్లరి గా వున్న అక్కీ ని ఫస్ట్ టైం చూసాను. మాములుగానే తను చాలా అందం గా వుంటుంది, ఇంకా ఇంత ఆనందం తన మొహం లో కనిపించడం తో తన అందం డబుల్ అయింది. ఉదయిస్తున్న సూర్యుడు కూడా తన అందం ముందు బలాదూర్ అన్నట్టు వుంది.
"జన్మదిన శుభాకాంక్షలు అక్కీ... & I wish you a Very Very & very Happy returns of the day. May God bless you with more happiness my dear sweet devil”, అన్నాను షేక్ హ్యాండ్ ఇస్తూ.
“Thanks, thanks & thanks a lot dear”, అంది నా చేతిని ముద్దుపెట్టుకుని.
తను కేక్ ని కట్ చేసి చిన్నముక్క నా నోట్లో పెట్టింది , నేను కాస్త పెద్ద ముక్కే తీసుకుని తన మొహానికి పేస్టు లా అంటించాను, అలా ఒకరికి ఒకరు రాసుకుంటూ, పుసుకుంటూ , తోసుకుంటూ గొడవలు పడి కాసేపటికి అలసిపోయి, ఒక రాతి మీద కూర్చున్నాం. తను టిష్యు పేపర్ తో మొహం  తుడుచు కుంటూ  వుండగా నేను నా బ్యాగ్ లోంచి  పెద్ద ప్యాకెట్ తీసి తనకు ఇచ్చాను . తను ఆశ్చర్యం గా చూస్తూ "ఏంటిది ??? ", అని అడిగింది .
"ఓపెన్ చేస్తే  తెలుస్తుంది ", అన్నాను. తను ఓపెన్ చేసింది... లోపల బాపు గారి బొమ్మల బుక్ వుంది.
“wow... కేక అర్జు నువ్వు...చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు . Paintings లో బాపు గారికి నేను ఏకలవ్య శిష్యురాలీని... చాలా షాప్స్ లో ట్రై చేశా... కాని  నాకు దొరకలేదు. నిజం గా నాకు బాగా నచ్చింది ",  చిరునవ్వుతో అని  "అయినా నాకు  ఇవి నచ్చుతాయని నీకు ఎలా తెలుసు ?", అడిగింది .
"ఏంటా  పిచ్చి ప్రశ్న !!! నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి, నీకు  ఏది ఇష్టమో, ని టేస్ట్ ఏంటో కూడా తెలుసుకోలేనా", అన్నాను.
"యాక్చువల్ గా నిన్ను బాగా తిట్టుకున్నాను ఆర్జూ... ఈ ఇయర్  నేను  ఫస్ట్ బర్త్ డే విషెస్ నీ దగ్గరే  వినాలని, వేరే ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు, నైట్  అంతా నీ కాల్ కోసం వెయిట్ చేశాను,  బట్ నువ్వు కాల్ చెయ్యలేదు. మార్నింగ్ నేను కనిపించినప్పుడు కూడా కనీసం  విష్ చెయ్యలేదు. అందుకే కోపం గా బైక్ ఎక్కాను. సారీ డా ", అంది కాస్త భాద పడుతూ
" నీ మొహం లో ట్రు హ్యపినేస్స్  చూడాలని,  ఈ బర్త్ డే నీకు మోస్ట్ మెమరబుల్ గా, లైఫ్ లాంగ్ గుర్తు  వుండాలని చాలా కష్టపడి ప్లాన్ చేశా ", అక్కీ అన్నాను.
“I am soooooo impressed Mr. Arjun ", అని కాస్త వంగి నాకు సలాం చేసి, మళ్లీ పైకి లేచి నిలబడి  "ఈ Princess నీకు వరం ఇవ్వడానికి రెడీ  గా వుంది... ఏదయినా కోరుకో", అని నా తల మీద కర్ర పెట్టింది.
"Sure my dear beautiful Angel ", అని... ఇదే సరయిన టైం అనిపించి జేబులో చెయ్యి పెట్టాను నేను రాసిన కవిత చదివి తనను ఇంప్రెస్స్ చేద్దాం అని, పేపర్ కనిపించ లేదు.
"మళ్లీ stress  చేసి చేసి చెబుతున్నాను... నేను ఫుల్ ఖుషీ  గా  వున్నాను... ఇదే నీకు సరయిన టైం, బాగా అలోచించి అడుగు ", అని కొంటెగా నవ్వింది . నేను నా జేబులు తడుముకుంటున్నాను. తను కాసేపు వెయిట్ చేసి బాపు గారి బొమ్మలు చూడటం స్టార్ట్ చేసింది. నాకు పేపర్ దొరకక పోవడం తో నోటికి వచ్చిన కవిత్వం చెప్పాలని "అక్కీ", అన్నాను. తను అస్సలు పట్టించు కోలేదు. ఇంకోసారి గట్టిగా "అక్కీ", అని  అరిచాను, అయినా నో రెస్పాన్స్. అప్పుడు అర్థం అయ్యింది, అస్సలు ఆ పిలుపు నా నోటి నుంచి భయటకు కూడా రాలేదని, ఛి ధీనెమ్మ బతుకు  అని నన్ను నేను తిట్టుకుని, గొంతు సవరించుకుని  ధర్యం చేసి "అక్కీ ", అన్నాను. నా పిలుపుకి రెస్పాన్స్ గా "చెప్పు", అంది తల బుక్ లోంచి  పైకి కూడా ఎత్త కుండా. ఈ సరి ఇంకాస్త ధైర్యం గా "అక్కీ", అన్నాను గట్టిగా . నా పిలుపుకి అక్కీ బుక్ ని క్లోస్ చేసి నా వైపుకు తిరిగి "ఏంటి అర్జు ", అంది.
"అది కాదు... నేను...", అని ఆగాను.
"చెప్పు బంగారం... ఏంటి మేటర్, నా దగ్గర ఎదవ మొహమాటం ఏంటి నీకు ", అని నా తల మీద చేయి పెట్టి జుట్టు ని చేరుపుతూ .
"అది... నాకు...", అని ఆగాను తరువాత మాట కూడా రాలేదు, అంత చలి లో కూడా నాకు చెమటలు పట్టేసింది.
"నీకే... ఏమి కావాలి ??? ", కాస్త గట్టిగా అడిగింది. తను నా కళ్ళలోకి చూడటం తో తడబడి పోయి "అది నాకు... నాకు ఒక పదివేలు అప్పు వుంటే  ఇస్తావా ???", అన్నాను .
తను బాగా దిస్సప్పాయింట్ గా ఫేస్ పెట్టి  "ఓరి దరిద్రుడా ! ఇంత హుంగామా చేసి నన్ను ఇంప్రెస్స్ చేసింది పది వేల కోసమా... నేను ఇంకా ఏదో అని ఫీల్ అయిపోయాను", అంది కోపంగా.
నేను కాస్త ఇబ్బంది గా నవ్వాను.  ఆ టైం లో నాపై నాకే అసహ్యం వేసి ఆకాశం వైపుకు  చూసి ఉమ్మేసుకోవాలి  అనిపించింది . సరే ఇవ్వాళ టైం బాగాలేదు అని సరిపెట్టుకున్నాను. తరువాత  అక్కడే  కొంత  టైం స్పెండ్ చేసి బెంగుళూరు కి రిటర్న్ అయ్యాము. దారిలో కనిపించిన ప్రతి మంచి లొకేషన్ దగ్గర నిలిపి ఇద్దరం ఫొటోస్ తీసుకున్నాం. వచ్చే దారిలో బెంగుళూరు ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసాం . ఆల్మోస్ట్ డే అంతా  బైక్ మీదే ఎలా పడితే అలా తిరిగి అలసి పోయి నైట్ రూం కి ని రిటర్న్ అయ్యాం. తనను P.G. దగ్గర డ్రాప్ చేశాను.
తను బైక్ దిగి "అర్జు... నిజం గా ఈ రోజుని నేను ఎప్పటికి మరచి పోలేను. నా బర్త్ డే ని చాలా బాగా  నాకు ప్రెసెంట్ చేసావ్. హానెస్ట్ గా చెబుతున్నా I am the most luckiest person in the world by having a great friend like you”, అని కాస్త ఎమోషన్ గా మాట్లాడింది, దాంతో తనకు తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్ళు  తిరిగాయి.
నేను వెంటనే బైక్ ని పక్కన పార్క్ చేసి  "హే ఏంటిది చిన్న పిల్లలా  ఏడుస్తున్నావ్... ఊరుకో", అని కన్నీళ్లను తుడిచాను .
"హీరో... ఇది కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు...", అని చెప్పి నవ్వడానికి ట్రై చేసింది, కాని కన్నీరు మాత్రం ఆగలేదు. ఆ క్షణం లో, ఏడుస్తున్న అక్కీ మొహం చూసి  నేను కూడా కాస్త ఎమోషన్ అయ్యాను. తనను చెట్టు ప్రక్కనున్న బెంచ్ మీద కూర్చో బెట్టి వెంటనే వెళ్లి ఒక "5 Star " ని తీసుకుని వచ్చి తనకు ఎదురుగా మోకాళ్ళ  మీద కూర్చుని " మా అందాల ఏంజిల్  కు ఇష్టమయిన గిఫ్ట్ ", అని ఇచ్చాను. తను నవ్వుతూ  తీసుకుని "నన్ను బాగా స్టడీ చేసినట్టు వున్నావు, నన్ను ఎలా కూల్ చెయ్యాలో నీకు బాగా తెలిసిపోయింది ", అని కాస్త నవ్వింది. తను నవ్వడం తో నేను కాస్త రిలాక్స్ అయ్యి "అవును అక్కి ఎందుకు అంత ఎమోషన్  అయ్యావు ?", అని అడిగాను లేచి తన ప్రక్కన కూర్చుంటూ.
" నేను నా లైఫ్ లో ఇంత క్లోస్ గా ఎవరితో లేను అర్జు , అసలు ఒకరు నాకు ఇంత క్లోస్ అవుతారు, అది కూడా ఒక అబ్బాయి అవుతాడు అని నేను అస్సలు expect చయ్యలేదు. నిజం గా నాకు ఈ రోజంతా ఒక కల లాగా వుంది.  నా లైఫ్ లో ఇటువంటి ఒక రోజు వస్తుందని అస్సలు ఉహించను  కూడా లేదు అర్జు, ఇటువంతివంటివన్నీ  సినిమా  లో  లేక నావెల్స్ లో మాత్రమే చూసాను, కానీ ఈరోజు నాకు రియల్ గా చూపించావు.  నా జీవితానికి సరిపడేంత హ్యపినేస్స్ ని ఒక్కరోజు లోనే చుపించావ్, ఇది చాలు అర్జు నాకు ", అని ఆగి... "అయినా నువ్వు అప్పుడే రూం కి వెళ్ళాలా ?? నాతో ఇంకొంత టైం  స్పెండ్ చెయ్యవా ప్లీస్ ", అంది చాలా క్యుట్ గా మొహం పెట్టి.
నువ్వు అంత అందం గా అడగలే కాని, కొంత సేపేంటి నా లైఫ్ అంతా నీతో టే వుండి  పోతా అక్కీ అన్న మాటలు నా గొంతు లోనే ఆగిపోయి  “Sure daa “, అన్నాను.
"Hmmm Gud Boy ", అని నా తలనిమిరి,  "చాక్లెట్ తిను అర్జు ", అని నాకు చాక్లెట్ ఇచ్చి "అయినా నువ్వు తినవు లే ", అని టక్కున నోట్లో వేసుకుంది. "ఓసి పాపిష్టి దానా, అంత మాత్రం దానికి ఎందుకడిగావ్ !!!", అని తన నోట్లో వున్న చాకొలేట్ ని లాగి మరీ నేను నోట్లో వేసుకున్నాను. అలా రోడ్ మీద కొట్టుకుంటూ నడవడం స్టార్ట్ చేసాం. ప్రక్కనున్న పానీ పూరి బండి దగ్గరికి వెళ్లి "భైయ్య ఒక పావ్ బజ్జి ఇవ్వండి ", అని అక్కీ ఆర్డర్ చేసింది.
"పావు బజ్జి  నే ఎందుకు !!! ఫుల్ గా తీసుకోవచ్చు గా ", అన్నాను.
" నువ్వు ని  వెధవ జోకులు... Its PAV – BAJJI  boss & not Pavu or ara Bajji ", అంది కోపం గా . అలా 5 Star తో స్టార్ట్ చేసి పావ్ బజ్జి , కారం మరమరాలు, మ్యాంగో ఐస్, చిక్కీ, మసాలా చాయ్ ఇలా ఏది కనపడినా వదలకుండా తిన్నాం. అలా ఎంత సేపు మాట్లాడుకున్నమో తెలియదు . టైం  చూసాను కారేక్టుగా 11.59 PM కావడం తో “Many Happy returns of the day once again my dear Princess", అని మరొక సారి విష్ చేసాను.
"సూపర్ అర్జు నువ్వు... నా బర్త్ డే రోజున  ఫస్ట్ & లాస్ట్ విష్ చేసింది నువ్వే ", అంది ఆనందం గా .
"సరే అర్జు...  ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. Thanks once again for the most memorable Day in my life ", అంది చిరునవ్వుతో. వెళ్ళమని నోరు చెబుతోంది కానీ కళ్ళు మాత్రం ఇంకా కాసేపు ఉండవా ప్లీస్ అన్నట్టు చూస్తోంది. కానీ బాగా లేట్ నైట్ అక్కడ స్పెండ్ చెయ్యడం బాగోదు అని నేను అక్కడ నుంచి భారం  గా కదిలాను .  నేను కనిపించినంత సేపు తను చేతులు ఉపుతునే వుంది, నేను కూడా ఆల్మోస్ట్ వెనక్కు  తిరిగే నా బైక్ ని నడిపాను.
ఇంతలో...

అప్పుడే అయిపోలేదు... ఇంకా చాలా కథ వుంది ... Stay Tuned

Sunday, July 1, 2012

అందమైన మనసులో... PART - 4



                                                  అందమైన మనసులో...
                                       [బోలెడంత ప్రేమ - కొంచెం కన్నీళ్ళు ]
                                                                                                                                                                                                                                                   
                                                                                                                             PART - 4
  
బస్సు చాలా ఫాస్ట్ గా గుద్దడం తో కరెంటు పోల్ వెరిగి బస్సు మీద పడిపోయింది, ముందు డోర్ లోంచి, విండోస్ లోంచి కరెంట్ వైర్లు లోపలకి వచ్చేశాయి. అస్సలు ఏం జరిగిందో తెలుసుకునే లోపు... కరెంటు వైర్లు బస్సు లోపల పడిపోయాయి. లక్కీ  గా అందరూ "Dumb Charades " ఆడటానికి  వెనుకకు రావడం తో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది.  అందరూ గట్టిగా అరుస్తున్నారు. అందరి మైండ్స్  బ్లాక్ అయిపోయాయి. ఇంతలో నేను తేరుకుని “Guys... please stand at your places for a while and don’t move”, అని అరిచాను. కొంత మంది నా మాటకు రెస్పాన్స్ గా కదలకుండా ఉండిపోయారు, కొందరు ఇంకా అరుస్తున్నారు, కొలీగ్ ప్రశాంత్ కిటికీ లోంచి భయటకు దూకడానికి ట్రై చేసాడు. వెంటనే నేను వాడి షర్టు పట్టి  వెనక్కు లాగి బలం గా చెంప మీద ఒకటి ఇచ్చాను. దాంతో అందరూ సైలెంట్ గా అయిపోయారు.
“Frnds... I am an Electronics student... As per my knowledge Rubber i.e. Bus tires are insulators. So current ll not pass into the bus unless we behave as an earth . So no need to panic at this moment .”, అని ఒక సెకను ఆగి,
“So, Gals please stay at your places n guys just break the backside glasses. So that we can freely jump out”, అని నేను చెప్పాను. వెంటనే అమ్మాయిలు ఒక పక్కకు వచ్చారు, బలంగా  వున్న అబ్బాయిలు, చేతికి దొరికిన వస్తువుల తో వెనుక అద్దం బద్దలు కొట్టారు. ఒక మనిషి ఫ్రీ గా జుంప్ చెయ్యగలిగేటంత హోల్ పెట్టారు.
“First we ll make gals to jump outside. And please remember don’t touch the bus at any cost after jumping. If you touch the bus... then you ll become earth and every one’s life ll become risk. So please keep it in mind & jump at least 5 feet’s frwd”, అని చెప్పాను. మొదట అమ్మాయిలు ఒక్కొక్కరిగా  కిందకు దూకుతున్నారు. అందరిలోనూ టెన్షన్... బట్ గాళ్స్ అందరూ క్షేమంగా భయట పడటం తో తప్పించుకోవచ్చు లే అన్న కాన్ఫిడెంట్ వచ్చింది. తరువాత అబ్బాయిలు కూడా ఒక్కొక్కరిగా జంప్  చేసారు. అందరూ క్షేమంగా భయట పడిపోయారు అని అందరు హ్యాపీ గా ఫీల్ అయ్యారు. ఇంతలో నేను ప్రశాంత్ ని చూసి, “Sorry dude, I think I had hit you hardly. So sorry for that, I was fully tempered at that moment”, అన్నాను షేక్ హ్యాండ్ ఇస్తూ... పాపం తను చాలా గిల్టీ గా ఫీల్ అయ్యి “Hey man, it’s my mistake... Regret me for doing that”,  అని కౌగిలించుకున్నాడు. వెంటనే థామస్ గారు ముందుకు వచ్చి “You did a very very great job Arjun... really I felt no word to appreciate you. It’s a very panic situation and you acted very smartly and solved with no loss. Really you are great”, అన్నారు భయం తో కూడిన నవ్వు ముకంతో.
నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక జస్ట్ నవ్వాను.
“A Leader is not guy who sails the ship in plain water, but the true leadership qualities will come out only at hard conditions. You are the true leader... you are the true punter”, అని గట్టిగా కౌగిలించుకున్నాడు. అందరూ తప్పట్లు కొట్టారు . అందరూ వాళ్ళ ఫోన్స్ తీసుకుని ఫ్రెండ్స్ కి అందరికి ఫోన్ చేసి, లైవ్  కామెంటరీ ఇవ్వడం స్టార్ట్ చేసారు. మా మేనేజర్ కంపెనీ కి కాల్ చేసి situation ఎక్ష్ప్లైన్ చేసి, మేము వెళ్ళడానికి మరో నాలుగు క్యాబ్స్ పంపించమన్నారు .
ఇంతలో సునీత గారు వచ్చి " వరుణ్, అసలు 'నువ్వు మనిషి వా లేక మోహన్ బాబు వా !!!.' అలా డ్రైవర్ ని ముందు చూసి నడుపు లేదా యాక్సిడెంట్  అవుతుంది అన్నావు, యాక్సిడెంట్ అయిపోయింది", అన్నది. దాంతో అందరు వాడిని అదోలా చూసారు. డ్రైవర్ అన్న పధం వినగానే నాకు షాక్ కొట్టినట్టు అయింది . యాక్సిడెంట్ అయినప్పటి నుంచి డ్రైవర్ బస్సు లోనే వున్నాడు. వెంటనే అందరు బస్సు దగ్గరకు పరుగెత్తారు. డ్రైవర్ సృహ తప్పి స్టీరింగ్ మీద పడి వున్నాడు . వెంటనే దగ్గరున్న, ట్రాన్స్ఫొర్మెర్  ఎక్కి ఫ్యుస్ తీసేసాను. కరెంటు బస్సు లోకి పాస్ కాదు అని తెలిసినా ధైర్యం చేసి బస్సు ఎక్క లేక దూరం గా ఉండిపోయాం. ఇంతలో ఫైర్ ఇంజెన్ రావడం తో వాళ్ళు చాలా  చాకచక్యం గా వైర్లు కట్ చేసి డ్రైవర్ ని భయటకు తీసి ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్సు లో హాస్పిటల్ కి పంపించారు. తరువాత మా క్యాబ్స్ కూడా రావడం తో మేము అందరం అక్కడ నుంచి వెళ్లి పోయాం.

ఆ వీక్ ఎండ్ తరువాత ఆఫీసు కి వెళ్ళగానే నన్ను హీరో ని చూసినట్టు చూసారు అందరూ. మా ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యి క్లైంట్ నుంచి గుడ్ ఫీడ్ బ్యాక్ రావడం తో మేనేజర్లు ఫుల్ ఖుషీ గా వున్నారు. మా టీం కి "బెస్ట్ టీం" అవార్డు ఇచ్చారు, తరువాత నాకు “Best Performer”, అవార్డు ఇచ్చారు. దాంతో పాటు " బ్రేవరి " అవార్డు ఇచ్చారు. ఆ అవార్డ్స్ తో "బిజినెస్ మెన్ ", లో మహేష్ బాబు చెప్పినట్టు ఆఫీసు లో అర్జున్  అంటే ఒక బ్రాండ్  అయిపోయింది. నన్ను ఒక ఐకాన్ లా  చూడడం స్టార్ట్ చేసారు. కొన్ని సార్లు బాగానే వుంటది కానీ, కొన్ని సార్లు నాకే ఓవర్ అనిపిస్తూ వుంటుంది . అలా ఆ వీక్ అంతా క్లౌడ్ 9 లో గడిపేసాను.

"అరె అర్జున్... ఈవెనింగ్ ప్లాన్ ఏంటిరా ?", అని అడిగాడు వరుణ్ .
"శనివారం కద రా... ఈవెనింగ్  వెంకటేశ్వర స్వామి గుడి వెళ్ళాళి మామ", అన్నాను.
"ప్రతి వారం గుడి కి వెళ్తావ్  కద ... కనీసం ఈ సారి మాతో సినిమా కి రా", అన్నాడు
" ఏం అనుకోకు మామ్స్... నాకు సెంటిమెంట్ అని తెలుసు కద... కావాలంటే రేపు నేను వస్తాను", అన్నాను.
"నీ బొంద లే... ఈ రోజు రమ్మంటే రావు కానీ రేపు వస్తా వంట... నువ్వు ఈ జన్మ కి  మారవ్ రా ", అంటూ వెళ్లి పోయారు వరుణ్,శీను.
వాళ్ళు వెళ్ళిన కాసేపటికి అక్కీ ఫోన్ చేసింది. నేను  ఫోన్ లిఫ్ట్ చేశాను  "హాయ్ అర్జు... ఏం డూయింగ్ ?", అంది.
"ఏం లేదు జస్ట్ ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నా ", అన్నాను.
"సరే కానీ, ఈవెనింగ్ ప్లాన్ ఏంటి ", అని అడిగింది.
అబ్బా...  మళ్లీ అదే ప్రశ్న అని మనసులో అనుకుని "శనివారం కద ...  వెంకటేశ్వర స్వామి గుడి వెళ్ళాళి అక్కీ ", అన్నాను.
"నువ్వు మరీ ముసలి వాళ్ళ లాగా అయిపోతున్నావ్ అర్జు... ఎప్పుడు చూడు గుడి - గోపురం అంటూ... సరే కానీ సినిమా కి వెళ్దాం", అంది.
" ఇవ్వాళ కుదరదు డా... కావాలంటే రేపు వెళ్దాం ", అన్నాను.
"ఒక అమ్మాయి సినిమా కి పిలిస్తే  కుదరదు అంటున్నావు నువ్వు ఎక్కడ దొరికావు రా  బాబు నాకు ... కావాలంటే రేపు కూడా సినిమా కి  వెళ్దాం, కాని ఇవ్వాళ మూవీ కి వెళ్ళాల్సిందే", అంది.
" కానీ... ", నేను చెప్పే లోపు  “Nothing doing…నువ్వు వస్తున్నావ్, అంతే... నేను K.F.C దగ్గర వెయిట్ చేస్తుంటా...", అని ఫోన్ పెట్టేసింది.
"ఈ అమ్మాయి నాకు ఎప్పుడు ఆప్షన్ ఇవ్వదే ", అని మనసులో అనుకుంటూ... అక్కీ  పాలనా చోట కి వెళ్ళాలి అనుకుంటే, నువ్వు ఒప్పుకోవాల్సిందే  లేదా నువ్వు చచ్చి పోయావే. ఇది ఒక అక్కీ మాత్రమే నా లేక అందరు అమ్మాయిలు ఇంతేనా ? అందరి గురించి నాకు తెలియదు కానీ మా అక్కీ మాత్రం అంతే.  సారీ ఫ్రెండ్స్ నేను రెడీ అయ్యి  K.F.C  కి వెళ్ళాలి, ఒక్క నిమషం  లేట్ అయినా చంపేస్తుంది  రాక్షసి .

"అర్జు... నీకు రాను రాను అస్సలు టైం సెన్స్ లేకుండా పోతోంది", అని తల మీద  ఒకటి కొట్టింది.
"అరె బాబా... It’s just 10 Mins late ... అంతే", అన్నాను నా వాచ్ చూపిస్తూ.
"సరే సరే గొడవ తరువత పాడుదాం లే ముందు బైక్ స్టార్ట్ చెయ్ ... మొదట మీ వెంకి దేవుడి గుడి కి వెళ్దాం ", అన్నది. నేను బుద్ధి గా బైక్ ని స్టార్ట్ చేసి ఆమె instruction ని ఫాలో అయ్యాను . తను అంతే ప్రతి చిన్న విషయానికి అరుస్తుంది, అల్లరి చేస్తుంది,  గొడవ పడుతుంది At the saem time తను చాలా caring , Sweet & Beautiful . నిజం గా నేను చాలా గర్వపడుతున్నాను తన లాంటి బెస్ట్ ఫ్రెండ్ నాకు దొరికినందుకు .
ఇద్దరం గుడి కి వెళ్ళాము. సాయంత్రం 4.00 PM కావడం తో పెద్దగా జనాలు కూడా లేరు , దాంతో మాకు దర్శనం తొందరగానే అయిపోయింది. దర్శనం కాగానే  ప్రసాదం కోసం వెళ్ళాం. అక్కడ అమ్మాయిలు  ప్రసాదం పంచుతున్నారు. "అర్జు... నువ్వు ఇక్కడే వుండు, నేను వెళ్లి తీసుకుని వస్తాను", అంది.
"అదేంటి , నేను కూడా వస్తాను, నీకు రెండు ఇవ్వరు కదా", అన్నాను. తను నన్ను కోపం చూసి
“Boss… I ll get for you, just wait”, అని వెళ్ళింది. అప్పుడు అర్థం అయింది, అక్కడ అమ్మాయిలు distribute చేస్తున్నారు, అబ్బో అక్కీ చాల పోసేస్సివే .  తను రెండు పాకెట్స్ తీసుకుని వచ్చింది. ఇద్దరం కలసి మంటపం కింద కుర్చుని ప్రసాదం తింటున్నాం.
"అవును అర్జు... నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్తావా ?", అని అడిగింది.
"ఛి నేను బ్యూటీ పర్లౌర్ కి వెళ్ళడం ఏంటి చిరాకుగా !!!", అని చిరాకు గానే ఫేస్  పెట్టాను.
"అది కాదు, నీ లిప్స్ అంత రెడ్ గా వున్నాయి కదా, నువ్వు లిప్స్టిక్ వాడుతవా అని అడగటం బాగోదని, ఇలా అడిగా ", అంది నవ్వుతూ .
"తొక్కలో స్నానం చెయ్యడానికే  ఓపిక ఉండదు... ఇకా కాస్మోటిక్స్ కూడానా ...", అన్నాను.
"అవును... నీకు ఏ  అమ్మాయితో అఫైర్ లేదా?",  అడిగింది
"ఏంటి ఇవ్వాళా కొత్త కొత్త Questions అన్ని అడిగుతున్నావ్... అయిన నాకు అఫ్ఫైర్స్ కాదు కదా అమ్మాయిల తో మాట్లాడటం కూడా తక్కువే . ", అన్నాను.
"ఓహ్ ఓకే. నాకు ఎందుకో మన టీం లోని శృతి నీకు లైటింగ్ వేస్తోందని అనుమానం ", అంది
"అవునా, నిజమా... చెప్పనే లేదు ", అని కాస్త కళ్ళు పెద్దవి చేస్తూ అడిగా.
అక్కీ కాస్త కోపం తో "ఆ  Excitement  ఏంటి, ఆ Expressions ఏంటి?, బాస్... నీ ఫీలింగ్స్ కాస్త కంట్రోల్ చేసుకో  ", అంది మూతి ముడుచుకుని.
"అది కాదు... శృతి చాలా సెక్సీ గా వుంటుంది కదా, సారీ సారీ.. చాల అందం గా వుంటుంది కదా, తను నాకు లైటింగ్ వెయ్యడం ఏంటా  అని... ", ఆగాను  
"నువ్వు ఎమన్నా తక్కువ అందం గా వున్నావా... నీ కలర్ కి, హైట్ కి ఏ అమ్మాయి అయినా పడి  పోవలసిందే ", అని ఆగి "ఛి ఛి నేను కూడా ఇలా మాట్లాడేస్తున్నాను ఏమిటి", అని "నేను వుండగా నువ్వు పక్కన అమ్మాయిని చూడటం ఏంటి ", అని తల మీద మొటిక్కాయ వేసింది.
"ఇదా మరీ  బాగుంది... ఈ టాపిక్ నువ్వు రైజ్ చేసి, నువ్వే కొత్త విషయం చెప్పి, తరువాత నువ్వే కోపడటం  దారుణం అక్కీ ", అన్నాను .
"ఐతే Topic Change,  అని అవును 'జానూ ' ఎవరు?? ఆ స్టొరీ ఏంటి ??", అని కుతూహలంగా అడిగింది.
"జాను అంటే జానకి... నా మరదలు . అంటే మా మేనత్త కూతురు. మా నాన్నకు, తన చెల్లెలు అంటే చాలా ఇష్టం. తను దూరం గా ఇచ్చి పెళ్లి చెయ్యడం ఇష్టం లేక ప్రక్క ఊరిలో మా మామయ్య కు ఇచ్చి పెళ్లి చేసారు. తరువాత జానూ పుట్టిన కొద్ది రోజులకు హెల్త్ బాగోలేక మా అత్తయ్య చనిపోయారు . అప్పటికి జానూ చాలా చిన్న పిల్ల. అందుకని మా మమయ్య ఇంకో పెళ్లి చేసుకున్నారు. రెండో భార్య జానూ ని బాగా చూసుకుంటుందో  లేదో అని మా నాన్న జాను ని  నాతో పాటే పెంచుకున్నారు ", అన్నాను.
"ఓహ్ ... ఓకే", అంది .
" చిన్నప్పటి  నుంచి తను నాతో పాటే  పెరగడం తో.. చనువు  కూడా కాస్త ఎక్కువే. మా ఇంట్లో నేను మా అమ్మ ఒక పార్టీ, జానూ మా నాన్న ఒక పార్టీ అన్న మాట. చాలా  సరదాగా గొడవలు పడుతుంటాం. తను కూడా చాల అల్లరి పిల్ల, అంతే తెలివయినది . మా నాన్న కానీ మా అమ్మ కానీ ఇప్పటికి ఏదయినా decession  తీసుకోవాలన్న  జానూ నే అడుగుతారు . తనకు 5 Star అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇంట్లో డబ్బులు ఇవ్వలేదని, తన వేలికి  వున్న ఉంగరం ని  షాప్ లో ఇచ్చేసి 5 Star తెచ్చుకుని తినేసింది. హ హ హ అది తెలిసి మా నాన్న ఓ రేంజ్  లో కొట్టాడనుకో  ", అన్నాను.
"తను అందం గా ఉంటుందా ?",
"హా అందం గా వుంటుంది ", అన్నాను
"నాకంటే అందం గా ఉంటుందా ? ",
"నిజం చెప్పమంటావా ? అబద్ధం చెప్ప మంటవా ?", అన్నాను కాస్త కొంటె గా నవ్వుతు.
"మరి ఓవర్ చెయ్యకుండా కర్రెక్టు గా చెప్పు ".
"నువ్వు చాలా అందం గా  వుంటావ్... తను చాలా చాలా అందం గా వుంటుంది ", అన్నాను.
"కరెక్ట్ గా  చెప్పింధుకు థాంక్స్... నీ స్టొరీ తో నన్ను ఇంప్రెస్స్ చేసినందుకు నీకో గిఫ్ట్ ", అని పెద్ద గ్రీటింగ్ కార్డు ఇచ్చింది .
“Hmmm Cool dear “, అని కార్డు తీసుకుని చూసా... చాలా సూపర్ గా వుంది డ్రాయింగ్ ... పచ్చని పొలం, మధ్యలో చిన్న పూరి గుడిసె, ఇద్దరు పిల్లలు కలసి మొక్క నాటుతుంటే వాళ్ళ ప్రక్కన నిలబడి చూస్తున్న బుల్లి కుక్క , చాలా బాగుంది ఆర్ట్ .
నేనయితే చాలా ఇంప్రెస్స్ అయిపోయాను “Really it’s fantastic … చాల సూపర్బ్ గా డ్రా చేసావ్ ", అన్నాను మెరుస్తున్న కళ్ళతో.
"మరి ఏమనుకున్నావ్ అక్కి అంటే", అని తన కాలర్ ఎగరేసి "నీకో చిన్న పజిల్... ఇంతకి ఈ  డ్రాయింగ్  ని నేను దేంతో డ్రా చేసానో చెప్పు ", అని అడిగింది.
"ఇక దేంతో డ్రా చేస్తారు, Crayons తో నో లేక  Sketch pens  తో  డ్రా చేసి వుంటావ్   ".
"బుద్ధూ ... ఇది Pure natural ink అంటే... Green leafs, Yellow leafs, Dry leafs ఇంకా కొన్ని Vegetables ని use చేసి డ్రా చేశా ", అంది.
అసలు నాకయితే కళ్ళు తిరిగి పోయాయి... అంతా న్యాచురల్ ప్రాడక్ట్స్ కావడంతో చాలా   కలర్ ఫుల్ గా అనిపించింది . "అయినా  ఇది నాకు ఎందుకు ప్రెసెంట్ చేసావ్ ? ఈ రోజు నా బర్త్ డే  నో లేక వేరే అకేషన్  కాదు కదా ?", అని అడిగాను.
"ఎవరయినా మంచి పని చేసినా, లేక వాళ్ళు నన్ను ఇంప్రెస్స్ చేసినా Gifts  ఇవ్వడం ఒక హాబీ. నువ్వు అంత మంది సేవ్ చేసావ్ కదా, నీ  స్మార్ట్ నెస్ , షార్ప్ మైండ్  కి  నేనయితే ఫ్లాట్ అయిపోయాను , అందుకే ఇది ప్రెసెంట్ చేశా ", అంది.
"ఒహ్హ నీలో చాలా కళలు వున్నాయే ",
"నా చిన్నపుడు మా ఇంగ్లీష్ టీచర్ బిందు రెడ్డి మేడం గారు, ఇలానే గిఫ్త్స్ ఇస్తూ encourage చేస్తూ వుండేది, ఆవిడని చూసి నేను కూడా ఫాలో  అయిపోయాను". అంది.
"నీ దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉన్నాయ్ అక్కి... అయినా ఈ గిఫ్ట్, నీ ఆర్ట్ సూపర్, థాంక్స్ ఒన్స్ అగైన్ ", అని నా జేబు లోని 5 Star chocolate bar ని అక్కీ   కి ఇచ్చాను .
“Welcome my dear Hero…", అని 5 Star ని తీసుకుని  "అయ్యో సినిమా టైం అయిపోతోంది త్వరగా భయలు దేరుదాం ", అంది వాచ్ చూసుకుని .
“Sure Sure…”, అని నేను లేచాను.
నేను  బైక్ స్టార్ట్ చేశాను. తను బైక్ లో కుర్చుని   "ఇప్పుడు నా మీద  కోపం లేదనుకుంటా... మీ వెంకి దేవుడి దర్శనం అయింది... ఇక హ్యాపీ మూడ్ తో సినిమా కి వస్తావు", అని కన్ను కోటింది. "హ హ హ...", అని నేను నవ్వాను . ఇద్దరం "గబ్బర్ సింగ్ ", సినిమా కి వెళ్ళాం . ఆన్ లైన్  లో టికట్స్ బుక్ చెయ్యడం తో హ్యాపీ గా లోని కి వెళ్లి కూర్చున్నాం. సినిమా మామూలుగా వుంది, బట్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ వాళ్ల సినిమా సూపర్ గా అనిపించింది . Movie Break లో ఇద్దరం కలసి కూల్ డ్రింక్స్ కోసం వెళ్ళాం . కూల్ డ్రింక్ తీసుకుంటుంటే " హే... అర్జున్", అని వాయిస్ వినిపించింది . ఎవరా అని వెనక్కు తిరిగాను శీను గాడు  వున్నాడు "హే... శీను నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావ్ ", అని అడిగాను.
"ఆ Question నేను వెయ్యాలి బాస్ ...", అన్నాడు వరుణ్ .
" Actual గా  నేను గుడి కి వెళ్ళాలి అనుకున్నాను ... కానీ ఎం చేద్దాం అక్కీ  ఒప్పుకోలేదు. She forced me to come raa… ", అన్నాను .
"అంతే రా అమ్మాయి పిలిస్తే వస్తారు , సారీ అమ్మాయిలతో  సినిమా కి వస్తారు... మాతో కాదు ", అన్నాడు .
ఇంతలో అక్కీ  అక్కడకు వచ్చింది.
"హే వరుణ్ , శీను ... మీరు  ఏమి చేస్తున్నారు  ఇక్కడ ", అని అడిగింది అక్కి .
"ధియేటర్ లో కూల్ డ్రింక్స్ చల్ల గా ఉంటాయో లేదో అని లోపలకి వచ్చి టెస్ట్ చేస్తున్నాం. ఎనీ వె  ఇక్కడ కూడా చల్ల గానే ఉన్నాయ్", అన్నాడు శీను  కాస్త వెటకారం గా.
"గుడ్ జోక్ ... అది కాదు మీరు సినిమా కి వస్తారని నాకు తెలియదు అందుకని అడిగాను!!! ", అంది .
ఇంతలో సినిమా స్టార్ట్ అయినట్టు బెల్ రింగ్ చేసారు
“see you on Monday Akshara ...  bye “, అని వెళ్ళిపోయాడు వరుణ్ . శీను గాడు  మాత్రం నన్నే కోపం గా చూస్తూ వెళ్ళాడు .
“Haaa Akki… I am dead… “, అన్నాను .
"ఏం  జరిగింది ?? ", 
"శీను గాడు నన్ను సినిమా కి రమ్మని అడిగినప్పుడు గుడి కి వెళ్ళాలి అని చెప్పాను , బట్ ఇక్కడ నన్ను నీతో చూసాడు ", అన్నాను.
"నాతో నువ్వు వుంటే ప్రాబ్లం ఏంటి ?",
"నీకు అర్థం కాదు  ... అలాగని నీకు ఎక్ష్ప్లైన్ చెయ్యలేను... Any ways సినిమా స్టార్ట్ అయిపోయింది  చలో", అన్నాను. ఇద్దరం లోనికి వెళ్ళాము . 2nd Half లో అంత్యాక్షరి సీన్ బాగుండటం తో మొత్తం మరచిపోయి ఫిలిం ఎంజాయ్ చేశాను . సినిమా అయిన తరువాత మేము ఇద్దరం కాసేపు తిరిగి తనని  వాళ్ళ  రూం దగ్గర డ్రాప్ చేసి నేను మా రూం కి వెళ్ళాను .
రూం లోకి ఎంటర్ కాగానే "ఎందుకు లేట్ అయింది ", అని అడిగాడు  వరుణ్ .
"అక్కీ  షాపింగ్ చెయ్యాలి అంటే , వెళ్ళాను... అందుకే లేట్ అయింది".
"ఆ శీను గాడు బాగా హాట్ గా వున్నాడు నీ మీద ",
"ఎందుకు? ఓహ్... కానీ ఏం  చెయ్యను నేను మామ... నేను రాను అని చెప్పినా  తను వినలేదు , లేక పోతే సినిమా కి వచ్చే Intention కూడా నాకు లేదు ", అన్నాను.
" అదంతా నాకు తెలియదు... వాడు రూమర్స్ కూడా  స్ప్రెడ్   చేస్తున్నాడు ", అన్నాడు.
" రూమర్సా ? ఎ రూమర్స్ ?".
"నీ గురించి అక్షర  గురించి ...",
"అక్కి నాకు మంచి ఫ్రెండ్  అంతే...అంతకు మించి ఏది లేదు ", అన్నాను .
"అదంతా నాకు తెలియదు ... నువ్వు ఇప్పుడు ట్రాప్ లో పడిపోయావు , ఈ ఛాన్స్ ని నేను వదలను ...", అని అన్నాడు .
“This is too much raaa “, అని చేతి లో వున్న బైక్ కీస్ తో వాడిని  కొట్టాను .
కాని ఆ రూమర్ వరుణ్ గాడితో మాత్రమే ఆగిపోలేదు... మొత్తం మా ఫ్రెండ్ సర్కిల్ అంతా , ఆఫీసు లో కూడా  స్ప్రెడ్ అయిపోయింది .
నన్ను అక్కి పేరుతో పిలవడం స్టార్ట్ చేసారు మా వాళ్ళు . ఆఫీసు లో అయితే  ఇంకా దారుణం ... నాకు ఫోన్ వస్తే అక్కీ  వైపు చూసే వాళ్ళు తను ఫోన్ చేసిందేమో అని. నా Desktop లో G-Talk, Skype పింగ్ అయితే అది అక్కీ  చేసుంటుంది అని  ఓ  చూపు చూసే వాళ్ళు . చాలా Embarrassing గా వుండేది ఒక్కొకసారి .
"నేను సూటిగా  Question  వేస్తున్నాను , కరెక్టుగా ఆన్సర్ చెప్పు ", అన్నాడు వరుణ్ .
"ఏంటది ? ".
"నువ్వు అక్కీ  ని లవ్ చేస్తున్నావా ?".
"అబ్బా ... అపరా బాబు , మళ్లీ నువ్వు కూడా నన్ను వేపుకుని తినకు ", అన్నాను కాస్త చిరాకుగా మొహం పెట్టి.
"నేను నిన్ను టీస్ చెయ్యడం లేదు రా ... సీరియుస్ గా అడుగుతున్నాను ", అన్నాడు.
"నీకు ఎందుకు వచ్చింది ఆ డౌటు? ", అడిగాను.
"నువ్వు అక్కీ  ని లవ్  చేస్తున్నావని నేను  ఫీల్ అవుతున్నాను... ఎందుకంటే, ఈ మధ్య  నువ్వు మాట్లాడే పది మాటల్లో ఆరు మాటలు అక్కీ గురించే ఉంటున్నాయి. తనతో మాట్లాడేటప్పుడు నీ కళ్ళల్లో  చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది , తన గురించి నువ్వు మాట్లాడుతుంటే ని   గొంతులో  చాలా Excitement   ఉంటుది ", అని ఆగాడు .
నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సైలెంట్ గా ఉండి పోయాను .
" అరె... నువ్వు  నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ రా ... ఆల్మోస్ట్ 10 Years  గా  మనం ఫ్రెండ్స్ . నీ అలవాటులతో మొదలుకుని Attitude  వరకు నాకు అన్ని తెలుసు. నా దగ్గర దాచకు రా నువ్వు అక్షర ని లవ్  చేస్తున్నావ్ గా ...", అన్నాడు .
"నాకు తెలియదు రా ", అన్నాను .
"Good ...I got the answer . నువ్వు  అక్షర ను లవ్ చేస్తున్నావ్ ", అన్నాడు నవ్వుతు.
" నువ్వు  ఎలా  చెప్పగలవ్. నేను నీకు చెప్పలేదు కదా అక్కీ ని  లవ్ చేస్తున్నట్టు  ?",.అడిగాను .
"నువ్వు "NO ", కూడా చెప్పలేదు . జస్ట్ నాకు తెలియదు అన్నావు . ప్రేమ అనేది  Confusion  తో స్టార్ట్ అవుతుంది . నువ్వు ఇప్పుడు ఆ Situation లో వున్నావ్ . ఒకసారి ఆలోచించు. ఒంటరిగా కూర్చో ... నీ  మనసు ఏమి చెబుతుందో అది విను . ఈ డైలమా నుంచి భయటకు రా . నీకు తప్పకుండా ఆన్సేర్ దొరుకుతుంది ", అన్నాడు.
నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు .
"బై  ది వే... మీ ఇద్దరి పెయిర్ చాలా అందం వుంటది ", అని అక్కడ నుంచి వెళ్లి పోయాడు .
నాకు అర్థం కావడం లేదు వరుణ్ జోక్ చేస్తున్నడా  లేక సీరియస్ గా  చెబుతున్నాడా  అని ఆలోచిస్తూ బాత్రూం లోకి వెళ్ళాను . Western Toilet  tub ని క్లోస్ చేసి Shower  ని ఆన్ చేసి  ఆ  వైపుకి తిప్పి   Toilet Tub  మీద  కూర్చున్నాను .  Shower లోంచి నీటి  జల్లులు నా మీద  పడుతోంది , నా ఆలోచనలు ఎక్కడికో పరుగెడుతోంది ."నిజం గానే నేను అక్కీ  ని లవ్ చేస్తున్నానా ? అవును అక్కీ ఎవరు, నాకు ఏమి అవుతుంది . నాకు తెలిసినత వరకు లవ్ స్టోరీస్ అంటే సినిమాలో మాత్రమే వుంటాయి  నిజ జీవితంలో కాదు, కానీ నేను వున్న ఈ  పరిస్థితి ఏంటి ? ఇది ప్రేమ ? నేను ఒక్కటి మాత్రం హానెస్ట్  గా చెప్పగలను  అక్కీ  అంటే చాలా ఇష్టం. కానీ ఇష్టం వేరు - ప్రేమ వేరు. మనం చాలా మందిని ఇష్టపడతాం కానీ ప్రేమించేది మాత్రం ఒక్కరినే . అక్కీ  తో వుంటే తో నాకు టైం తెలియదు , తనతోటే వుండాలి , తన తోటే మాట్లాడాలి అనిపిస్తూ వుంటుంది . ఎవరు ఫోన్ చేసినా అది అక్కీ  నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది . నేను తప్పు చేసినప్పుడు నన్ను కరెక్టు చేస్తుంది , లేట్ చేసినప్పుడు మొటిక్కాయ వేస్తుంది , ఏదయినా సాదించి నప్పుడు Appreciate చేస్తుంది , ఓడిపోయినప్పుడు వెన్నంటే ఉండి భుజం  తడుతుంది . ఇంతవరకు ఎవరూ  నా  లైఫ్ లో ఇంత దగ్గరగా రాలేదు . నన్ను నేను అక్కీ  లేకుండా ఒక్క క్షణమయినా  ఊహించుకోలేను అన్నంత క్లోస్ అయిపోయాను . దీన్ని లవ్ అంటారా ? ఒక వేల దీన్ని ప్రేమ అంటే "Yes , నేను అక్కీ  ని ప్రేమిస్తున్నాను... I am in Love with అక్కి". అ ఆలోచన నా మనసు లోకి  రాగానే ఏదో తెలియని ఆనందం నన్ను అల్లుకు పోయింది ",
"ఒరే   భాలరాజు... నిన్ను ఒంటరిగా కుర్చోమన్నది ఏ  చెట్టు కిందనో , పుట్ట కిందనో... బాత్ రూం లో కాదు ...ఇక్కడ నాకు బ్లాడర్  పగిలిపోతోంది ...తొందరగా భయటకు రాకపోతే ఇక్కడే పిచికారి చెయ్యాల్సి వస్తుంది ", అన్న వరుణ్ గాడి అరుపుతో ఈ లోకానికి వచ్చి... నడుముకి టవల్ చుట్టుకుని భయటకు వచ్చాను . నేను రాగానే వాడు లోనికి పరుగెత్తాడు . లోన వాడికి ఎంత హాయి గా వుందో తెలియదు కానీ... డైలమా లోంచి భయటకు వచ్చినందుకు  నాకు  చాలా రిలీఫ్ గా అనిపించింది .
"Yes ... నేను అక్కీ  ని ప్రేమిస్తున్నాను...", అన్నాను భయటకు వచ్చిన  వరుణ్ కోగిలించుకుని .
 “Good…డైలమా లోంచి  తొందరగా భయటకు వచ్చావ్ ", అన్నాడు .
“So… wats next ? నేను ఏమి చెయ్యాలి ఇప్పుడు ?", అని అడిగాను అమాయకం గా .
"ఇంకేముంది అక్కీ  కి నీ లవ్ ని ఎక్ష్ప్రెస్స్ చెయ్యాలి ", అన్నాడు.

                                                         తిరిగి వచ్చే సంచికలో కలుద్దాం...