Tuesday, November 15, 2011

కౌబాయ్ కామేష్ - 2

                                                         కౌబాయ్ కామేష్
                                                        ------------------------


           మ్యానేజర్తో  మీటింగు  అయ్యాక  మన కాముడు  గుండెల్లో  బాంబు పడినంత  ఎక్స్ప్రెషన్తో  నా   దగ్గరకు  వచ్చాడు . అది  చూసిన  నేను:
నేను : ఏమిట్రో    ఫేసు ? మీ   మ్యానేజర్  మొదటి  రోజే  డిజప్పాయింట్  చేశాడా ?
కా : ఏమిటోరా , మా  మ్యానేజర్  కి  కొంచెం  క్రాక్  అనుకుంటాను.
నేను : పిచ్చివాడా... అది   మ్యానేజర్  అవ్వడానికి  రిక్వయిర్మెంటురా. తెల్లకాకులు, నిజాయితీ  ఉన్న   రాజకీయనాయకులు, సరిగ్గా  ఆలోచించే  మ్యానేజర్లు  ఉండరు.
కా : ఏమోరా. ఏవో   పిచ్చి  పిచ్చి  ప్రశ్నలు  అడిగాడు. నాకు  ఏదో  టెంషన్గా  ఉంది.
నేను : సరే పద లంచ్ చేస్తూ మాట్లాడుకుందాము  అని Food Court కి  వచ్చాం.
మా కాముడు బోజన ప్రియుడు కావడంతో  ప్లేట్ ఫుల్లుగా  ఐటమ్స్ తేచుకున్నాడు. నేను మాత్రం నాలుగు  కేరెట్ ముక్కలు, రెండు కీర ముక్కలు, ఒక రోటి కొద్దిగా పప్పు తేచుకున్నాను. నా ప్లాటు వైపు ఆశ్చర్యం  గా చూసి
" ఏంటిరా ఇది... ఎంగిలి ఆకుల లో కూడా దీని కంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయ్ కదరా మామ !!!", అన్నాడు ఆశ్చర్యం గా.
"చెమట పట్టకుండా A.C. లో వుండి  ఒంట్లో కొవ్వు, సైడ్ లో టైర్లు పెరిగి పోయాయి. ఇంకాస్త లావు అయితే పెళ్లి చూపులకు మా ఫోటో ఫస్ట్ రౌండ్ లోనే రెజెక్ట్ అయిపోతుంది అని ముందు జాగ్రత్త మామ...", అన్నాను.
"మీ కంటే మన ఊరిలో గొర్రెలు, గేదేలే మేలు, కనీసం గడ్డయిన కడుపునిండా తింటుంది", అన్నాడు. అది కరెక్టే అనిపించి ఊరుకున్నాను.
నేను : ఇప్పుడు  చెప్పు. అసలు  ఏమైంది ?
కా : వస్తూనే , "Hi Kamesh. I am Praveen Deshpande . I am your reporting manager here.", అని  షేఖాండ్  ఇచ్చాడు. ఇక్కడదాక   బానే  ఉంది.
నేను : అప్పుడు...
కా : "How is it going?", అన్నాడు .   'it' ఏమిటో  అర్థం  కాలేదు.
నేను : ఆహా ? మరి  నువ్వేం  చెప్పావు ?
కా : చాలాసేపు  ఆలోచించి, నా   తెలివి  ఉపయోగించి, "It went down a few months ago. Slowly, it is coming up", అన్నాను.
నేను :  ఒరేయ్ బంగారం..., ఏమిటి  నువ్వు   చెప్పిన  "it"?
కా : చూశావా... ఒక  సంవత్సరం  ఎక్స్పీరియంస్  ఉన్న నీకే  అర్థం కానిది  మొదట్రోజే  నన్ను అడిగాడు. ఇట్  అంటే  "Information Technology".
నేను : ( విని   దిమ్మదిరిగి   మైండ్   బ్లాక్   అయిపోయింది - కాకి  ఈకలతో  ముక్కులో  కలబెట్టుకునే  ముధనస్తపు  పీనుగా అని తిట్టాలనుకున్నానుకాని కంట్రోల్ చేసుకుని ) అప్పుడు  ఏమన్నాడు ?
కా : బాగా  నవ్వి , "You are funny", అన్నాడు. ఎందుకు అన్నాడో అర్థం  కాలేదు. నేను  లైట్   తీసుకున్నాను . అప్పుడు , " What languages do you know? ", అన్నాడు. నేను  వెంటనే, "My mothertongue is Telugu. I speak Telangana type, kostaa type and rayalseema type Telugu also. I know thodasa hindi and english. I learned some words like "vanakkam", "mudiyaadu", "paapom" in Tamil", అన్నాను.
నేను : రామచంద్ర !
కా : ఆయనెవరు ?
నేను : ఎవరోలే . ఇంతకీ   ఆయనేమన్నాడు ?
కా : మళ్ళీ , "You are funny", అన్నాడు . ఇందులో   జోకేమిటో  నాకు  అర్థం  కాలేదు. అప్పుడు , "Did you search for a place to stay?", అన్నాడు. నేను, "I started searching", అన్నాను. దానికి , "How is it coming along?", అన్నాడు . అదేదో, అతిమూత్రవ్యధిగ్రస్తుణ్ణి   డాక్టర్   అడిగినట్లు , "  అదెలా   వస్తోంది ", అని   అడగటమేమిటో   నాకు   అర్థం   కాలేదు . సరే , బెంగుళూరు  నాకు  కొత్త  కదా, నీళ్ళు  పడ్డాయో  లేదో  అని  అడిగాడేమో  అని , "It's coming normally", అన్నాను.
నేను : ( వాంతి   చేసుకున్నంత   పని   చేసి, గాడిద పాలలో  Horlicks కలుపుకుని తాగే గుగ్గూస్ నాయాలు లా వున్నవే అని మనసులో అనుకుని ). దేవుడోయ్ , నువ్వు   టూ   మచ్   రా !    మ్యానేజర్   ఏమయ్యాడొ   పాపం .
కా : సరే , మేము   మాట్లాడుతుంటే   మధ్యలో   ఒక   "మూతి గడ్డం" గాడూ పేపర్ ప్లేట్లో  బిస్కుట్ లు  వేసుకుని  వచ్చాడు.
నేను: "మూతి గడ్డం" ఎంటిరా కొండ నాయాలా ?
కా: పెదవుల దగ్గరే రౌండ్ గా గెడ్డం పెట్టు కుంటారు కదా... స్టైల్ లో వున్నాడు.
నేను : గణేష్ నిమ్మ్జనం రోజు గణేష్ బీడిలు అమ్మలనుకునే గలీజు నాయాల...దానిని ఫ్రెంచ్ కట్ అంటారు.
కా: ఓహ్...అలా కూడా అంటారా... వెంటనే  మ్యానేజర్  వాడితో  "Can you add one more issue into your Service Pack",  అన్నాడు. నేను  Six Packs విన్నాను Family Pack గురించి విన్నాను మరి Service Pack గోలెంటో నాకు అర్థం కాలేదు. వెంటనే   మూతి గడ్డం గాడూ, "My plate is already full", అన్నాడు . కానీ  వాడి  ప్లేట్లో  ఇంకా  బోళ్ళు  ఖాళీ  ఉంది. మా  మ్యానేజర్   చూసుకోవట్లేదు. మొహమాటపడుతున్నాడేమో  పెద్దాయన  ముందు అని... నేను , "No. Still Two more Biscuts will fit into this", అన్నాను.
నేను : ఓహ్ మై సచిన్ టెండూల్కర్...!!! వాళ్ళేమన్నారు  దానికి ?
కా : ఏమిటో  పడి  పడి  నవ్వారు. మళ్ళీ   అదే  డయలాగు: "You are funny", అని .
నేను : Funny నా...నా బొంద...అర్థం తెలుసుంటే అరటి చెట్టుకి ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకునేవాళ్ళు. అని మనసులో అనుకున్నాను.
కా : “So...when is your delivery date ?? ”, అని వాడిని అడిగాడు.
మగడు...వాడు డెలివరీ అయ్యి పిల్లలను కనే డేట్ అడగట మేంటో అని “He is boy... how can he delivery a baby...is he JAMBA  LAKADI PAMBA ??? “, అని అడిగాను.
నేను: ఒరే సెకండ్ ఫ్లూర్ లో పెట్రోల్ బ్యాంకు పెట్టి దివాలా తీసి పోయిన దిక్కుమాలిన బుర్ర నువ్వు ను...అప్పుడు ఏమయింది.
: ఏంటో... ఇద్హరు పడీ పడీ  నవ్వారు... మూతి గడ్డం వాడు నవ్వు ఆపుకోలేక బయటకు వెళ్లి పోయాడు.
నేను: నువ్వు కేక మచ్చా.
కా : అప్పుడు   మా   మ్యానేజర్   నాకేసి   చూసి , "What platforms are you used to?", అన్నాడు . ఉన్నట్టుండి  వీడికి    ప్లాట్ఫారం  మీద గాలేందుకు మల్లిందో నాకు  అర్థం  కాలేదు. EAMCET లో  లాగా  ప్రశ్న  అర్థం  కాకపోతే  ఏదో  ఒకటి  చెప్దామని , "Number 2  " అన్నాను . దానికి  ఆయన  పెద్హ గా నవ్వి , "Come on man, I am serious. Are you comfortable with C?", అన్నాడు . సరే   ఇదేదో  C కోడింగ్  కి  సంబంధించిన  విషయం  అని  " యా  యా...", అన్నాను.
నేను : ఓహో ! అప్పుడు ?
కా: "How will you rate yourself for Sofware ", అని అడిగాడు.
నేను: Question అయిన అర్థం అయినద తమరికి ??
కా: మొదట అర్థం కాలేదు, రేటు యువర్ సెల్ఫ్  అంటే సాఫ్ట్ వేర్ జాబు వచ్చిన తరువాత  మార్కెట్ లో నా రేట్ అడిగాడు అనుకుని " Right now 12 Lakhs money, One Pulsar Bike and 50 Grams గోల్డ్ ", అన్నాను.
నేను : మా T.V  యాంకర్  భయంకర్ అన్నయ్య  కి బ్రదర్ లా తయారయ్యావు కదా రా ...నిజం గా నువ్వు మేధావివి రా.
కా : మళ్ళీ   ఏదో   వింత  ప్రశ్న  వేశాడు. "Do you have bandwidth to do what I just said?", అన్నాడు . ఉన్నట్టుండి   మళ్ళీ   బ్యాండ్విడ్త్   మీదకు  ఎందుకు  పోయాడో ! ఈవేళ   అమావాస్యాయే . వీడికి   అమావాస్య రోజు   ఏమైనా  పూనుతుందేమో !!! అనుకుంటూనే  ఉన్నాను  అమావాస్యపూట   చేరడం  దేనికి  అని.    హెచ్ . ఆర్   అమ్మాయి , "Hope to see you soon", అని   పదే   పదే   అంటే , " చంద్రబింబం లాంటి  అమ్మాయి  పిలుస్తుంటే  ఇంకా  అమావాస్యేమిటి ", అనుకుని   వచ్చేశాను . చీ   నా  తప్పే .
నేను : బాబూ ! నీ  ముహుర్తాల  గోల  ఆపు. ఇంతకీ   ఏం   చెప్పావు ?
కా : ఏముంది , "I have big bandwidth. I download new new movies, songs and softwares", అన్నాను. దానికి  ఆయన  నవ్వి , "You can't live without joking. Can you? Anyway, “Do you have any other doubts from your side ???”, అని అడిగాడు.
నేను: దానికి నీ సమాధానం ?
కా : ఇదేంటి వీడు...స్వాతి బుక్ లో సుఖ సంసారం కాలం లో  డా. సమరం లా డౌట్ లు అడగ మంటున్నాడు అనుకున్నాను.
నేను : కొంప తీసి అడిగావా ఏంటి ???
కా : మొదటి రోజే ఎందుకు అడగడం, కాస్త క్లోజ్ అయిన తరువాత అడుగుదాం అని ఊరుకున్నాను.
నేను : ఇల్లు కాలిన ఇరవయ్ నిమషాలకు ఇలియానా వచ్చినట్టు వుంది అనుకుని,  ఒరేయ్   బాలరాజు... నాకూ  ఇంక  ఓపిక  లేదు, అని లేచి షింక్ దగ్గర కి వెళ్ళాను చేతులు కడుకోవడానికి. పుష్టి గా లాగించడం తో మా కాముడికి కడుపులో తిప్పినట్టుంది, "మామ కడుపులో గుర్రపంధాలు స్టార్ట్ అయినట్టు వున్నాయి, బాత్ రూం ఎక్కడ వుందో చెప్పు", అన్నాడు ఇకారం గా మొహం పెట్టి.
"మనం చేతులు కడుక్కున్న షింక్ దగ్గరే బాత్ రూం వుంటుంది వెళ్ళు ", అన్నాను.
" ఒరే అక్కడ A.C. ఉంటుందేమో రా...A.C. వుంటే నాకు రాదు రా", అన్నాడు.
ఓహ్...నీలో రకం జబ్బు లు కూడా ఉన్నాయా అనుకుని " అయితే టాప్ ఫ్లూర్ లో స్టెప్స్ ఎక్కగానే, లెఫ్ట్ సైడ్ బాత్ రూం వుంటుంది వెళ్ళు...", అన్నాను.
అయిదు నిమషాలు గడిచిందో లేదో మేడ  మీద నుంచి తమిల్ అమ్మాయి "నా ఒన్నూ పాకలే... ", "నా ఒన్నూ పాకలే... ",  అంటూ  పరుగెత్తు కుని కిందకు వచ్చింది. వెనుకనే మా కాముడు ప్యాంటు సరి చేసుకుంటూ క్రిందకు వచ్చాడు.
"స్వాతిముత్యం  సినిమా లో మలయాళం మసాల బిట్టులు  కలిపినట్టు  వుంది నా జీవితం", అని నన్ను నేను తిట్టుకుంటూ, అక్కడ జరిగిన విషయం ఎలా అర్థం చేసు కోవాలో అర్థం కాక... ఏమి చేసావు రా అమ్మాయి ని...అలా పరిగేత్హుతోంది  ", అని అడిగాను.
"నేను ఏమి చేయలేదు రా స్వామి... బాత్ రూం కి గొళ్ళెం ఎలా పెట్టాలో అర్థం కాక, తలుపుకి బకెట్ అడ్డం పెట్టి నా మటుకి నేను లోనే వుంటే , అమ్మాయి వచ్చి తలుపు తోసింది, మొదట కుడి చెయ్యి తో ప్యాంటు పట్టు కుని ఎడమ చేతి తో ఆపాను, ఇంకా బలం గా తోసింది, అంతే ఫోర్సు కి ప్యాంటు జారింది నేను దూరం గా పడ్డాను , తను లోనికి తొంగి చూసి "కెవ్వూ...", అని అరిచి పరుగేత్హింది", అని ఆపాడు.
పరిస్థితి కి నవ్వాలో...ఏడవాలో...అరవలో...అర్థం కాక నా మీద నాకే చిరాకు వచ్చి ఆకాశం వైపుకి చూసాను, అప్పుడు అర్థం అయింది నాకు... ఆకాశవాణి ఎందుకు నవ్విందో.
-------------------------------------------------------------------------------------------------------
శుభమస్తు
మీ...
విక్రం

5 comments: