Tuesday, August 16, 2011

ఛి...దీనేబ్బా జీవితం...

August 1st Monday

దేవుడా..! ఏమి ట్రాఫిక్...ఇరవై నిముషాల ముందు BTM Water Tank దగ్గర బస్సు ఎక్కాను, ఇంత వరకు BTM 2 nd Stage కూడా దటలీదు. ఫుల్ ట్రాఫ్ఫిక్ జాం. అందరికీ తొందరే. దీనికి తోడు వాహనాల సౌండ్, పొగ. ఓరి భగవంతుడా...ఏంటి నాకీ శిక్ష అనుకుంటూ బస్సు కిటికీ లోంచి బయటకు చూసాను.
దూరం నుంచి ఒక అమ్మాయి వస్తోంది. అమ్మాయి చాల బాగుంది, మంచి హైట్ - ఇంచు మించు 5.6 వుంటుంది. పాలరాతి లాంటి అద్బుతమైన కలర్, గుండ్రటి మొహం, పొడవాటి జడ అచ్చం బాపు బొమ్మ లా అందంగా వుంది.  
జడ కి రిబ్బన్ లాంటి వి వేయకుండా ఫ్రీ గా వదిలేయడం తో గాలి కి కురులు మొహం మీదకి వస్తుంటే, కుడి చేత్తో సరిచేసుకుంటూ బసుస్టాప్ కి వచ్చి నిల్చింది. చూడగానే సాలిడ్ ఫిగర్ అని అనిపించేంత అందం గా వుండటం తో అందరి చూపు  అమ్మాయి వైపు కు మళ్ళింది.
ఇంతలో మా బస్సు బస్సు స్టాప్ లో ఆగింది. నేనైతే అస్సలు  అమ్మాయి వైపు నుంచి చూపు మరల్చలేక పోయాను. బస్సు ఎక్కి, నా ప్రక్కన కూర్చుంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ తెలుగు సినిమా హీరో లా ఒక డ్రీం సాంగ్ వేసుకునన్నాను.
ఇంతలో అమ్మాయి తన ప్రక్కన వున్న వారిని ఏదో అడిగి, వాళ్ళ సమాధానానికి కృతజ్ఞతలు తెలుపుతునట్టు చిన్నగా నవ్వుతూ వచ్చి మా బస్సు ఎక్కింది.
బస్సు మొత్తం ఒకసారి చూసి నా ప్రక్కన సీట్ ఖాలిగా ఉండటంతో వచ్చి కూర్చుంది. నాకు అస్సలు నమ్మ బుద్ధి కాలేదు, ఇంకా డ్రీం లోనే వున్నానా లేక  ఇది నిజమా అని అనుకుంటుండగా... అమ్మాయి నా వైపుకి తిరిగి 'హాయ్...' అంది.
నీను 'హాయ్...' అని చిన్నగా స్మైల్ ఇచ్చాను."Can you plz let me know once the Electronic City Stop comes", అని రిక్వెస్ట్ గా అడిగింది."Ya sure... Actually I am also getting down at E City", అని సమాధానం ఇచ్చాను."Wow...thanks", అని నక్షత్రాలు లాంటి తన కళ్ళను ఇంకా పెద్దవి చేస్తూ అంది.
అమ్మయిలు అందంగా ఉంటారని తెలుసు కానీ మరీ ఇంత అందం గా ఉంటారని. వాళ్ళు నవ్వితే నక్షత్రాలు, చద్రుడు ఇంకా ఏవేవో కనిపిస్తాయని నాకిపుడే తెలిసింది.
బస్సు వేగానికి అమ్మాయి కురులు నా మొహం మీదకి వస్తుంటే నెమలీకలతో పన్నీరు చల్లినట్టు హాయిగా వుంది. అలా అస్వదిస్తున్డగానే దిగాల్సిన స్టాప్ వచ్చేసింది.
"Hi...we need to get down at next stop", అని అమ్మాయితో చెప్పాను.
"Oh...Ok" అంది అందం గా నవుతూ.
ఇద్దరం బస్సు స్టాప్ లో దిగిన తరువాతః, అమ్మాయి వైపు తిరిగి "Actually...were you want to go", అని అడిగాను.
"I am going for Wipro Inteview" అంది.
"Oh Cool, I think you dont know the way, I am working in Infosys & its very next to Wipro" అని చెప్పాను.
"Thanks...thanks a lot " అంది కాస్త relaxed గా అవుతూ.
ఇద్దరం రోడ్ క్రాస్ చేసి కంపెనీ వైపు నడచి పోతూ వుంటే తన మొబైల్ రింగ్ అయింది.
"హలో  అమ్మా...నేను ఇప్పుడే బస్సు స్టాప్ లో దిగి, విప్రో కంపెనీ కి వెళ్తున్నాను. ఏం భయం లేదులే. ఇంటర్వ్యూ అవ్వగానే నీకు కాల్ చేస్తాను..బాయ్" అంది.
"హే... మీరు తెలుగు వాళ్ళా?", అని ఆశ్చర్యంగా అమ్మాయి ని అడిగాను.
"అయ్యో...మీరు తెలుగు వాళ్ళేనా!!! అనవసరం గా ఇంత సేపు ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నాం...". అంది అందం గా నవ్వుతూ.
Hmmm...తెలుగు సినిమా పరిశ్రమలో తమిళ దిరక్టర్స్ పాతుకు పోయినట్టు, బెంగుళూరు లో తెలుగు వాళు పాతుకుపోయారు", అన్నాను.
" ... కరెక్టే", అంది గులాబీ రంగు పెదవులని పెద్దవి చేసి నవ్వుతు.
 ఇలా మాట్లాడుతు ఉండగానే  విప్రో ఆఫీసు వచేసింది.
"ఇదిగొ...ఇదే మీ ఆఫీసు, లోపలి కి వెళ్లి సెక్యూరిటీ ని అడిగితే ఇంటర్వ్యూ ఎకడ జరుగుతుందో చెబుతారు", అని చెప్పను.
 "Haaa...sure...Thanks, Thanks a lot" అంది క్రుతజ్న్యతా పూర్వకంగా.
 "Welcome & All the very Best", అన్నాను నవుతూ.
 "థాంక్స్...", అని చెప్పివిప్రో ఆఫీసు వైపు  వైపు నడిచింది. అమ్మాయి వెళ్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయాను. విప్రో ఆఫీసు తరువాతే  మా ఆఫీసు కి ఐనా ఏదో బారంగాదూరం గా అనిపిస్తూ ముందుకి కదిలాను.
ఓహ్...సారీ..ఇక్కడ ఇంతసేపు నేను అన్నానే తప్ప నా పీరు మీకు చేపలేదు కదా...నా పేరు కార్తీక్...నేను Infosys లో 3 Years గా Java మీద వర్క్ చెస్తునాను. మంచి కంపెనీ, మంచి జాబ్, మంచి శాలరీ, మంచి ప్రాజెక్ట్ ఇలా  అంత మంచి గా వున్నాలైఫ్ లో ఏదో మిస్ అవ్వుతుననానే బాధలో వుండగా దేవత లా అమ్మాయి కనిపించింది. అందుకే ఇంత excitement.. ఏమీ అనుకోకండే...
 నేను ఆఫీసు లోనికి వెల్లగానే నా కొలీగ్  Vinay గాడు కనిపించాడు.
 "హాయ్ గుడ్ మార్నింగ్ ", అని విష్ చేసి నా సిస్టం ని ఓపెన్ చేసి వర్క్ సంబందించిన మెయిల్స్ కోసం చూసాను, కొత్త వర్క్ అసైన్ కాకపోవడం తో Vinay వైపు తిరిగి "Vinay కాఫి కి వెళ్దామా...", అని అడిగాను.
 "Ya Chalo da..." అని Vinay లేచాడు. ఇద్దరం కఫ్టేరియా కి వెళ్ళి  కాఫి తిసుకునాము. కాఫి చేతిలో వున్నా అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను.
 "అరె కార్తీక్.. కాఫి చల్ల గా  ఇపోతుంది బె...త్రాగు, అవును దేని గురించి అల్లోచిస్తునావు?", అని అడిగాడు.
వాడి మాటలకి లోకానికి వచ్చి " Vinay ఇవ్వాల బస్సు లో  ఒక అమ్మాయిని చూసానురా, సూపర్ గా సాలిద్ గా వుంది రా   అమ్మాయి, అస్సలు మతి పోయిందనుకో", అని exiting గా చెప్పాను.
"Oh...keka ra", అని  సగం తాగిన కాఫి ని డస్ట్ బిన్ లో పడేసి curious గా నా దగరకి వచ్చాడు.
"BTM Bus Stop లో ఎక్కింది రా అమ్మాయి విప్రో ఇంటర్వ్యూ కి వచ్చిందట. ఫ్రేషేర్ అనుకుంటాను రా...", అన్నాను నా కాఫి కంప్లీట్ చేసి డస్ట్ బిన్ లో  పడేస్తూ.
"ఇంతకి... అమ్మాయి పేరేంటి? ఫోన్ నెంబర్ తేసుకునావా?" ప్రశ్నల వర్షం కురిపించాడు.
"ఓహ్...షిట్ మాన్ నాకు తెలియదురా...నీను అడగలేదు, తను చేపలేదు!", అని కుళ్ళిపోయిన కర్బూజు కాయల ఫేసు పెట్టి.
"ఓర్ని దద్దమ్మ...ఒకటినర గంట పాటు బస్సు లో జర్నీ చేసావు, పది నిముషాలు తనతో నడిచి, అందమైన అమ్మాయి పైగా తెలుగు అమ్మాయి అంటునావు, ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి గా, కనీసం పేరు కూడా అడగలేదు, రోజు రోజు కి పెరుగున్నం లా మరీ మజ్జు గా తయరావుతున్నావు రా", అన్నాడు కోర కోర చూస్తూ.
"అవును సుమీ...నేను ఫస్ట్ అమ్మాయి పేరు అడగాల్సింది...ఛి నీ బతుకు...నీ మొహం మీద తెల్ల కాకి ఉచ్చ పోయా !!!", అని నన్ను నేను తిట్టుకుంటూ కఫతేరియా నుంచి బయటకు వచ్చాను.
ఇంతలో మా టీం మెంబెర్స్ అందరు రావడం తో నా సీట్ లో కూర్చుని java coading స్టార్ట్ చేశాను. Java లో వున్న మహిమే అంత, పని లో పడితే పార్వతి మెల్టన్ వచ్చినా పట్టించుకునే తీరిక ఉండదు.
                                                                          ******
August 2nd  Tuesday

రోజూ లాగే BTM Bus Stop లో బస్సు కోసం వెయిట్ చేస్తుంటే ఎలక్ట్రానిక్ సిటీ బస్సు వచ్చింది. యాంత్రికంగా బస్సు లో ఎక్కాను, బస్సు అంతా చూసాను సీట్ లేదు...అయ్యో ఇవాళ నిల్చుని వెళ్ళవలసిందే నా అనుకుంటూ వుండగా, లాస్ట్ సీట్ లోంచి ఎవరో అమ్మాయి చేయి ఉపింది. నా కోసం అమ్మాయి చేయి ఊపే సీన్ లేదు అనుకుని ముందుకి తిరిగాను. నా ప్రక్కన నిల్చినతను నన్ను పిలిచి " execuse me...some one is calling for you", అని చేయి ఊపిన అమ్మాయి వైపు చూసాడు.వావ్ సూపర్...నిన్న కనిపించిన తెలుగు దేవత అనుకుంటూ last seat వైపు కి నడిచాను. అపుడు చూడాల్సింది నా మొహం కామన్ వెల్త్ గేమ్స్ కి ఉపయోగించిన పవర్ వెలుగంత నా ముక వెలుగు ముందు దిగదుడుపే.
"హాయ్, next స్టాప్ లో ఇతను దిగేస్తారట, సీట్ కాలి అవుతుంది కూర్చోండి", అంది.ఇంతలో సీట్ లో ని వ్యక్తి లేచి వెళ్లి పోవడంతో నేను కూర్చునాను.
"హాయ్ గుడ్ మార్నింగ్ అన్ థాంక్స్", అన్నాను పలకరింపుగా నవుతూ.
"వెరీ గుడ్ మార్నింగ్", అంది తన సహజ నవుతో.ఇవాళ వైట్ & బ్లూ చెక్స్ షర్టు, బ్లాకు jeans లో మోడరన్ బాపు బొమ్మ లా అందం గా వుంది. సెమి స్లివ్ షర్టు కావడంతో అందం రెట్టింపు అయింది.
"నిన్న నా ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఇవాళ టెక్నికల్ రౌండ్ వుంది", అంది మెరిసే కళ్ళతో.
"వావ్ గ్రేట్...అల్ ది వేరి బెస్ట్ ఫర్ టుడే's  రౌండ్", అన్నాను.
"...థాంక్స్ అండి, నిన్న All the Best చెప్పారు, అందుకే ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాను, ఇవాళ కూడా మీరు కనిపిస్తే బాగుంటుంది అనుకుంటూ వుండగా మీరు బస్సు ఎక్కారుథాంక్స్ గాడ్. Actual గా నాకు సెంటిమెంట్స్ కాస్త ఎక్కువ", అని అంది ముత్యాలు పేర్చిన నోటితోటి.తను అలా మాట్లాడుతుంటే నా చెవులు ఎలా ఫీల్ అవుతుందో కానీ, కళ్ళు మాత్రం ప్రపంచం లోని అందానంతా ముత్యాలముగ్గు లాంటి మొహం లో వెతుకుతోంది.
"ఓహ్ ఓకే, actual గా నిన్న ఇంటర్వ్యూ గురించి నీకు కాల్ చేయాలి అనుకునాను,కానీ నా దగ్గర నెంబర్ లేకపోవడంతో చేయలదు", అని మెల్లగా అన్నాను.
"ఓహ్...సారీ మనం మాట్లాడుకుంటున్నాం కానీ introduce చేసుకోలేదు, నా పేరు సునీత. మాది తిరుపతి. B.Tech  చేశాను. ఇపుడు fresher గా ట్రై చేస్తున్నాను. నా నెం. 9916713090 ",అంది.
"నా పేరు కార్తీక్, నాది విజయవాడ. నేను Infosys లో Java మీద జాబు చేస్తున్నాను. నా నెం. 9916713090 ", అన్నాను.
"విప్రో లో మా ఫ్రెండ్స్ చాలా మంది వర్క్ చేస్తున్నారు వీలైతే నేను కాల్ చేసి మాట్లాడుతాను, బై ది బై మీ Surname ఏంటి? ఇక్కడ అసలు పేరు కంటే Surname చాలా important ", అన్నాను.
"Sunitha Perumal ", నా ఫుల్ నేమ్.
"Then నేను మా వాళ్ళకి కాల్ చేసి ప్యానల్ లో వున్నారేమో తెలుసుకుంటాను", అని చెప్పాను. దిగాల్సిన స్టాప్ రావడం తో ఇద్దరం బస్సు దిగి మాట్లాడుకుంటూ వెళ్ళాముతను విప్రో ఆఫీసు  కి వెళ్లి పోయింది. నేను మా ఆఫీసుకి వచ్చాను. వచ్చాను అన్నమాటేగాని నా మనస్సు మాత్రం అమ్మాయి తో పాటే విప్రో కి వెళ్లిపోయింది.
"కార్తీ...ఇవ్వాల ఫుల్ గా వర్క్ వుంది రా. కొత్త Service Pack స్టార్ట్ అయింది. మేనేజర్ నుంచి మెయిల్ వచ్చింది చూడు", అని అన్నాడు వినయ్.
"వినయ్ అలా చెప్పగానే నిక్కర్ సీట్ కింద సిలిందర్ పేలినట్టు అయింది నా పరిస్థితి. Mail చూసాను. Issues ఫుల్ గా వున్నాయి. Application  ఓపెన్ చేసి కోడ్ రాస్తుంటే అన్ని errors వస్తునాయ్. సరిగ్గా అల్లోచించలేకపోతున్నా నా వాచ్కేసి మొబైల్ కేసి చూడటానికే సరిపోయింది.
"ఏంటి కార్తి...అంతా nervous గా వున్నావ్, స్కూల్ పిల్లోడు లాంగ్ బెల్ కోసం చూస్తునట్టు నీ వాచ్ ని మొబైల్ ని చుస్తునావ్, ఏంటి విషయం?", అని ఎంక్వయిరీ చేస్తునట్టు అడిగాడు వినయ్.అప్పుడు తెలిసింది నేను నా వాచ్ ని మొబైల్ ని ఎన్ని సార్లు చూసానో. "చలో...కాఫి తాగుతూ మాట్లాడుకుందాం", అని ఇద్దరం వెళ్లి కాఫీ తీసుకున్నాం.
"వినయ్, భూమి గుండ్రం గా వుంటుంది అని సైంటిస్ట్ లు అంటే  తొక్కలే పనీ పాట లేక చేపుంటారు లే అనుకున్నాను. ప్రపంచం చాలా చిన్నది అని మొబైల్ యాడ్ వస్తే బెంగుళూరు లో బస్సు జర్నీ చేయి నీకు తెలుస్తుంది అని తిట్టుకూన్నాను. కాని అదంతా నిజమే అని ఇవ్వాల తెలిసింది", అని ఆపాను.
"ఏంటి మామ, నిత్యానంద స్వామి వెళ్లి పోయాడు కదా,  ఖాళి ప్లేస్ ట్రై చేద్దాం అనుకుంటున్నావా? తొక్కలో వేదాంతం మాట్లాడుతున్నావ్", అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ.
"నిన్న మిస్ అయిన అమ్మాయి ఇవాళ బస్సు లో కనిపించింది రా. అమ్మాయి పేరు సునీత అంట, నెంబర్ కూడా ఇచ్చింది", అన్నాను కళ్ళు, కాలర్ అగరేస్తూ.
"శ్రీశాంత్ సెంచురీ చేసి ఇండియా ని ఒంటి చేత్హో గెలిపించాడు అన్నా నమ్ముతానూర కానీ నువ్వు ఒక అమ్మాయి తో మాట్లాడి, ఫోన్ నెంబర్ తేసుకున్నావంటే నేను నమ్మను రా", అన్నాడు.
"కావాలంటే చూడు బె", అని నా మొబైల్ లోని  సునీత నెంబర్ ని చూపించాను.
"వావ్ సూపర్ మామ. నువ్వు మాములు పెరుగన్నం అనుకున్నానురా కానీ మధ్య ఆవకాయ కూడా మిక్స్ చేస్తున్నావ్...కూల్ టేస్ట్ బాగుంటుంది", అని వెన్ను తట్టాడు.
"తనకి ఇవ్వాల టెక్నికల్ రౌండ్ వుందట, శ్రీకాంత్ కి ఫోన్ చేశాను, ప్యానల్ లో వున్నాడంట", అన్నాను.
"ఓకే మామ, బట్ వర్క్ ఎక్కువగా వుంది బయాస్ అవ్వకు", అని హెచ్చరించి తన కాబిన్ కి వెళ్లి పోయాడు. నేను వర్క్ స్టార్ట్ చేశాను. మా టీం మెంబర్స్ చెబితే కానీ తెలియలేదు లంచ్ టైం అయింది అని. అప్పుడు గుర్తుకి వచ్చింది సునీత, కాల్ చేశాను, రింగ్ అవుతోంది కానీ తీయలేదు. ఇంటర్వ్యూ లో వుంటుంది లే అనుకుని లంచ్ కి వెళ్ళాను.వర్క్ ఎక్కువగా వుండటం తో తొందరగా వచ్చి సీట్ లో కూర్చుని వర్క్ స్టార్ట్ చేశా. మూడున్నర కి నా మొబైల్ రింగ్ అయింది. సునీత నుంచి ఫోన్. "Hey Sunitha what happened to the ఇంటర్వ్యూ?", అని exiting గా అడిగాను.
"కార్తి...అది...అది...", అని వాయిస్ స్లో చేసింది. సునీత ఏంటి ఇలా మాట్లాడటంఏంటి అనిపించి "ఏమయింది, ఇంటర్వ్యూ అయిపోఇంద?", అడిగాను
"కార్తి...ప్లీజ్ ఇంటర్వ్యూ గురించి వదిలేసే, రేపు ఫోన్ చేస్తాను, బాయ్", అంది.
"సరేలే కానీ...నువ్వు ముందు మీ విప్రో ఆఫీసు ముందు వున్న ఫుడ్ కోర్ట్ కి వచేసే, నేను ఫైవ్ మినిట్స్ లో అక్కడకి వస్తాను", అని సమాధానం కోసం వెయిట్ చేయక ఫోన్ కట్ చేసేసాను.నా సిస్టం ని లాక్ చేసి బయలుదేరాను. ఫుడ్ కోర్ట్ కి వెళ్ళగానే, సునీత దిగాలుగాఎండిపోయిన జీవ నది లా కనిపించింది.
"హే సునీత...లంచ్ చేయలేదు కదా? ఎం తింటావ్?", అని అడిగాను.
" నాకు ఆకలిగా లీదు కార్తీక్", అంది వుభికి వస్తూన కన్నీలని అప్పుకుంటూ.
"సరే లే జుఇస్ తీసుకునివస్తాను, తరువాత లంచ్ చేదాంలే", జుస్ షాప్ కి వెళ్లి ఆపిల్ జుస్ తెచ్చాను.
"త్రాగు సుని చాలా నీరసంగా వున్నావ్", అని జుస్ ఇచ్చాను.
"నాకు ఏమి వద్దు, రూం కి వెళ్తాను", అని లేచి నిలబడింది.
"అరె...కాసేపు కూర్చో. ఏమయింది ఇంటర్వ్యూ పోయిందా?", మెల్లగా అడిగాను.
"అవును కార్తి, నేను బాగానే చేశాను, కానీ ప్రోగ్రామ్స్ తప్పు రాసాను. మిగిలిన అన్నింటికీ కరెక్ట్ గానే సమాధానం చెప్పాను, కానీ సెలెక్ట్ చేయలేదు", అని ఏడవడం స్టార్ట్ చేసింది.అమ్మాయిలు సెన్సిటివ్ అని తెలుసు కానీ మరీ ఇంత సెన్సిటివ్ అని తెలియదు. నేను చాలా ఇంటర్వ్యూ లు పేస్ చేశాను సెలెక్ట్ కాకపోతే బాధపడ్డాను కానీ ఇలా  ఏడ్చలేదు.నా చేతిలోని జుఇస్ తన చేతిలోకి పెట్టి, సునీత ఎదురుగ మోకాళ మీద కూర్చుని "ఏంటిది చిన్న పిల్లలా. ఒక ఇంటర్వ్యూ కాకపోతే ఏంటి తొక్కలోది బెంగుళూరు లో వందల కొద్ది కంపెనీలు వున్నాయ్. అయిన నువ్వు fresher వి, ఇంకా చాలా కంపెనీలు recrutment స్టార్ట్ కూడా చేయలేదు. అంతెందుకు మా కంపెనీ కూడా స్టార్ట్ చేయలేదు, విప్రో కాకపోతే Infosys ,TCS , CTS  ఇలా చాలా కంపెనీస్ నీ కోసం క్యు కట్టుకుని వుంటాయిదైర్యం గా వుండు", అని నా చేతితో తన బుగ్గల మీదకి వస్తున్న కన్నీటిని తుడిచాను. వెచ్చగా అనిపించిందిమాములుగా కన్నీళ్ళు వెచ్చగా ఉంటాయని తెలుసు కానీ ఎపుడూ ఫీల్ అవ్వలేదు. చిన్నపుడు నేను చాలా సందర్బాలలో ఎడ్చినపుడు కన్నీరు వచ్చేది కానీ ఇప్పుడు పొందిన వెచ్చదనం ఏదో కోత్హ గా వుంది. నేను అలా చెప్పేసరికి కాస్త కుదుటపడింది.
"ముందు జుస్ త్రాగు, మద్యాహ్నం కూడా లంచ్ చేయలేదు", అని బలవంతం గా జుస్ తగిచాను. అయిష్టంగానే రెండు గుక్కలు త్రాగింది. జుస్ మహిమో లేక నా ఓదార్పు మహిమో కానీ కాస్త స్థిమిత పడింది.
"చూడు సుని, నేను టోటల్ గా 18 కంపెనీస్ అటెండ్ అయ్యాను అందులో చాలా వరకు టెక్నికల్ క్లియర్ అయ్యిన తరువాత పోయింది 5 మంత్స్ తరువాత Infosys లో సెలెక్ట్ అయ్యాను. నువ్వు అంతే ఇంకో వన్ ఆర్ టూ మంత్స్ లో జాబు కొడుతావు", అని సముదాఇంచాను.
"కొట్టగాలంటావా?", అమాయకంగా నా వైపు కి చూసి అడిగింది. పెల్లెటూరి వెనెల్ల రాత్రి అరటిఆకు చాటు నుంచి కనిపించే నిండు చంద్రుడి లాగా వుంది సునీత మొహం.
"Sure గా సెలెక్ట్ అవుతావు. అలా కాకపోతే నేను నా జాబ్ కి resign చేసి, ఇదిగో ఇలానే జుస్ బొట్టెల్ పట్టుకుని నీ వెనుకాలే వస్తాను", అన్నాను నవుతూ. పక్కున నవ్వింది సునీత. తెలంగాణ వచినపుడు కూడా KCR కి ఇంత ఆనందం ఉండదు, కానీ నాకు అంత అనదం వేసింది నవ్వుతున్న అందమైన వెన్నలను చూస్తుంటే...
"ఎనీ doubts ????" అని అరుపు వినిపించింది ఎకడో మూల నుంచి. నా చైర్ ని మా టీం మెంబర్ వినయ్ కదిలించడంతో కళ్ళు తెరిచాను. ఎదురుగా మా మేనేజర్ కొత్త ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఇస్తునాడు. అపుడు అనిపించింది ఇప్పటివరకు కలలో వున్నాను అనికలే కానీ అందమైన కల. అదీ కరెక్టే కల కాబట్టే అందం గా వుంది, అందం గా ఉన్నవన్నీకలలోనే చూడగలంమళ్లీ అదే ప్రాజెక్టు, అదే  పని.
Java లో వున్న మహిమే అంత. మరదలు వచ్చి ప్రేమతో బావ బావ అన్నా Java Java అనే వినిపిస్తోంది...ఛి దేనేబ్బా జీవితం...అని తిట్టుకుంటూ కోడింగ్ స్టార్ట్ చేశాను.

                                                         ******

No comments:

Post a Comment