Wednesday, May 23, 2012

అందమైన మనసులో... Part - 1


                                        అందమైన మనసులో...

                                      [బోలెడంత ప్రేమ - కొంచెం కన్నీళ్ళు ]

                                                                                                               PART - 1


"ప్రేమ" - శతకోటి అందమయిన తెలుగు పదాలలో ఒక మాములు పధం.  చూడటానికి చాలా  తేలిక గా కనిపించే రెండు అక్షరాల పధం, కానీ అది చేసే పని మాత్రం చాల దారుణం .
నా దృష్టిలో ప్రేమ అంటే
హిందు మహా సముద్రానికయినా లోతయినది...!
      హిమాలయ పర్వతానికయినా ఎత్హయినది...!!
            అమ్మ మనసులా  మెత్హనయినది...!
                   సచిన్ రికార్డ్స్ లా గట్టిధయినది...!!
                          దూది పింజం లా తేలికయినది...!
                                 అణుబాంబు లా భయంకరమయినది...!!
                                         భాలయ్య సినిమా లా నవ్విస్తుంది...!
                                                  దాసరి సినిమా లా ఏడిపిస్తుంది...!!

ఇంత సోది ఎందుకేహ... మోత్హానికి " మేతమెటిక్స్ ", సబ్జెక్టు లా ప్రొబ్లెంస్ తో కూడుకున్న గజి బిజి గంప లాంటిది .
ఓహ్... సారీ, Introduction లేకుండా అర్థం పర్థం కాకుండా మాట్లాడుతున్నాడు విడేవాడు రా  అనుకుంటారేమో... అక్కడికే వస్తునా .

నా పేరు అర్జున్ , బెంగుళూరు లో సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబు చేస్తున్నా. మాది తిరుపతి దగ్గర ' సంక్రాంతి పల్లె ' అనే చిన్న పల్లెటూరు. మా నాన్న గారి పేరు చక్రవర్తి . సినిమా లో కే. విశ్వనాధ్ గారి లాగా క్లాసు గా వుంటూ పొడి పొడి గా మాట్లాడుతూ , పక్కా పద్ధతి గా వుంటారు . ఇక మా అమ్మ గారి పేరు అన్నపూర్ణ . ఆవిడ కూడా సినిమా లో అంజలి దేవి గారి లా అమాయకం గా వుంటారు. నాకు తెలిసినంత  వరకు మా అమ్మకు తెలిసింది రెండు ప్రపంచాలు. ఒకటి మా నాన్న , రెండు నేను. మా అమ్మ గుడి కి వెళ్లిందంటే అంతే,దేవుడు మూర్చ పోవలసిందే. అల్లా అడుగుతుంది కోరికలను. పాపం తన గురించి కాదు  మా ఇద్హరి గిరించి. నేను ఒక్కడినే కొడుకుని కావడం తో కాస్త అమాయకం గా అల్లరి గా పెరిగాను. పెద్ద గా భాద్యతలు కూడా లేవు. చేతికి నలభై వేలు శాలరీ , మంచి ఉద్యోగం. ఇది నా బ్యాక్ గ్రౌండ్.

అందమయిన వర్షాకాలం సాయంత్రం వేళ, బాల్కనీ లో ఈజీ చైర్ లో కుర్చుని, తొలకరి చినుకులను  చూస్తూ, చేతి లో బ్రూ కాఫీ ని త్రాగుతూ, బ్యాక్ గ్రౌండ్ లో  మెల్లగా  వినిపిస్తున్న ఘంటసాల గారి పాటలు వింటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్న టైం లో  ఈ తొక్కలో 'ప్రేమ' అనే పురుగు నన్ను కుట్టింది, నా జీవితం చిన్న బిన్నం అయింది. అదెలాగ అంటారా...
ఫస్ట్ సీన్...

నాకు ప్రతి శనివారం రోజున వేకటేశ్వర స్వామి వారి గుడి  కి వెళ్ళడం అలవాటు.
ప్రతి శనివారం లాగే ఆ రోజు కూడా గుడి కి నా ఫ్రెండ్ వరుణ్ తో కలసి వెళ్ళాను. ఎప్పటి లాగే బెంగుళూరు లో సాయంత్రం పూట ఆకాశం మొబ్బులు తో నిండి పోయి వర్షం కురవడానికి రెడీ గా  వున్నది. వర్షం కురిసే సూచనలు వుండటం తో బైక్ పార్క్ చేసి గుడి మెట్లు పై పరుగేత్తుతున్నాం. శనివారం కావడం తో జనాలు కూడా కాస్త ఎక్కువగా వున్నారు . మెట్లు ఎక్కుతుంటే ఎదురుగా అమ్మాయిల batch వస్తోంది . అయిదారుగురు కలసి వస్తున్నారు. అమ్మాయిలను చూడటం తో నా  వేగం తగ్గింది . ఆ గుంపు లో చాలా మంది వున్నా అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు, నాకు ఆ అమ్మయి మాత్రమే కనిపించింది (జీవితం సంక నాకిపోవడానికి తొలి మెట్టు లాంటిది ఈ సీన్). ఆ అమ్మాయి వైట్ చూడిదార్ లో (కరుణాకరన్ ఏ క్షణం లో కీర్తి రెడ్డి ని వైట్ డ్రెస్ లో చూపించాడో కానీ ... అప్పటి నుంచి హీరొయిన్ introduction అంటే కంపల్సరీ గా వైట్ డ్రెస్ లోనే వుండాలి అని ఫిక్స్ అయిపోయారు జనాలు . వైట్ కాకా ఏ ఎర్ర కలరో, పచ్చ కలరో, పసుపు కలరో పెడితే సైడ్ హీరొయిన్ అనుకుంటారు )  చాలా  అందం గా వుంది.  సినిమా లో హీరో , హీరొయిన్ ని  చూసేటప్పుడు పూలు కురిసినట్టు కరెక్ట్ గా అప్పుడే చినుకులు స్టార్ట్ అయింది చినుకులు మొహం మీద పడటం తో చున్ని తో కప్పు కోవడానికి ట్రై చేస్తూ మొహం పై పడ్డ వాన నీటి ని తుడుచుకుంటూ వేగంగా గుడి మంటపం లోనికి వెళ్తోంది. సినిమా లో అయితే వెంటనే హీరో సాంగ్ వేసుకుంటాడు బట్ నాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నా మనసులోనే ఆ అమ్మయికి ఓ కవిత ని అంకితం చేశాను. కాస్కోండి ...
పచ్చని వరి  పైరు  మీద  పడ్డ  తొలకరి చినుకులు లాంటి అందమయిన మోహము...
      మంచి గంధం లాంటి మేని రంగు ...
            పెద్ద గుడి ముందు వేసిన అందమయిన రంగు ముగ్గు లాంటి బొట్టు...
                   అరివిరిసిన మందారం లాంటి కన్నులు ...
                          గల గల పారే గోదారి పరుగులు లాంటి నవ్వు ...
                               కోనసీమ కొబ్బరి చెట్టు లా వొంపులతో కూడిన పొడవాటి వాలు జడ ...
                                       ఆవకాయ ముక్క లా నోరూరించే పెదవులు ...
                                            గడ్డి పూస లాంటి సన్నటి నాజుకయినా నడుము ...

మోత్హానికి మిస్ ఇండియా కి కావాల్సిన  Qualities  తో వుండే కత్తి లాంటి సాలిడ్  ఫిగర్ అనిపించేంత అందం గా వుంది [ఏంటి పదాలు గాటు గా, నాటు గా వుంది అనుకుంటున్నారా... !! ఈ మాత్రం మసాల దట్టించకుంటే పాఠకులకు మరీ బోర్ కొట్టేయదు !!!].

ఇలా నాలో నేను ఆ అమ్మాయితో  ఒక డ్రీం సాంగ్ ని మాంచి కోన సీమ పల్లెటూరి లో వేసుకోవడానికి  రెడీ అవుతున్న టైం లో  "వెండి మొలతాడు తాకట్టు పెట్టి గుండ్రాయి కొనుక్కునే అర గుండు నాయాలా... నువ్వు దేవుడిని చూడటానికి వచ్చావ లేక దేవతన ? ", అని వరుణ్ అరవడం తో ఈ లోకానికి వచ్చాను. నా మనసుని ఆ మెట్ల మీదే వదిలి గుడిలోనికి పరుగెత్త్హాను. ఓ అర గంటలో దర్శనం అయిపోగానే నా మనస్సు ని ( కత్తి లాంటి ఫిగుర్ ని) వెత్హుకుంటూ కిందకు వచ్చాను. అక్కడ కనిపించ లేదు . సరే వెళ్లి పోయి వుంటది కదా అనుకుని, దేవుడి ప్రసాదం  తీసుకోవడానికి మంటపం లోనికి వెళ్ళాను. ఆ అమ్మాయి అక్కడే  అందరికీ  ప్రసాదం పంచుతోంది . ఫ్రేషేర్ గా onsite  ఆఫర్ వచ్చినంత ఆనందం వేసి, పరుగెత్తుకుంటూ ముందు కి వెళ్ళాను .
"ఒరే, ఇది సంక్రాంతి పల్లె కాదురా పరుగెత్తుకుని వెళ్లి ప్రసాదం తీసుకోవడానికి... లైన్ లో నడువు ", అని వరుణ్  అనడం తో లైన్ లో కి వచ్చాను . ఒక చేత్హో ప్రసాదం పంచుతూ మరో చేత్త్హో  మొహం మీద పడుతున్న ముంగురులను సరి చేసుకుంటూ ఆ అందమయిన పెదవుల పై చిరునవ్వు చెరిగి పోకుండా, అందరిని కళ్ళతో ఆత్మీయంగా పలకరిస్తూ  చక్కర పొంగలి పంచుతోంది . ఎవరో గొప్ప వాళ్ళు చెప్పినట్టు  " Everybody searches for a chance to impress others. But they don’t understand, impressions are made by very casual happenings”, అన్నది గుర్తుకి వచ్చింది . అది నిజమే అనుకుంటా. ఇంతలో నా వంతు రావడం తో నా చేతులను చాపాను ప్రసాదం ఇవ్వమన్నట్టు . తను ప్రసాదం ఇచ్చింది, కానీ ఆ విషయం గమనించక తన్మయత్వంతో ఆ అమ్మాయినే చూస్తున్న.. ఇంతలో  "ఒరే  McDonalds  లో మునక్కాయ సాంబార్ వుందా అని అడిగే ముధనస్తపు మంద బుద్ధి వెధవ... చూసింది చాలు మానం తీయకుండా ముందుకి కదులు ", అని నన్ను గట్టి గా  తోయడం తో అక్కడినుంచి  ముందుకి వచ్చాను . ప్రసాదం చక్కర పొంగలి, పైగా నా స్వప్న సుందరి స్వహస్తాలతో ఇవ్వడం తో చాల తియ్యగా , మధురంగా అనిపించింది. నా గురించి  ఇంకో విషయం  మీకు చెప్పాలి... నాకు స్వీట్స్ అంటే చాల ఇష్టం . ఎంత ఇష్టం అంటే పెరుగన్నం లో కూడా జిలేబి నంచుకుని  తినేంత అన్నమాట. దాంతో "అరె వరుణ్, ప్రసాదం బాగుంది రా. మనం ఇంకోసారి తీసుకుందామ ?", అని అడిగాను. "బాబు... నీకు ప్రసాదం నచ్చిందో, ప్రసాదం ఇచ్చే అమ్మాయి నచ్చిందో కానీ నాకు మాత్రం ఓపిక లేదు... నేను ఇక్కడే వుంటాను కావాలంటే నువ్వు వెళ్ళు ", అన్నాడు కరాకండిగా . ఇక చేసేదేమీ లేక నేనే వెళ్ళాను. ఆ అమ్మాయి నన్ను గుర్తు పట్టి “ You had  already taken the Prasadham right ?”, అని గద్దించింది .
ఆ హట్టాత్హు ప్రశ్న కి ఏం  సమాధానం చప్పాలో తెలియక "Ya... I had taken already, but it’s nice so I came again”, అంటూ నసిగాను .
Excuse me Sir; This is not 'Mid Day Meal' to have another time. I can’t give you",  అంది కోపంగా. అంతే ప్రక్కనున్న తొట్టి గ్యాంగ్  అంతా ఒక్కసారిగా పక్కున నవ్వేసారు. అస్సలు నాకైతే తల తీసేసినట్టు అనిపించింది . అప్పటి వరకు దేవత లా కనిపించిన ఆ రూపం దెయ్యం లా అనిపించింది. వెంటనే అక్కడనుంచి ఉక్రోషం తో బయటకు వచ్చేసాను . " అత్హ తిట్టినందుకు కాదు తోడి కోడలు చూసినందుకు అన్నట్టు ", నాకు ఆ అమ్మాయి తిట్టినందుకంటే తొట్టి గ్యాంగ్  నవ్వడం తో తట్టు కోలేకపోయాను. "అరె బాలరాజు... మీ పల్లెటూరు లా ఇక్కడ చేస్తే ఎలాగా! ముందే చెప్పాను మరి, కానీ నువ్వు వినలేదు ", అని వరుణ్ గాడు కూడా నవ్వడం తో... కసి గా బైక్  స్టార్ట్ చేసి దార్లో “Big Bazar” కి వెళ్లి రెండు కిలోల పంచదార, రెండు కిలోల బెల్లం తీసుకుని రూం కి వెళ్లి చెక్కర పొంగలి చెయ్యడం స్టార్ట్ చేశాను . అస్సలు పొంగలి లో బెల్లం వెయ్యాలా లేక  చెక్కర వెయ్యాలా అర్థం కాలేదు. మా వాడు ఏదో ఒకటి వెయ్యరా బాబు అన్నాడు... నేను వినను కదా... రెండు వేసి వంటకం చేశాను.
స్మెల్ చూడగానే మా వాడికి విషయం అర్థం అయిపోయింది. ఎవరో కాల్ చేసినట్టు మొబైల్ ని చెవి లో పెట్టుకుని   బాల్కనీ లోనికి వెళ్లి పోయాడు. తొక్కలో వాడు తినకపోతే నాకేంటి అనుకుని కొద్దిగా తిన్నాను... అంతే ఒంట్లో  ఏదో ల్యాండ్ మయిన్  పేలి నట్టు అనిపించింది, చెవిలో,  ముక్కు లో ఇంకా చప్పకూడదు కానీ నవ రంద్రాలలోను పొగ వచ్చింది. మరి ఒక గ్లాస్ బియ్యం కి రెండు కిలోల పంచదార రెండు కిలోల బెల్లం వేస్తే ఇలా కాక ఇంకేలా  వుంటది!!! ఇంతలో కిటికీ లోంచి వరుణ్ గాడు చూసి నవ్వడం తో నాకు ఒళ్ళు మండి పాత్ర లో వున్న వంటకం  మొత్హం  తినెసాను. కాస్త వికారం గా అనిపించడం తో  రిలాక్స్  అవుదాం అనుకుని చైర్ లో కూర్చుని  T.V. ఆన్ చేశాను . T.V.  తో పాటే కాసేపటికి  కడుపులో గడబిడలు ఆన్ అయింది . వెంటనే బాత్ రూం లోనికి పరుగేత్హాను . శనివారం రాత్రి  లోనికి వెళ్ళిన నేను ఆదివారం మొత్తం అక్కడే టైం పాస్ చెయ్యాల్సి వచ్చింది. లాస్ట్ మంత్ BARBEQUE NATION  లో టీం లంచ్ లో తిన్నధానితో మొదలుకుని  మొత్తం వచ్చేసింది. సోమవారానికి  కి కొద్దిగా కోలుకున్నాను. మంగళవారం కూడా  లీవ్ పెట్టి ఇంట్లో నే రెస్ట్ తీసుకున్నాను. కోమా లోంచి బయటకు వచ్చినట్టు  అనిపించింది . దాంతో బుధవారం ఆఫీసు కి వెళ్ళాను. వరుణ్ గాడి వళ్ళ మేటర్ మొత్తం మా టీం కి తెలిసిపోయింది. మెల్లగా  వెళ్ళి నా సీట్ లో కుర్చుని సిస్టం ఆన్ చేశాను. ఇంతలో కొలీగ్ తెలుగు అమ్మాయి సునీత గారు నాదగ్గరకు వచ్చి
" కాస్త కోలుకున్నట్టు కనిపిస్తున్నావ్ అర్జున్, ఇప్పుడు ఎలా వుంది?", అని అడిగింది నేను ఆన్సర్ చెప్పే లోపు  "అమ్మాయి కాదు బాబు , నీ హెల్త్ ?? ", అని వెటకారంగా అడిగింది. నేను కాస్త ఇబ్బంది గా నవ్వాను .
" హే ... జస్ట్ కిడ్డింగ్ డా... కాఫీ కి వెళ్దాం రా ", అంది .
కాఫీ పధం కూడా కాషాయం లా అనిపించి " మీరు వెళ్లి రండి... ఐ విల్ జాయిన్ యు లేటర్", అన్నాను. ఇంతలో మా మేనేజర్ ప్రవీణ్ దేశ్ పాండే నా దగ్గరకు వచ్చి "హౌ ఆర్  యు ఫీలింగ్ మిస్టర్ అర్జున్ ", అని అడిగాడు .
" ఫీలింగ్ బెటర్ ప్రవీణ్ ", అన్నాను. “Any ways I ll not assign you any work today. But can you do me one favour”, అని అడిగాడు . "Ya Sure", అన్నాను .
Few fresher’s cleared their first round of interview, so can you take technical round for them”, అని ఆగాడు .
అది పని కాదా బె Foot Ball తో Cricket అదే కంపునాయలా  అని మనసులో అనుకుని “Ya sure... I ll take that”, అని నవ్వుతూ చెప్పాను .
Be there at interview room, I ll send you the candidates”, అని వెళ్ళిపోయాడు. నేను మెల్లగా లేచి బారం గా ఇంటర్వ్యూ రూం లోనికి వెళ్ళాను. ఆల్రెడీ అక్కడ వున్న ఇంటర్వ్యూ కీ పేపర్స్  ని సరి చేస్తున్న టైం లో “May I come in Sir.”, అని ఒక స్వీట్ వాయిస్ విన్పించింది.
Please, Come in”, అని నవ్వుతూ తల ఎత్తి చూసాను. తౌసండ్ వాల్ట్స్ కరెంటు షాక్ కొట్టినట్టు అయింది నాకు. ఎదురు గా "అందాల రాక్షసి" నిలబడి వున్నది. పాపం నున్ను చూడగానే ఆ అమ్మాయి లో  ఆశ్చర్యం తో కూడిన  భయం కనిపించింది .
(సెకండ్ సీన్...)
Take your seat”, అని గర్వాన్ని నా కళ్ళతో చూపుతూ చెప్పాను. పాపం తడబడుతూ సీట్ లో కుర్చుని ఇబ్బంది గా నన్ను చూసింది. బాగా దురద పుట్టినప్పుడు గోక్కుంటే  ఎంత సమ్మగా వుంటదో నాకు అప్పుడు ఆ ఫీలింగ్  కలిగింది . బోన్ లో పడ్డ జింకను పులి చూసినట్టు చూసాను.

గమనిక: మొదటి కథ లాగా ఇది కల అనుకునేరు , మళ్ళీ  కల అంటే కాళ్ళతో తనను తారు నన్ను. ఇది కల కాదు...సో  మీరు  హ్యాపీ గా కథ లో ఇంవోల్వ్ అయిపోవచ్చు .

                                              [To be continued... తరువాయి బాగం  వచ్చే  సంచికలో]

1 comment: