Tuesday, August 28, 2012

అందమైన మనసులో... PART 7


అందమైన మనసులో...
                                       [బోలెడంత ప్రేమ - కొంచెం కన్నీళ్ళు ]                                                                                                                                                                                                                                                   
                                                                                                                             PART - 7


నేను కూడా చెమర్చిన కళ్ళను తుడుచుకుని,అలాగే ప్రక్కనున్న దిండుకు అనుకుని పడుకున్నాను.
పొదున్న నా కాళ్ళ మీద జానూ పడుకుని ఉండటం అమ్మ చూసి "ఏంటే... ఇంకా చిన్న పిల్ల అని  అనుకుంటున్నావా?కిట్టు  గాడి ఒల్లో పడుకున్నావ్!! ",అని అడిగింది.
"అబ్బో... మీ కిట్టు గాడిని నేనేమి కొరుక్కుని తినడం లేదులే అత్త... ఏదో నిద్ర రాలేదంటే వచ్చి కథ చెప్పాను...", అంది.
"చాల్లే కానీ... తొందరగా స్నానం చేసి రా బోగి మంటలు వేద్దాం", అని జాను ని పంపి,అలాగే పడుకునున్న నున్ను చూసి " పండగ పూట కుడా ఆ మొద్దు నిద్ర ఏంటి రా ?నువ్వు కూడా స్నానం చేసి రా",అని చెప్పి బోగి మంటలు ప్రిపేర్ చెయ్యడం కోసం వెళ్లి పోయింది. నేను రెడీ అయ్యి వెళ్ళాను. నేను బోగి మంటలు వేస్తుంటే జాను రంగు ముగ్గులు వేసింది. చాలా బాగుంది ముగ్గు. అందరూ ఎప్పటి లాగే వున్నారు,కాని నాకు మాత్రం చాలా ఏమ్బరేసింగ్ గా వుంది. పొడి పొడి గా మాట్లాడుతూ, ఇంట్లో తిరిగే వాడిని. అస్సలు జాను ని అయితే కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేక పోయాను. తను అబ్సేర్వ్ చేసి
"బావా,నిన్న జరిగిన సీన్ ఇంకా మనసు లో పెట్టుకున్నావా?",అని అడిగింది.
"జాను,నిజం గా నా మీద నీకు కోపం రాలేదా?",అడిగాను.
"నిజం చెప్పాలంటే,కోపం ఐతే వచ్చింది కాని...నీ మీద వున్న ప్రేమ కన్నా అది చాలా చిన్నది బావ. అందుకే లోపల భాధ వున్నా అంతగా చూపించ లేక పోయాను ",అని అంది.
"సారీ జాను...",అన్నాను.
"చ ఛ... నువ్వు...నాకు సారీ చెప్పడమేంటి బావ ?ఎప్పటికి నువ్వే నా హీరో వి. నువ్వెప్పుడూ హిమాలయాస్ అంత రేంజ్ లో వుండాలి. అయినా నిన్న నీ ఒడిలో పడుకుని ఏడ్చేసాను గా,సో సగం భాధ తగ్గి పోయింది, నువ్వు వెళ్లి పోగానే అన్నీ మరచిపోతాను",అంది. నాకు ఏమి మాట్లాడాలో అర్థం కాక మౌనం గా వుండి పోయాను.
"బావా నిజం గా నువ్వు తప్పు చెయ్యలేదు. అది నాకు తెలుసు. సో గిల్టీ గా ఎందుకు ఫీల్ అవుతున్నావ్? నువ్వు అలా మూడీ గా తిరుగుతుంటే నాకు ఏడుపు వస్తోంది. అలా వుండకు. ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు ",అని ఆగి "అడగటం మరిచా... నువ్వు అక్కీ ని లవ్ చేస్తున్నావ్, మరి ఎక్స్ప్రెస్స్ చేసావా?", అని అడిగింది.
"లేదు...",అన్నట్టు తల అడ్డం గా తిప్పాను.
"ఎందుకు చెప్పలేదు బంగారం?",అడిగింది కను బొమ్మలు ఎగరేస్తూ.
"తనకు చెప్పడానికి ధైర్యం చాల్లేదే, అందుకే చెప్పలేదు",అన్నాను సిగ్గు పడుతూ.
"ఓరి బడవ... ఇంట్లో చెప్పే ధైర్యం వుంది కాని తనకు చెప్పే ధైర్యం లేదు. సిగ్గు లేకుండా సిగ్గు పడుతున్నావ్... ప్రపోస్ చేసే ధైర్యం వుంటే ప్రేమించాలి లేకపోతే ప్రేమించ కూడదు బావ. అయినా నీకు ఏమి తక్కువని భయపడుతున్నావ్ ?నువ్వు ప్రపోసే చేస్తే ఎ అమ్మాయి కాదని చెప్పదు. ఫస్ట్ వెళ్ళగానే ధైర్యం గా చెప్పేసే ", అని వెన్ను తట్టింది.
"ష్యూర్ మేడం... నువ్వు చెప్పాక ఇక ఆగుతానా?ఇక అదే పని లో వుంటాను",అని కన్ను కొట్టాను.
జాను ఫ్రీ గా మూవ్ అవ్వడం తో నాకు హ్యాపీ అనిపించింది. తరువాత హాలిడేస్ ఎలా గడిచిందో తెలియకుండానే గడిచి పోయింది. ఈవెనింగ్ బెంగుళూరు కి భయలుదేరాను. జాను నా రూం కి వచ్చి "అల్ ది బెస్ట్ బావా... గుడ్ న్యూస్ అందరికన్నా నాకే ముందు చెప్పాలి. బాగా గుర్తు పెట్టుకో,అక్కీ కి ప్రపోస్ చేసేటప్పుడు మంచి గిఫ్ట్ ఇవ్వు. అది మేమోరెబుల్ గా వుండాలి. అలాగే తనని అడిగినట్టు చెప్పు ",అంది నవ్వుతు.
"ష్యూర్ జాను",అని తన నుదుటి మీద ముద్దు పెట్టి నా లగేజ్ తీసుకుని భయటకు వచ్చాను.
"అరె అర్జున్... నాకు నువ్వు,జాను రెండు కళ్ళు లాంటి వాళ్ళు,ఎవరు భాధ పడినా తట్టుకోలేను. అందుకే నిన్ను అలా తిట్టాను. జాను హ్యాపీ గా వుంది కాబట్టి,మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాస్త చెడు తిరుగుళ్ళు తిరగక,జగ్రత్హ గా వుండు",అన్నారు మా నాన్న గంభీరం గా.
"అలాగే నాన్న",అని అయన కాళ్ళ కు మొక్కాను.
"టైం కి బొంచేసి,పెందలాడే పడుకో నాన్న. ఆరోగ్యం జాగ్రత్హ",అని అమ్మ నుదుటి మీద ముద్దు పెట్టింది.
"అలాగే...",అని అందరికి బాయ్ చెప్పి భయలు దేరాను.

రూం కి రాగానే... నేను ఇంట్లో చెప్పాన?లేదా?ఒక వేల చెప్పి వుంటే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి అని వరుణ్ గాడు తెగ టెన్షన్ పడుతున్నాడు. నన్ను చూడగానే "ఏమయింద రా,ఇంట్లో చెప్పవా?",అని Curious గా అడిగాడు.
"హా చెప్పాను...",అని మొత్తం స్టొరీ వాడికి చెప్పాను.
"తంతే... తమన్నా ఒడిలో పడటమంటే ఇదేనేమో మామా... మొత్తానికి లైన్ క్లియర్ అయిపోయింది. ఇంకా నువ్వు తొక్కలో డైలాగ్స్ కొట్టి అక్కీ కి ప్రపోస్ చెయ్యడం లేట్ చేసావో, బాలయ్య బాబు రేంజ్ లో పుర్ర చేత్తో  కొడతా ...",అన్నాడు.
"ష్యూర్ రా... అయినా నేను మాస్టర్ ప్లాన్ తో వచ్చా. February 14th వస్తోంది కదా,సో ఆ రోజు తప్పకుండా  తనకు ప్రపోస్ చేస్తా ",అన్నాను కాన్ఫిడెంట్ గా.
"ఇంత జరిగి February 14th నువ్వు ప్రపోస్ చెయ్య లేదంటే February 15th నీకు చావే ",అన్నాడు.
ఇంతలో అక్కీ,వరుణ్ గాడికి కాల్ చేసింది. వాడు ఫోన్ చూసి "అరె మామా... అక్కీ నాకు కాల్ చేస్తోంది మాట్లాడు",అని నాకు ఇచ్చాడు.
"హే అక్కీ... ఎలా వున్నావ్?",అని అడిగాను.
"బుద్ధుందా నీకు... ?ఒక ఫోన్ లేదు,ఒక SMS  లేదు... నీ మొబైల్ ఏమయింది?కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యవు, మెసేజ్ కి రిప్లయ్ ఇవ్వవు,అస్సలు ఏమైంది నీకు !!!",అని తిట్టడం స్టార్ట్ చేసింది.
అక్కీ "మొబైల్...",అన్న తరువాత నాకు మొబైల్ గుర్తుకి వచ్చి చూసాను 82 Missed కాల్స్, 40 మెసేజెస్ వున్నాయి. ఓహ్... ఆ రోజు ఇంట్లో గొడవ పడినప్పుడు మొబైల్ నీ సైలెంట్ మోడ్ లో పెట్టాను తరువాత మరచిపోయాను.
"సారీ డ... ఇంటికి వెళ్ళినప్పుడు సైలెంట్ మోడ్ లో పెట్టి మరచిపోయాను...", అని కన్విన్స్ చేసే లోపు.
"కనీసం,ఇక్కడకు వచ్చిన తరువాత అయినా నాకు ఫోన్ చెయ్యాలి అనిపించలేదా నీకు ?నేను హార్ట్  అయ్యాను,నాతో మాట్లాడకు",అని ఫోన్ ని డిస్కనెక్ట్ చేసింది. తరువాత నేను ఎన్ని సార్లు ట్రై చేసి నా లిఫ్ట్ చెయ్యలేదు. రేపు ఆఫీసు కి వెళ్లి కన్విన్స్ చెయ్యొచ్చు లే అనుకుని పడుకున్నాను.
మరుసటిరోజు నేను వరుణ్ గాడితో కలసి ఆఫీసు కి వెళ్ళాను. లాంగ్ వెకేషన్ నుంచి రావడం తో అందరు గుంపులు గుంపులు గా మాట్లాడుకుంటున్నారు.
నేను అందరిని పలకరించి నేను తీసుకువచ్చిన స్వీట్స్ ని నా క్యుబికల్ పై పెట్టి “Sweets @ my Desk”, అని మెయిల్ పెట్టాను. అందరు వచ్చారు కానీ అక్కీ మాత్రం రాలేదు.
సీరియస్ గా వర్క్ చేస్తున్న అక్కీ కి "హే అక్కీ, సారీ డా...", అని Skype  లో పింగ్ చేసాను.
నో రిప్లయ్.
"అరె బాబా...నిజం చెబుతున్నాను గా, ని కాల్స్ చూడలేదు కాబట్టే నేను ఫోన్ చెయ్యలేదు", అన్నాను.
ఇసారి రెస్పాన్స్ గా రెండు యాంగ్రీ స్మైలీ  రిప్లయ్ గా ఇచ్చ్చింది.
"Hey... This is too much . ఇది ఆఫీసు కాబట్టి సరిపోయింది, లేదంటే...",అని ఆపాను
లేదంటే ఏం చేసుంటావ్ అన్నట్టు “Wondering”  స్మైలీ ని రిప్లయ్ చేసింది.
"లేదంటే ఏమిచేస్తాను,నా తప్పు కి గుంజిళ్ళు తిసుంటాను",అన్నాను. తను వెనక్కు తిరిగి పక్కు నవ్వింది. నేను నా చేతులను చెవి పై పెట్టుకుని కుర్చిలోంచే గుంజిళ్ళు తిస్తున్నట్టు తనను చూసి యాక్ట్ చేసాను. తను "నీ భక్తికి మెచ్చి,ప్రసన్నురాలిని అయ్యాను" అన్నట్టు కళ్ళతో అభయం ఇచ్చింది. ఇదంతా ఎవరూ  గమనించకుండా మేము రెప్పపాటు లో చేసాం.
మా వర్క్ అప్లికేషన్ కుడా ఓపెన్ చెయ్యకుండా,చాట్ చేసుకుంటూనే ఉండిపోయాం.
ఇంతలో అక్కీ నా దగ్గరకు వచ్చి "ఏం చేస్తున్నావ్ ఆర్జూ ?",అని అడిగింది.
"ఓహ్... నువ్వే వచ్చావ !!! ని చాట్ కి రెప్లి ఇస్తున్నా",అన్నాను.
"లంచ్ ప్లాన్ ఏంటి? ఎవరితోయినా వెళ్తున్నావా?", అడిగింది.
"లేదు లేదు... నీ కోసమే వెయిటింగ్ ", అన్నాను.
"భ్రతికి పోయావు... ఎవరితో అయినా వెళ్తున్నాను అని చెప్పి వుంటే నీ పీక పిసికి  ఇక్కడే చంపెసేధాన్ని", అంది కొంటెగా గా నవ్వుతూ.
"అమాయక ప్రాణులను చంపడానికి నీకు మనసు ఎలా వస్తోంది అక్కీ ?", అన్నాను.
"అయ్యో రామ... నువ్వు అమాయకుడేంటి, ఎవరన్నా  వింటే  నవ్వుతారు", అంది. నేను లంచ్ కి రావడం లేదని వరుణ్ గాడికి చెప్పి అక్కీ తో ఫుడ్ కోర్ట్ కి వెళ్ళాను. మా ఫుడ్ కోర్ట్ లో చాలా రెస్టారెంట్స్ వున్నాయి.
"అర్జు... ఏ రెస్టారెంట్ కి వెళ్దాం?",
"నా ఫేవరేట్ “Hyderabadhi Resturent”, కి", అన్నాను.
లంచ్ అవ్వగానే ఆఫీసు కి వెళ్ళాం. వర్క్ కుడా పెద్దగా లేక పోవడం తో తొందర గానే భయలుదేరాను.
"హే అక్కీ, నాకు కొద్దిగా వర్క్ వుంది, తొందరగా వెళ్తున్నాను. రేపు మార్నింగ్ కలుద్దాం", అన్నాను.
"ఏంటి బాబు విషయం, బాగా బిజీ అయిపోయినట్టు వున్నావ్, ఎవరన్న అమ్మాయి ని పడేసావా  ఏంటి?", అంది కన్ను కొట్టి.
"నాకు అంత లేదు మేడం...వరుణ్ గాడు షాపింగ్ చెయ్యాలి అంటే వెళ్తున్నాను ", అన్నాను.
"ఓకే లే ఐతే, బట్ రేపు మార్నింగ్ నాతోటే రావాలి ఆఫీసు కి", అంది.
"ష్యూర్  డా, రేపు మార్నింగ్ కలుద్దాం", అని చెప్పి నేను వరుణ్ గాడు భయలుదేరాం.
"నేను షాపింగ్ కి  ఎప్పుడు పిలిచాను రా నిన్ను?? ",అడిగాడు వరుణ్.
"అక్కీ కి గిఫ్ట్ కొందామని అలా చెప్పాను రా", అన్నాను
"ఓహ్ ఓకే. ఐతే ఏమి గిఫ్ట్ కొంటున్నావు ?",
"Feb 14th కి Dimond  Ring ఇవ్వాలి అనుకుంటున్నాను ",అని చెప్పి బైక్ స్టార్ట్ చేసాను. చాలా గోల్డ్ షాప్స్ తిరిగి చివరకు "నక్షత్ర డైమండ్స్ ", కి వెళ్లి మంచి రింగ్ కొన్నాను. చాలా బాగుంది రింగ్. గిఫ్ట్ ప్యాక్ చేసాను. తరువాత "Archies "కి వెళ్లి మంచి గ్రీటింగ్ కార్డు సెలక్ట్ చేసాను. తరువాత రూం కి వెళ్ళిపోయాం. మా వరుణ్ గాడికి ఫుల్ గా కాన్ఫిడెంట్ వచ్చింది నా మీద.
మరుసటి రోజు నేను అక్కీ తో కలసి ఆఫీసు కి వెళ్ళాను. ఇంకా తన ఇష్టాలు తెలుసుకుని పక్కా గా ప్రిపేర్ అయ్యాను.
మనం అనుకున్నదంతా జరిగి  పోవడానికి, నేను  "ఖలేజా" లో రాజు నో లేక "బిజినెస్ మాన్" లో సూర్య నో కాదు కదా. కష్టాలు పెట్టకుంటే దేవుడిని మరచిపోతారనుకున్నారేమో కాని, ఆయన  వున్నారని చెప్పడానికి ఏదో ఒక ట్విస్ట్ పెడుతాడు గా.
నేను సీరియస్ గా వర్క్ చేస్తుంటే, మా రిసోర్స్  మేనేజర్ కాల్ చేసాడు.
“Hey Arjun, come to Board room man”,  అన్నారు.
“Sure Praveen”,  అని నా సిస్టం ని లాక్  చేసి బోర్డు  రూం కి వెళ్ళాను. అక్కడే మా రిసోర్స్  మేనేజర్  ప్రవీణ్, ఇంకా  ప్రాజెక్ట్ మేనేజర్ జెఫ్ థామ్సన్ వున్నారు.
“Good Morning Thomson & good morning Praveen”, అని ఇద్దరికి విష్ చేసి సీట్ లో కూర్చున్నాను.
Very good morning Arjun. Hope you enjoyed the festival at home”, అన్నారు థామ్సన్.
“Vacation ll always be good Thomson”, అని నవ్వాను.
“Hmmm... good. I have good news to share with you that you are selected to come to US with me” ,అని ఆగారు. నాకైతే L.K.G. వయసులో ఏనుగెక్కి స్వారి చేసినంత ఆనందం వేసింది. పౌర్ణమి రోజు కనిపించే చుక్కలంతా నా మొహం లోనే ఉందేమో  అనేంత గా  వెలిగి పోతోంది.
“Also it’s a long term plan, might be 2 years or more. So you have to decide & inform me by end of the day”, అన్నారు. సరే అని చెప్పి ఆనందం గా భయటకు వచ్చాను. సాఫ్ట్ వేర్ లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరి కల  US కి ఆన్సైట్ వెళ్ళడం. నేను 4 years కష్ట పడితే కాని దొరకలేదు. అది కుడా లాంగ్ టర్మ్. రెక్కలు లేకుండానే గాలిలో తిరుగుతున్నాను. నేను వెంటనే మా నాన్న గారి కి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆయన హ్యాపీ గా ఒప్పేసుకున్నారు. అలాగే అమ్మకి, జాను కి కుడా చెప్పాను. వాళ్ళు చాలా  హాపీ గా వున్నారు. ఇంతలో అక్కీ అక్కడకు వచ్చి "ఏంటి బాస్ అంత హుషారు గా వున్నారు ?", అని అడిగింది.
"హే అక్కీ , నాకు ట్రావెల్ కన్ఫర్మ్  అయ్యింది డా, అది కుడా లాంగ్ టర్మ్ ", అన్నాను  ఆనందం గా
“wow sounds superrrr... then you have to give Biggggggg treatttttttt”, అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. తరువాత వరుణ్ గాడి తో పాటు మా టీం అందరికి చెప్పాను. ఈవెనింగ్ మా మేనేజర్  రూం కి వెళ్లి నాకు ఓకే అని చెప్పాను.
“Good yaar. One more thing I forgotten to inform you that this weekend itself we have to travel”, అన్నారు థామ్సన్. WTC టవర్స్ లా కుప్ప కూలిపోయింది నా ఆనందం. అక్కీ ప్రపోస్ చెయ్యాలని  full ప్లాన్ లో వుంటే, ఇప్పుడు వచిన్న ఈ గోల్డెన్ ఆఫర్ కి హ్యాపీ గా ఫీల్ అవ్వాలో లేక భాధ పడాలో అర్థం కాకా బ్లాంక్ ఫేస్ పెట్టాను.
“What happen Arjun, R U comfortable in travelling this weekend? ”, అన్నారు నన్ను చూసి థామ్సన్.
“Ya, but only 5 days rite. So need to pack up many things Thomson... ”, అన్నాను.
“No issues Arjun. You can take leave for 3 days. But try to submit your Passport tomorrow & we ll complete all the formalities ”, అన్నారు నా భుజం  తట్టి.
“Sure Thomson, thanks ”, అని అక్కడ నుంచి భయట పడ్డాను.
అక్కీ కి విషయం చెప్పాను. తను ఫస్ట్ ఎంత హ్యాపీ ఫీల్ అయిందో ఇప్పుడు అంత డల్ గా ఫేస్ పెట్టి "అంటే  5 Days లో నువ్వు  US కి వెళ్ళిపోతున్నావా?", అని నా అరచేతి పై తన చూపుడు వేలి తో ముగ్గు వేస్తూ  అడిగింది. ఆ 5 Days  అన్న మాట వినగానే నా గుండెలకి ఏదో బలం గా తగిలినట్టు అయింది.
"అదే నాకు భాధ గా వుంది రా. కాని ఇటువంటి చాన్స్ మళ్లీ రాదు కదా అక్కీ అందుకే ఓకే అనేసాను", అన్నాను.
"సరే ఐతే. కాని ఒక్క కండిషన్, ఈ 5 Days నాతోటే వుండాలి", అంది అర్తిస్తున్నట్టు.
"సరే అక్కీ", అని తనని P.G. దగ్గర డ్రాప్ చేసి నేను నా రూం కి వెళ్ళిపోయాను.
వరుణ్ గాడు నన్ను చూసి " ఎంజాయ్ చెయ్యాల్సిన టైం లో ఇలా డల్ గా వున్నావు ఏంట్రా ?", అని అడిగాడు.
"అక్కీ ని వదిలి పెట్టి వెళ్ళాలంటే భాధ గా వుంది రా. అదీ కాక తనకు ప్రపోస్ చెయ్యాలి అని ప్రిపేర్ అవ్వడం అంతా వెస్ట్ అయిపోయింది", అన్నాను దిగాలుగా ఫేస్ పెట్టి.
"అరె, అక్కీ కి కావాలంటే నువ్వు  US  కి వెళ్ళిన తరువాత అయినా ఫోన్ లో చెప్పవచ్చు, బట్ ఇలాంటి చాన్స్ మళ్లీ మళ్లీ రాదు", అని కన్విన్స్ చేసాడు. నాకు కరెక్టే అనిపించిది. ఇక వున్నది  5 Days మాత్రమే కావడం తో  ఇంట్లో వాళ్ళను రమ్మని చెప్పాను. మరుసటి రోజు అందరూ వచ్చేశారు.
ఆ రోజు ఆఫీసు కి వెళ్లి నా పాస్ పోర్ట్ సబ్మిట్ చేసి అన్ని ఫార్మాలిటీస్ ముగించి తొందరగా తిరిగి వచ్చేసాను. ఆ రోజుటి  నుంచి నేను చాలా బిజీ అయిపోయాను. వీసా ఫార్మాలిటీస్, గ్రాసరీ  షాపింగ్, లగేజ్   ప్యాకింగ్ ఇలా చాలా బిజీ అయిపోయాను. ఎంత బిజీ అంటే అక్కీ ఫోన్ చేసినా రిసీవ్ చెయ్యలెంత బిజీ అయిపోయాను. నాకూ ఒక  ప్రక్క భాధ గా వుంది కాని ఏమి చెయ్యలేని సిచువేషన్. అప్పటికి రెండు సార్లు తనని  కలిసాను. కలసినప్పుడు ఇంతక ముందు లాగా  హాపీనెస్ లేదు. తొందరలో మేము విడి పోవాల్సి వస్తుందని  తెలిసి  ఏమి మాట్లాడ లేకపోయే వాళ్ళం. కలసిన అరగంట టైం లో ఇద్దరం నేల  చూసే వాళ్ళమే కాని ఒకరి కళ్ళలో ఒకరు చూసేవాళ్ళం కాదు. మౌనం ఎంత భయంకరమయిన భాధ కలిగిస్తుందో అప్పుడు నాకూ అర్థం అయింది.
చూస్తూ ఉండగానే  5 Days  కరిగిపోయాయి. ఇక  నేను ట్రావెల్ చెయ్యాల్సిన రోజు రాణే వచ్చింది.
వరుణ్ గాడు నాకు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. 
మా అమ్మ నాకిష్టమయిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసింది. అమ్మ, నాన్న, జాను అందరు చాలా హ్యాపీ గా వున్నారు నేను  US కి వెళ్తుంటే, కాని నాకు మాత్రం చాలా భాధ గా వుంది.
"ఏమైంది రా కిట్టయ్యా?", అని అడిగింది అమ్మ .
"ఏమిలేధమ్మ, మొదటిసారి కదా, కాస్త టెన్షన్ గా వుంది", అన్నాను. నా గుండెల్లో ని భాదని అమ్మకు చెప్పలేను కదా.
నైట్ 10.30 PM కి నా ఫ్లైట్. మేము 7.00 PM కల్లా ఎయిర్ పోర్ట్  కి చేరిపోయాం. నేను అందరితో మాట్లాడుత్నా... నా కళ్ళు మాత్రం అక్కీ నే వెతుకుతున్నాయ్. అక్కడ గడుస్తున్న ఒక్కో నిముషం - ఒక్కో యుగం లాగ అనిపిస్తోంది. 8.30 PM కి అక్కీ వచ్చింది. అక్కీ ని చూడగానే కోపం తో "బుద్ధుందా నీకు, ఇంత లేట్ గా వచ్చావ్? నీ కోసం ఎంత సేపటినుంచి వెయిట్ చేస్తున్నాను నేను ??",అని అరిచాను.
"అరె బాబు నేను ఒక్కసారే లేట్ చేసాను, కాని నువ్వు ఎన్ని సార్లు లేట్ చేసున్టావో గుర్తుకి తెచ్చుకో ", అని గద్దించింది.
"అస్సలు నిన్ను కలవకుండా వెళ్ళిపోతానని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ", అన్నాను.
"నేను సెండ్ ఆఫ్ ఇవ్వకుండా నువ్వు ఎలా వేల్తావని అనుకుంటున్నావ్!!!", అంది. ఇంతలో మా అమ్మా, నాన్న, జాను లకు అక్కీ ని పరిచయం చేసాను. అందరూ అక్కీ తో బాగా మాట్లాడారు. వర్షం వచ్చే లాగా వుండటం తో కాసేపటికి అందరూ భయలుదేరారు అక్కీ తప్ప.
నేను అందరికి నవ్వుతూనే Bye  చెప్పాను, కాని,అంతే ఆనందం గా నా అక్కీ కి చెప్పగలనా. అస్సలు అక్కీ ని వదిలి వెళ్తున్నాను అన్న ఆలోచన మనసులోకి వస్తుంటేనే ఏదో తెలియని భాధ. ప్రపంచం లో వున్నది మేమిద్దరమే అన్నంత ఆనందం గా గడిపిన రోజులను జ్ఞాపకాలుగా తీసుకుని వెళ్తున్నాను, ఆ బంగారు క్షణాలను వదలి వెళ్తున్నాను, నాకు దేవుడు ఇచ్చిన అందమయిన బహుమతి లాంటి ఫ్రెండ్ ని వదలి, అక్కీ పంచె ఆ ప్రేమ,వాత్సల్యాన్ని ఇక్కడే వదలి శూన్యం లోనికి వెళ్తున్నాను. నాకు ఏమి మాట్లాడాలో తెలియక మౌనం గా ఉండిపోయాను. అక్కీ నా ఎడమ చేతిని తన చేతిలోనికి తీసుకుని, "ఇది నా గిఫ్ట్", అని ఫాస్ట్ ట్రాక్ వాచ్ చేతికి కట్టి "నువ్వు టైం చూసుకున్న ప్రతి సారి నేను గుర్తుకి రావాలి", అని చెప్పింది.
ప్రతి సారి కాదు అక్కీ ,ప్రతి క్షణం,ప్రతి సెకను,శ్వాస తీసుకున్నా,శ్వాస వదిలినా,నిద్ర పోయినా,మేల్కున్నా నిన్ను మరచిపోలేను అని చెప్పాలన్నా,నోరు తెరిస్తే మాటల కన్నా ముందు కన్నీళ్ళు వస్తాయని ఊరుకున్నా. అస్సలు అక్కీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక పోయాను. తన కళ్ళను చూస్తే నా గుండెల్లో దాచుకున్న భాదంతా ఒక్కసారిగా వచ్చేస్తుందేమో అని నేల వైపే చూస్తుండి పోయాను. ఆ రెండు గంటలు రెండు క్షణాల్లా గడచి పోయింది.
మొదటి అనౌన్స్మెంట్ ఇచ్చారు. నా గుండెల్లో వేగం పెరిగింది.
"ఏమయింది ?ఏమి ఆలోచిస్తున్నావ్ ?",అడిగింది .
ఏమి లేదు అన్నట్టు తల ఊపాను. అక్కీ ని వదలి వెళ్తున్నానన్న  భాధ ఎలా వుంది అంటే ఎవరో నా కళ్ళ ముందే నా గుండెకాయను భయటకు తీసి ముక్కలు ముక్కలు గా కోసినంత భాధ వేస్తోంది. నా పాస్ పోర్ట్ ని చించి మా మేనేజర్ మోహన కొట్టి “I don’t want the ****ing onsite... ", అని చెప్పాలన్నంత  కోపం వేసింది. మాములుగా అబ్భాయిలు ఏడవరు అంటారు అది నిజమే ఏడవరు కాని ఏడుస్తారు,మనసులోనే ఏడుస్తారు,కన్నీళ్ళు కనపడ కుండా  ఏడుస్తారు,ఆ భాధ ను,ఆ నొప్పిని భరిస్తూ గుండెల్లోనే రోదిస్తారు. గుండెల్లోంచి కన్నీళ్ళు కట్టలు తెంచుకుని నా కళ్ళ   ద్వారా భయటకు వచ్చిన ఆ  కన్నీటి చుక్క అక్కీ పాదాల మీద పడింది .
నా చేతిని గట్టిగా పట్టుకుని "ఏడుస్తున్నావా అర్జు ! ఏమి కాదు,ధైర్యం గా ఉండు",అని చేతిని గట్టిగా పట్టుకుంది.
"సారీ నేను కాస్త ఎమోషన్ అయ్యాను",అని కన్నీళ్లను తుడుచుకున్నాను.
లాస్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఒక్కమాట కుడా మాట్లాడకుండా పైకి లేచాను. అక్కీ కుడా లేచి నిలబడింది.
"Bye అర్జు", అంది తడబడుతూ. తన బుగ్గ ల పై నుంచి కన్నీళ్ళు భయటకు వచ్చాయి.
లాస్ట్ టైం అన్నట్టు తన కళ్ళలోకి  చూసాను, తన బొమ్మ ను నా గుండెల్లో పదిలపరచుకుని  నా జేబులో దాచుకున్న 5  Star ని ఇచ్చి,  అక్కీ ని గట్టిగా కౌగలించుకుని, నా ప్రాణాన్ని, ఆత్మ ని, మనస్సుని ఇక్కడే వదలి,  నా లగేజ్ తీసుకుని వెనక్కు కుడా తిరగకుండా నడిచాను. ఎందుకంటే, అక్కీ చూస్తే ఇక నేను వెళ్ళలేను.
నా లైఫ్ లో ఇటువంటి  రోజు ఒకటి వస్తుందని కలలో కుడా అనుకోలేదు. నిజం చెప్పాలంటే ఇటువంటి భాధ నా శత్రువు కుడా పడకూడదు.

Bye Bye Mother India...

అప్పుడే అయిపోలేదు... ఇంకా చాలా కథ వుంది ... Stay Tuned

4 comments:

  1. Hi Vicky,
    miru tittle ki caption bholedantha prema konchem kannillaki toduga inkonchem tenstion ani kuda add cheyyandi...... prathi part ki edho okati peduthunnaru..... mundhu partslane idhi kuda chalaa bhagundhi premani manasulone daachukoni normalga behave cheyyadamanedhi chala kastam.... dhinini miru bhaga varnincharu.....

    ReplyDelete
    Replies
    1. Thanks Paddu...

      Prathi part ki miru marachipokundaa comments peduthunnaru. seriously i am very happy for that.

      Vicky

      Delete
  2. Vicky...Vicky...Vicky
    Really gaa miru story ni chalaa chalaa baga narrate chesthunnaru. Premikula madhya gap ni, vallu vidipothunnapudu pade badha ni chala bagaa varninchaaru. I am really impressed :)
    Paina Paddu comment 100% correct.

    Miru mundhe chepparu... "Koncham kannellu", ani, mata thappakudadhu. Tamil movies lagaa sad ending matram pettakandee.

    Shurthi

    ReplyDelete
  3. Vikram Garu, ....

    Arjun ni US ki pampi 1.5 years aindi... inka india ki piluchukuvacche alochanalemina unnaya...

    Konchem oopika chesukoni ee fans kosam katanu continue cheyyandi..


    Pls continue the story...


    Thanks in Advance :D

    ReplyDelete