Friday, August 3, 2012

అందమైన మనసులో...PART - 6


  అందమైన మనసులో...
                                       [బోలెడంత ప్రేమ - కొంచెం కన్నీళ్ళు ]                                                                                                                                                                                                                                                   
                                                                                                                             PART - 6


ఇంతలో...వరుణ్ గాడు ఫోన్ చేసాడు. రూం కే వెళ్తున్నాం కదా అని కట్ చేశాను. బైక్ పార్క్ చేసి రూం లోకి ఎంటర్ అయ్యాను, పాపం వరుణ్ గాడు నాకోసమే వెయిట్ చేస్తున్నాడు. నన్ను చూడగానే "ఏంట్రా ఇంత లేట్ అయింది ", అని అడిగాడు. నేను చెప్పబోయెంత లో "బాగా టైయర్డ్ గా కనిపిస్తున్నావ్, వెళ్లి పడుకో... రేపు మాట్లాడుకుందాం", అని వాడు రూం లోకేల్లి పడుకున్నాడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్లి పడుకున్నాను. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. లేచి వెళ్లి DVD ప్లేయర్ ఆన్ చేసినా ఫేవరేట్ ప్లేస్ అయిన బాల్కనీ లో ఈజీ చైర్ వేసుకుని కూర్చున్నాను. 

దూరం
గా ఆకాశం లో నిండు చంద్రుడు,
హాయి గా వీస్తున్న చల్లటి గాలి, 
గాలి కి కదులుతూ నాకు చంద్రుడికి మధ్య లో ఊగుతున్న మామిడి చెట్టు కొమ్మలు,
ప్రకృతి కన్నా మధురం గా వినిపిస్తున్న వేటూరి - ఇళయరాజా గారి పాటలు

ఇది చాలు రా జీవితానికి అన్నట్టు Relax గా కళ్ళు మూసుకున్నాను. నిజం గా నా జీవితం లో ఈరోజు Golden Day  లాంటిదే. ఎందుకంటే రోజు మొత్తం నేను అక్కీ తోటే గడిపాను, తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో అంత కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ హ్యాపీ గా నేను ఫీల్ అయ్యాను. అలా ఈరోజు జరిగిన ప్రతి సన్నివేశాన్ని నెమరు వేసుకుంటూ... అందమయిన  ఊహలలోనే  నిద్రలోకి జారుకున్నాను.
"అరె అర్జున్...టైం 8 అవుతోంది లేయ్యరా", అని వరుణ్ గాడు నన్ను కదపడం తో నేను మేల్కున్నాను. ఆకాశం లో చంద్రుడు ఉండాల్సిన ప్లేస్ లో సూరీడు వుండటం తో ప్రొద్దున అయిందని అర్థమయ్యింది.

"కాఫీ చేశాను తీసుకో ", అని కాఫీ కప్పు ఇచ్చాడు నా ప్రక్కన చైర్ వేసుకుని కూర్చుంటూ.

నేను కాఫీ కప్పు ని తీసుకుని ఆకాశం వైపే చేస్తూ కాఫీ ని తాగుతున్నాను.

"అరె నువ్వు నిన్న అక్కీ కి లవ్ express  చెయ్యలేదు కదా!!! ", అని అడిగాడు.

"అవును మామ... నువ్వు ఎలా గెస్ చేసావ్!!!", అడిగాను ఆశ్చర్యం గా.

"మైకేల్ జాక్సన్ కి - త్యాగ రాజు కీర్తనలు పాడటమెంత కష్టమో నీకు ని లవ్ ని express చెయ్యడం కుడా అంతే కష్టం అని నాకు తెలుసు రా", అని ఆపి..,"అయినా నువ్వు attempt చేసావ్ కదా, అది నాకు నచ్చింది", అన్నాడు.

"అక్కీ కి నా ప్రేమ విషయం చెప్పలేదన్న బాధ తప్ప...నిన్నంతా చాలా హ్యాపీ గా గడిచిపోయింది రా ", అన్నాను ఆనందం గా.

"ప్రేమికుడు మొదటిసారే తన ప్రేమ ను  express చెయ్యటం అన్నది చరిత్ర లో లేదు", అని రజనీకాంత్ లా డైలాగ్ కొట్టి "ఫస్ట్ attempt సక్సెస్స్ ఫుల్ గా ఫెయిల్ అయింది కాబట్టి, ఇక వారాలు, వర్జాలు చూసుకోకుండా, నువ్వు ఎప్పుడు confident గా వుంటే అప్పుడే చెప్పేసెయ్", అన్నాడు.

మాటలకూ నాకు కాస్త దైర్యం వచ్చింది.

అక్కీ బర్త్ డే అంటే నిన్న September 27 నుంచి  దీపావళి, దసరా, January 1st  ఇలా ఒక్కటేమిటి ప్రతి ఫెస్టివేల్  ప్రతి అకేషన్, ప్రతి వీక్ ఎండ్, ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి సెకను అక్కీ కి express చెయ్యాలి అని అనుకోవడం, తడబడటం, ఆగిపోవడం. ఇదే తంతు. నిన్న పడ్డ వర్షం తో మొదలుకుని నెక్స్ట్ అమెరికా ఎలక్షన్స్ లో ఒబామా గెలుస్తాడా లేడా అనే మాటలు కూడా మాట్లాడుతాను కానీ “I LOVE YOU” అనే అందమయినతేలికయిన పదాన్ని మాత్రం నేను చెప్ప లేకపోయానురోజు రోజు కి తనతో చాలా క్లోజ్ అయిపోతున్నాను At the same time తనకు express చెయ్యలేనేమోనని భయం కూడా పెరిగిపోతోంది.


నేను ఎప్పు డెప్పుడు అక్కీ కి నా ప్రేమ విషయం చెబుతానా అని నాకంటే మా ఫ్రెండ్స్ కి, ఆఫీసు కొలీగ్స్ కి చాలా క్యురియాస్ గా వుంది, ఎందుకంటే మా పెయిర్ చూడటానికి ఎంత అందం గా ఉంటామో అంతే రెస్పెక్ట్ గా కూడా వుంటాం. అంటే ఎక్కడా మేము మా లిమిట్స్ దాటము. నేను - అక్కీ మాత్రమే ఉన్నప్పుడు చాలా క్లోస్ గా వుంటాం అదే మూడో వ్యక్తి వుంటే మా హద్దుల్ని దాటం. ఆఖరకు  వరుణ్ గాడి ముందు కుడా చాలా జెంటిల్ గా మూవ్ అవుతాం. అప్పుడే మనం వాళ్ళకు  వాల్యు ఇచ్చినట్టుమా ఆఫీసు లో కొంత మంది ఎలా ఫీల్ అవుతారు అంటే ప్రపంచం లో వాళ్ళకన్నా క్లోస్ గా మరెవ్వరూ వుండరు  అన్నట్టు కొట్టుకోవడం, తోసుకోవడం చేస్తుంటారు. అది అందరు చూస్తుంటే మరీ ఓవర్ చేస్తారు. చూసే వాళ్ళకు ఎంత ఏమ్బరేసింగ్ గా ఉంటుందో అని కూడా పట్టించుకోరు. విషయం లో మేము చాలా కరెక్టుగా వుండటం తో మా పెయిర్ అంటే అందరికీ చాలా రెస్పెక్ట్.


"అరె భాలయ్య బాబు... నీ ప్రాబ్లం ఏంటి రా ? అక్కీ కి నీ ప్రేమ విషయం  చెప్పడానికి నీకు  ఎందుకంత భయం !!! ", సీరియస్ గా అడిగాడు వరుణ్.

"అదే తెలియటం లేదు రా... తనను నేను ఎంత కావాలని  అనుకుంటున్నానో, తను లేకపోతే భతకలేనేమోనని కూడా భయం పట్టుకుంది రా... తను నన్ను 99.99 % లవ్ చేస్తోంది అనుకుందాం కాని మిగిలిన 0.01% ని చూస్తే నే భయం గా వుంది రా.  0.01% చాన్స్ ని కూడా నేను తీసుకోదలచు కోలేదు రా ", అన్నాను చాలా నిరాశగా.

నా పరిస్థితి వాడికి అర్థం అయ్యి కూల్ గా నా ప్రక్కన కుర్చుని "అర్జున్... నువ్వు మంచి వాడివి రా, నీకు చెడు జరగదు. నన్ను నమ్ము ", అని ఆగి "సరే ఒక పని చేద్దాం, నీకు express చెయ్యడానికి భయం గా వుంది కదా... అయితే నేను వెళ్లి అక్కీ తో మాట్లాడుతాను", అన్నాడు.

"వద్దు రా... మా మధ్యలో మూడో వ్యక్తి ని ఇంటర్ఫియరెంస్ నాకు ఇష్టం ఉండదు ", అని వాడి ప్రక్కనుంచి లేచి నిలబడ్డాను.

"ఇది బాగుంది రా... నువ్వు చెప్పవు, నన్ను చెప్పనివ్వవ్వు. సినిమా లో లా క్లైమాక్స్ ఎపిసోడ్ లో నువ్వు రన్నింగ్  ట్రైన్ లోంచి దూకితే తను పరుగెత్తుకుని వచ్చి కౌగిలించు కోవడానికి  ఇది సినిమా కాదు రా... రియల్ లైఫ్, అది మాత్రం మరచి పోకు ", అన్నాడు చాలా కోపం గా. మాటకు నా వద్ద నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయే సరికి

"నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి రా నిన్ను ఇలా చూడలేక పోతున్నాను. సరే నాకు తెలిసినంత వరకు ఇక నీకు వున్నది ఒకే ఆప్షన్... డైరెక్ట్ గా అక్కీ చెప్పలేవు కనుక, నువ్వు ఫస్ట్ మీ ఇంట్లో చెప్పు, వాళ్ళను కన్విన్స్ చెయ్యగలిగితే కాన్ఫిడెన్స్ తో అక్కీ కి ని లవ్ ని express చేయొచ్చు", అన్నాడు. నాకు అది కరెక్టే అనిపించడం తో "సరే...", అన్నాను.

"ఐతే... సంక్రాంతి కి ఇంటికి వెళ్తున్నావ్ గా, అప్పుడు కూల్ గా మొత్తం మ్యాటర్ చెప్పేసే. కాని ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో, ఇంట్లో వాళ్ళు ఎంత కోప్పడినా, తిట్టినా నువ్వు మాత్రం టెన్షన్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా వాళ్ళను కన్విన్స్ చెయ్", అన్నాడు 

సంక్రాంతి పండక్కి ముందు రోజు ప్రొద్దునే ఇంటికి వెళ్ళాను.

"ఏంట్రా కిట్టయ్య ఇంత చిక్కి పోయావు... తినడం లేదా?", రొటీన్ Question వేసింది అమ్మ.

"నీ కంటికి నేను అలాగే  కనిపిస్తానమ్మా ... కాని బొజ్జ పెరిగి పోయి అమ్మాయి నా వైపుకి చూడటం లేదే", అన్నాను.

"అందుకే బైక్ మీద అడ్డమయిన తిరుగుళ్ళు తిరగక,  Jim  కో లేక స్విమ్మింగ్ కో వెళ్తే బాడి మన కంట్రోల్ లో వుంటుంది", అంది జాను.

"నా కిట్టు గాడికేంటే...చక్రవాకం సీరియల్ లో హీరో లాగున్నాడు. Jim కో ఇంకా దేనికో వెళ్ళాల్సిన ఖర్మ వాడికేంటే", అని గట్టిగా అంది మా అమ్మా.

"ఆ పోలికేంటే అమ్మా... పోలిస్తే సినిమా హీరో తోనో లేక క్రికెటర్ తోనో పోల్చాలి తప్ప... వాడెవడో ముసలోడితో నన్ను పోల్చడం ఏంటే", అన్నాను.

"ముందే చెబుతున్నాను బావా... కేర్ తేసుకోలేదంటే అత్తయ్య చెప్పినట్టే సీరియల్ లో హీరో - ముసలోడి లా తయారయి పోతావ్ ", అంది పళ్ళు ఇకలిస్తూ.

"ఒరే నాన్నా... నీకు సీరియల్ నచ్చ లేదంటే నచ్చ లేదని చెప్పు, అంతే కాని  వాడిని మాత్రం తిట్టకు కళ్ళుపోతాయ్, అసలే వాడు పుట్టెడు కష్టాలో వున్నాడు ", అంది అమ్మ భాధ పడుతూ.

వాడు కష్టాల లో వుండటమేంటో నాకు అర్థం కాలేదు, ఇక హీరో ని  ఏదయినా అంటే అమ్మ కన్నీళ్ళు పెట్టుకోవడం గ్యరెంటి అని అర్థం అయ్యి  "నీకింకా సీరియల్ పిచ్చి పోయినట్టు లేదే, సరే కాని నాకు తినడానికి ఏదయిన ఇస్తే తిని పెడతా ", అన్నాను.

"బావా ఒకసారి ఊళ్ళో అలా భాలదుర్ తిరిగి రా... ఇంతలో  నీకిస్టమయిన Carrot హల్వా చేసి పెడతా ", అంది జాను ఆనందం గా. అలాగే అని ఊర్లోకి వెళ్లి నా ఫ్రెండ్స్ ని కలసి బాతాకాని అయిన తరువాత ఇంటికి వచ్చాను. రాగానే జాను నాకు Carrot హల్వా చిన్న బౌల్ లో వేసిచ్చింది. హల్వా చాలా సూపర్బ్ గా వుంది, నోట్లో వేసుకోగానే అది ఆస్వాదించే లోపే కరిగి కడుపులోకి వెళ్ళిపోయేది. టేస్ట్ ఎంత బాగుందో స్మెల్ అంత కన్నా బాగుంది...[హల్వా ని కూడా హీరొయిన్ లా వర్ణించడం ఏంటా అని ఆశ్చర్య పోకండి, కాలం అమ్మాయిలకు వంటిల్లు ఎక్కడుందో కుడా తెలియదు, సరే పొరపాటున వంట చేసినా  హాస్పిటల్ బిల్ తడిసి మోపెడు అవుతోంది కదా... అందుకని] నాకు స్వీట్ బాగా ఇష్టం అని జాను కి తెలుసు కాబట్టి నాపక్కనే కుర్చుని కొసరి కొసరి వడ్డించింది.

"ఒరే బడవా... ముందు టిఫ్ఫెన్ చెయ్ తరువాత కావాలంటే అది తినొచ్చు ", అంది అమ్మ.

"టిఫ్ఫెన్ రోజు తినేదే లే బావా... అత్త మాటలు పట్టించుకోకుండా Carrot హల్వా తిను ", అని ఇంకొంచం వేసింది జాను. ఇంతలో మా నాన్న గారు రావడం తో అందరం టిఫ్ఫెన్ కి  కూర్చున్నాం. నాకు అక్కీ మ్యాటర్ ని ఎలా స్టార్ట్ చెయ్యాలో, ఎలా కన్విన్స్ చెయ్యాలో తెలియక టెన్షన్ పడుతుంటే, "కంచం ముందు పెట్టుకుని ఆలోచనలేంటి రా ??? బొంచేయ్ ", అని గద్దించాడు మా నాన్న. నేను వెంటనే టిఫ్ఫెన్ ముగించాను. అందరిది  కంప్లీట్ అయిన తరువాత మెల్లగా స్టార్ట్ చేసాను.


" ఆమ్మ, నాన్న, జాను అందరూ ఒకసారి రండి, మీతో ముఖ్యమయిన విషయం మాట్లాడాలి ", అన్నాను.

అందరూ కుతూహలం గా హాల్ మధ్య లోనికి వచ్చారు.

"నాన్న, దయ చేసి నన్ను మధ్యలో ఆపకండి, నేను మాట్లాడటం ఆపిన తరువాత మీరు మాట్లాడండి", అన్నాను. అమ్మ కి, జాను కి విషయం అర్థం కాక వచ్చి సోఫా లో కూర్చున్నారు. మా నాన్నగారికి ఆల్మోస్ట్ విషయం అర్థం అయినట్టు అనిపించి, నా వైపుకి చూసాడు, స్టార్ట్ చేయ్యమన్నట్టు.

"నాన్న నేను  డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తున్నాను, నేను  ఆఫీసు లో అక్షర అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. తను నాకు వన్ ఇయర్ గా తెలుసు, చాలా మంచి అమ్మాయి, మన ఇంటికి సరిపోయే అమ్మాయి అని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను...", అని ఇంకా ఎక్స్ ప్లెయిన్ చేసే లోపు

"చెప్పుతో కొడుతా కొడకా నిన్ను... నీ ఇష్టం గా నువ్వు ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని ప్రేమించాను - పెళ్లి చేసుకుంటాను అంటే మేము  ఎలా ఒప్పుకుంటామని అనుకున్నవురా", అని కోపం గా అరిచాడు.

"అది కాదు నాన్న... ప్లీస్ ఫస్ట్ నేను చెప్పేది వినండి, తరువాత మీరు ఏమి చెప్పినా సరే...", అని కూల్ చెయ్యాలని ట్రై చేసాను.

"ఏంట్రా నువ్వు చెప్పేది మేము వినేది. పళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ప్రేమ పెంకులు అన్నావంటే. సమాజం లో మనకంటూ ఒక హోదా, గౌరవం వుంది. అది మరచిపోయి, ఎవరో కులం గోత్రం తెలియని దాన్ని కోడలిగా చేసుకోమంటే ఒప్పుకుంటామని ఎంత  ధైర్యం గా అడుగుతున్నావు రా. అయినా నిన్ను అని ఏమి లాభం...ముందు మీ అమ్మను అనాలి. ప్రతి దానికి నా కిట్టయ్య , నా కిట్టయ్య  అని వెనక వేసుకుని వస్తుంది ", అని కోపం తో అమ్మ వైపుకి చూసాడు. జాను కి అస్సలు ఏమీ జరుగుతున్నదో అర్థం కాక షాక్  కొట్టినట్టు నిలబడి పోయింది.

"అక్కీ చాలా మంచి అమ్మాయి నాన్న. జాను ఎలాంటిది అని మీరు అనుకుంటున్నారో, తను కూడా అలాంటిదే నాన్న...", అని కన్విన్స్ చేయ బోయాను.

"ఇంకో మాట మాట్లాడావంటే కాళ్ళతో తంతా నిన్ను...", అంటూ సోఫా లోంచి లేచారు మా నాన్న. పరిస్థితి అర్థమయి మా అమ్మ ముందు కి వచ్చి "ఒక్క నిమిషం మీరు కూర్చోండి, వాడితో నేను మాట్లాడు తాను ", అని నాన్న ను కూర్చోబెట్టి, నా వైపుకి తిరిగి " ఏంటి కిట్టయ్యా ఇది. అస్సలు నువ్వు ఏమీ మాట్లాడుతున్నావో, ఏమీ చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా !!! ఇంతవరకు మన ఇళ్ళల్లో ప్రేమ దోమ అన్నవి లేవు రా . అటువంటి పనులు నువ్వు చేస్తే... రేపు మనం ఊర్లో తల ఎత్తుకుని తిరగగలమా? ఒకసారి ఆలోచించు. చిన్నపటి నుంచి నీ మీదే  ఆసలు పెట్టుకున్న దీన్ని పరిస్థితి ఏంటి ", అని అమ్మ జాను నీ ముందుకు తోసింది.

"అది కాదు నాన్న, చిన్నపటి నుంచి జాను నాతో పాటే  పెరిగింది. నేనెప్పుడూ తనని అటువంటి ఉద్దేశం తో చూడలేదు. అయినా, ఒకే ఇంట్లో పెరిగిన మా ఇద్దరికి పెళ్లి చెయ్యాలని ఎలా అనుకుంటారు నాన్న ?", అన్నాను.

"రేయ్... ఎదవ సినిమా డైలాగ్ లంతా నా ముందు కొట్టకు, పళ్ళు రాలిపోతాయ్. జాను అంటే నీకు ఇష్టం లేక పోతే ముందే చెప్పి ఉండాల్సింది, అనవసరం గా అది నీ మీద ఆసలు పెట్టు కోక పోయేది ", అన్నాడు.

"అది కాదు రా, నీకు మరదలు లేక పోతే ఎవరిని చేసుకున్న మేము అడిగే వాళ్ళం కాదు, కాని నీ మీదే ప్రాణాలు  పెట్టుకున్న పిచ్చి దానికి ఏమని సమాధానం చెబుతావ్? ", అంది అమ్మ .

ఎవరి మీద అయితే తన ప్రాణాలు పెట్టుకున్నదో, అతనే ఇలా మాట్లాడుతుంటే ఏమి చెయ్యాలో అర్థం కాక సైలెంట్ గా ఉండి పోయింది జాను.

"నువ్వు ఏమి చెప్పాలనుకున్నావో, అది మాకు కాదు చెప్పాల్సింది, జాను కి. నీ నిర్ణయం వళ్ళ ఎక్కువ నష్ట పోయేది తనే. తన ఇష్టమే మా ఇష్టం ", అన్నారు ఫైనల్ అన్నట్టు మా నాన్న.

"ఇందులో చెప్పేది ఏముంది లే మామయ్య, బావ ఎవరిని ఇష్ట పడుతున్నాడో  వాళ్ళకే ఇచ్చి పెళ్లి చెయ్యండి. ఒక వేల నేను బావ ని కాక ఇంకొకరిని ఇష్ట పడుంటే, నన్ను వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేసి వుంటారు కదా", అంది ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుని పైకి గంబిరంగా.

జాను ని చూడగానే అందరికి జాలి వేసింది.

"చూడరా... తనకు నువ్వు అన్యాయం చేస్తున్నా, నువ్వు సంతోషం గా వుండాలని చూస్తోంది పిచ్చిది, దీనికన్నా నీకు మంచి భార్య దొరుకుతుందా ? నువ్వు జన్మ లో బాగు పడవు ", అని కోపం గా తిట్టి మా నాన్న అక్కడ నుంచి వెళ్లి పోయారు.

"కిట్టయ్యా... నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను సమర్దిస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు, నిర్ణయమే కాదు అస్సలు నువ్వే నాకు నచ్చలేదు. నాకు నీ సంతోషం కంటే జాను  భవిష్యత్తు ముఖ్యం", అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది అమ్మ.

అందరిని చూడగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇక ఏమి మాట్లాడక అక్కడే మౌనం గా కూర్చుండి పోయాను. జాను నా ప్రక్కన కూర్చుంటూ తల మీద చెయ్యి పెట్టి ఒధర్చడానికి ట్రై చేసింది.

"సారీ జాను, యాం రియల్లీ సారీ", అన్నాను జాను వైపుకి చూసి ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.

"ఏంటి బావా ఇదంతా!!! నా మీద ప్రేమతో అత్తయ్య, మామయ్య నిన్ను తిట్టారు కాని మరేం లేదు. వాళ్ళను ఒప్పించే భాద్యత నాది", అంది తల నిమురుతూ.


మధ్యాహ్నం ఎవరూ భోజనం చెయ్యలేదు. ఎవరి రూం లో వాళ్ళు వుండిపోయారు. రాత్రి ఎనిమిది అవుతున్నా, ఎవరూ ఎవరితో మాట్లాడ లేదు. జాను చొరవ తో లేచి అందరిని డైనింగ్ హాల్ దగ్గరకి తీసుకు వచ్చింది.

అందరి కి భోజనం వడ్డించి "మధ్యాహ్నం కుడా ఎవరూ తినలేదు, కనీసం ఇప్పుడయినా భోన్చేయ్యండి", అంది. కాని ఎవ్వరూ నోరు మెదప లేదు.

"ఏంటి మామయ్య ఇది, ఏదో ప్రపంచం బద్ధలయినట్టు, కొంపలు మునిగి పోయినట్టు అందరు అలా వుండిపోయారు", అని ఆగి "నేను నచ్చ లేదని బావ నన్ను వద్దనుకోలేదు, తను వేరే అమ్మాయిని ప్రేమించాడు కాబట్టే  అలా చేసాడు. ఇందులో తప్పేముంది ? తనకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకునే హక్కు తనకు వుంది, అంతెందుకు, నేను ఒక అబ్బాయిన ప్రేమించాను అని చెప్పి వుంటే మిమ్మల్నందరిని ఎదిరించి అయినా నా పెళ్లి జెరిపించి వుండే వాడు బావ, అటువంటి బావ ను ఎందుకు అందరు తప్పు చేసిన వాడి లా చూస్తున్నారు ", అని అంది.

"ఏంటే జాను ఇది... వాడు నీకు ఇంత అన్యాయం చేస్తున్నా... వాడికే సప్పోర్ట్ చేస్తున్నావ్. అయినా, దేవుడు నీకే ఎందుకు ఇన్ని కస్టాలు పెడుతున్నాడు ?", అని అమ్మ ఏడ్చింది.

"అత్తయ్యా, బావ కంటే మంచి భర్త ను మామయ్య తెస్తాడని నాకు నమ్మకముంది. కావాలంటే నా పెళ్లి చేసిన తరువాతే బావ పెళ్లి చెయ్యండి", అంది జాను. జాను చెప్పిన మాటలు అందరికి సమంజసం అనిపించడం తో అందరు భోజనం చేసి వెళ్లి పోయారు. అందరు కూల్ అయిపోవడం తో నేను కుడా భోజనం చేసి నా రూం లో వెళ్లి మంచం మీద పడుకున్నాను.

"బావా... రోజు నేను నీ ఒడిలో పడుకోవచ్చా? తరువాత చాన్స్ నాకు వస్తుందో రాదో ?", అని జాను అడిగింది. మొదటిసారి జాను నన్ను పర్మిషన్ అడిగింది. తనకు ఏది కావాలన్నా గొడవపడి వీలైతే కొట్టి మరీ నా దగ్గర నుంచి లాక్కునేంత చనువు వుండేది. కాని మొదటి సారి గా ఇలా పరాయి వాళ్ళను అడిగినట్టు నన్ను పర్మిషన్ అడిగింది

"ఏంటి జాను ప్రశ్న... ఎప్పుడూ నేను ఒప్పుకోక పోయినా నా కాళ్ళను లాగి మరీ పడుకుంటావు గా. ఇప్పుడు మాత్రం అడుగుతున్నావ్ ఏంటి!!!", అని నా కాళ్ళను చాపాను. జాను నా తోడ మీద తల పెట్టి పడుకుని "ఏమో బావ మొదటి సారి నిన్ను పర్మిషన్ అడగాలనిపించింది ", అంది. మాటకు నాకు జాను కళ్ళలోకి చూసే ధైర్యం కూడా లేకపోయింది.

"ఎవరు బావ అక్షర ? మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? "

"తను నా కొలీగ్ జాను. విజయవాడ అమ్మాయి. నీ లాగే తను చాలా మంచి అమ్మాయి. ఫ్రేషేర్  గా మా ఆఫీసు లో జాయిన్ అయింది. మొదటి సారి అక్కీ ని గుళ్ళో చూసాను. సన్నటి వర్షం లో తను గుడి మెట్లు దిగుతుంటే నా మనస్సు ఎందుకో నన్ను వదిలి అలా అక్కీ తో పాటే  వెళ్లి పోయింది. " Love at first sight ", అంటే నాకు తెలియదు కాని మొదటి సారి తనని చూడగానే  నచ్చేసింది, అది ఎందుకంటే చెప్పలేను, ఎంత అంటే చూపించలేను బట్ నా మనస్సు మాత్రం తనే కావాలి, తనతో నే వుండాలి, అని కోరుకునేది... ",అని మొత్తం స్టొరీ అంతా చెప్పి జాను కి ఇష్టమయిన 5 Star చాక్లెట్ ను ఇచ్చాను.

"అన్ని భాధలని  5 Star తెర్చలేంది బావ. అయినా నేను మామయ్య దగ్గర చెప్పాను కాని, నన్ను నీ కన్నా ప్రేమ గా చూసుకునే వాడు దొరకడు బావ ", అంది కన్నీళ్ళు పెట్టుకుని. వెచ్చనయిన కన్నీళ్ళు నా తొడకు తగలడం తో, నన్ను ఇంత గా ప్రేమించిన జాను ఏడిపిస్తున్నందుకు నా మీద నాకే అసహ్యం వేసింది.

"నిజం చెబుతున్నాను గా జాను, నాకు అక్కీ కంటే నువ్వే చాలా ఇష్టం, బట్ ఇష్టం వేరు ఇష్టం వేరు. నన్ను అర్థం చేసుకో", అన్నాను భాదగా.

"నువ్వు నా హీరోవి బావా, నా సూపర్ మాన్ వి. అలాంటిది నువ్వు నాకు సంజాయిషీ చెప్పడమేంటి !!!", అని వస్తున్న కన్నీళ్ళు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ నా ఒడిలోనే పడుకుని నిద్ర పోయింది
నేను కూడా చెమర్చిన కళ్ళను తుడుచుకుని, అలాగే ప్రక్కనున్న దిండుకు అనుకుని పడుకున్నాను.


అప్పుడే
 అయిపోలేదు... ఇంకా చాలా కథ వుంది ... Stay Tuned

7 comments:

  1. Hi Vicky,

    as it is 6th part also cool nd natural konchem kannillu start ayyayikada Janu character kuda baagundhi avunu miku lover ledhu antunnaruga atleast maradhalu ayina undha?.... Akkiki love propose cheyyaledhuga aa suspence inka continue chesthunnaru eppudu chepthadu mi Arju?

    ReplyDelete
    Replies
    1. Paddu,

      Boledantha prema tho paatu konchem kannellu kudaa start ayindhi.
      Arjun gaadu Jaanu ni edipinchaadu gaa... so vaadu kudaa kastha edisthe baguntundhi. leka pothe Vilan ayipothaadu. Hahaha...

      Vicky

      Delete
  2. Vikram Garu..

    Intlo tension teeripoindi kabattti... me Arju ki konchem dhyaram noori posi tondaraga prapose chimanandi tensoion to chastunnam.... :)

    ReplyDelete
    Replies
    1. Sree,

      Hmmm... intlo tension theeripoyinaa... ontlo dhairyam vundaali gaa prapose cheyyadaniki. Any ways, vadiki chebuthaa thondaragaa express cheyyamani... chuddham eppudu chesthoado.

      Vicky

      Delete
  3. Vicky,

    This episode also Suppppprrrrrbbbb...
    దూరం గా ఆకాశం లో నిండు చంద్రుడు,
    హాయి గా వీస్తున్న చల్లటి గాలి,
    ఆ గాలి కి కదులుతూ నాకు చంద్రుడికి మధ్య లో ఊగుతున్న మామిడి చెట్టు కొమ్మలు,
    ప్రకృతి కన్నా మధురం గా వినిపిస్తున్న వేటూరి - ఇళయరాజా గారి పాటలు

    Intha andhamayina cooll thoughts niku elaa vasthundhi? Manchi Poetic thoughts vunnay ni daggara.
    Nijam gaa ni Gal frend chalaa chalaa adrustavanthuraalu.

    Shruthi

    ReplyDelete
  4. Vicky,

    7th part eppudu update chesthunnav... fans waiting ikkada. Thondaragaa upload cheyy.

    Shruthi

    ReplyDelete
  5. super..chala baga rasaru..eughth part eppudu coming.???

    ReplyDelete